సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడు చలసాని
(జులై 27న వైజాగ్లో కామ్రేడ్ చలసాని ప్రసాద్ పదో వర్థంతి సందర్భంగా జరిగిన 'శాంతి చర్చలు -విప్లవ పంథా ' సదస్సుకు పంపిన సందేశం ...) ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఉంటూ సి. రాఘవా చారి నేను శ్రీశ్రీ కి కాపలాగా ఉన్నప్పుడు ఆయనను రైల్లో స్టాలిన్ ప్రజాశక్తి దగ్గరికి లాక్కపోయిన వాడు చలసాని. మా ఊళ్లో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇంకా కొత్త స్నేహితులను భరించలేను అంటున్న కాళోజీని కె.ఎస్,కృష్ణక్క కుటుంబాల్లో భాగం చేసింది ప్రసాదు. ఆయన తొలి ఉద్యోగాలు హైదరాబాదులో ఫిషరీస్ కాజీపేటలో రైల్వేస్. నీళ్ళల్లో చేపలా ఈదడం ఆయనకు తెలంగాణ సాయుధ పోరాట