కవిత్వం

తస్లీమా నస్రీన్ జైలు కవిత్వం

అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో తస్లీమా నస్రీన్ పేరు తెలియని వారుండరు.ఆమె బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ నగరంలో 1962 లో జన్మించారు. 1984 లో మెడిసిన్ పట్టా పుచ్చుకొని, బంగ్లా రాజధాని ఢాకాలోని ఆసుపత్రులలో ప్రసూతి నిపుణురాలుగా, మత్తు వైద్యురాలుగా పని చేసారు. తన మెడిసిన్ చదువుల కాలంలోనే ఆమె బలమైన స్త్రీ వాద రచయిత గా రూపొందారు.పిదప కవిత్వమూ, నవలలు , వ్యాసాలు ప్రచురించారు. ఆమె ప్రచురించిన 'లజ్జ'  (Shame,1993 ) నవల హిందూ ముస్లింల మధ్య ఉద్విగ్నతలను ప్రమాదకరంగా  రెచ్చగొట్టే విధంగా వుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం 1994 లో నిషేధించింది. ఆమె లౌకిక, స్వేచ్చాయుత దృష్టికోణం ముస్లిం
కవిత్వం

మహమూద్ రెండు కవితలుమహమూద్

1 జీవనయానం నేను నీ పాటలు పాడుతుంటాను మశీదు ప్రాంగణంలో దినుసులు తినే పావురాల్లా వాళ్ళు గుమిగూడతారు జీవనసాగరపు లోతుని పాటలు వాళ్ళకి పరిచయం చేస్తాయి కటిక నేల మీదా బురద వాలులపై జీవన శకలాలని జారనిచ్చేవారు జారుతూ జారుతూ గాయపడడమే బతుకైన వారు ఎడారి ఎండ వేడి చురుకుని పాదాలపై మోసేవారు లోయల లోతుల్లోంచి కనబడని ఆకాశంకై భూఉపరితలాన్ని తాకే కలలు కనేవారు సాగించాల్సిన ప్రయాణ భారాన్ని లెక్కించుకుంటారు పాటల గూడార్థం అర్థమైన తర్వాత వాళ్ళు సీతాకోకచిలుకల్లా మారిపోతారు మనోభారం దిగిపోవడం కంటే గొప్పదేమీందీ లోకాన! అన్ని బలహీనతల బరువులను దించుకొని పావన హృదయంతో వాళ్ళు ప్రపంచంలోకి
కవిత్వం

ఉదయ్ కిరణ్ నాలుగు కవితలు

1 మల్లయోధులం నాడు మా బలమైన భుజాలపై ఈ దేశ మూడు రంగుల జెండాను గర్వంగా ఒలంపిక్స్ నుంచి ఢిల్లీ నడి వీధుల్లోకి మోసినప్పుడు మీ పొగడ్తలకు పొంగిపోయి మేము గెలిచిన పతకాలను చూసినప్పుడు మేము ఈ దేశంలో భారతమాతలమైనాము నేడు మాపై జరుగుతున్న లైంగిక దాడులపై న్యాయపోరాటం చేస్తుంటే మీలో రవ్వంతైనా చలనం కలగకపోవడం కాషాయ నీడలు ఎంతలా కమ్ముకున్నాయో, రాజకీయ మతోన్మాదం కాళ్ళ కింద నలుగుతున్న మీరే సాక్ష్యం పార్లమెంటు ముందు పోలీసులు మమ్మల్ని హింసాత్మకంగా ఈడ్చుకెళ్ళి జైల్లో బంధిస్తుంటే ఈ దేశ రక్షణ, గౌరవం ఎప్పుడో బంధించబడ్డాయని మాలో ధైర్యం నిప్పంత నిబ్బరాన్ని రగుల్చుకుంది
కవిత్వం

అడవి దేవత

ఆమాస రేయి అడవిలో నెత్తుటివాన కురుస్తున్న వేళ .. ఆమె .. తెగినపేగుల్ని ముడేసుకొనీ జల్లెళ్లయిన ఒరిగిన వీరుల దేహాల్లోంచి చిమ్ముతున్న నెత్తుటిదారను కడవలకెత్తుకొనీ .. వాగులో కలుపుతోంది ! వాగు .. ఎరుపెక్కిన ఆకాశంలా .. ! ఆమె .. రాలిపోయిన పొద్దులకు చీకటివాగులో చితిమంటల స్నానం జేసీ ఆరిపోయిన చితిని చేటకెత్తి విత్తులు వెదజల్లినట్టు పిడికిళ్లతో కాటిబుగ్గిని పొల్లాల్లో వెదజల్లుతోంది ! పోడు .. పోరువంతమైన ఆకుబట్టలా .. ! 'ఎవరమ్మా వీళ్లంతా ..' దగ్ధకంఠంతో ఆమెనడిగాను దుఃఖపుదారిలో ..! 'యీ దేశపు నుదుటాకాశం మీంచి రాలిపోయిన కుంకుమ పొద్ధులు .. పేగుతెగిన తల్లుల కడుపుకోతలు
కవిత్వం

కొన్ని ప్రశ్నలు

ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు. నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం. నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు. విరిగిపోతున్న అనుభవాల సమూహం. ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు? ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తూ పొల్లుగానే మిగిల్చే ఈ పెనుగాలు లెక్కడివి? ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య మసిబారుతున్న జీవన కాంతుల మధ్య తుఫానుల విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి? ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు? 1 సందేహాల మధ్య, చావుబతుకుల మధ్య, సర్ప పరిష్వంగాల నడుమ కరుగుతున్న జీవితాలు. ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు. 2 దూరం దూరం మనిషికీ మనిషికీ మధ్య
కవిత్వం

వలస కావిడి

నెత్తిన నీళ్ళకుండ భుజాన సూర్యుడు ఆకలిముల్లు గోడలపై ఎగాదిగా ఎగబాకిన పాదాలు లాగేసిన కంచంలో ఆరబోసే తెల్లారికై చుక్కల పరదాతో రాత్రంతా కొట్లాడిన పాదాలు ఇంటి కుదుర్లు జల్లిస్తూ కార్పొరేట్ కాలేజీ వంటపోయ్యిలో కట్టెలవుతున్నాయి పుట్టినూరు నోరు తేలేసినందుకు... దేహాన్ని కప్పే సిమెంట్ రేకుల పగుళ్లలో విరిగిన బతుకులు చినిగిన గౌను లాగూ లేని చొక్కా ఆడుకోడానికి నలుగురు దోస్తులూ లేని గిరాటేసిన బాల్యం ఇక్కడ వంటపాత్రల కింద మసి పలక అందరికీ నిలువెత్తు ఊపిరైన వూరు ఆరో మెతుకును అడగకుండానే ఇచ్చిన నేల సంపెంగ మీసాల పుక్కిలింత వలస కావిట్లో నిట్టనిలువునా కాలిపోతోంది.
కవిత్వం

చేరని తీరం

అతనలా ఆ గుంపులో నిండు పున్నమిలా తన చుట్టూ పరిభ్రమించాను నేనెప్పటిలా దశాబ్దాల దూరాల మధ్యనే గూడుకట్టిన ఓమాట ఓ పలకరింపు ఓ కరచాలనం ఎప్పటిలానే కల కరిగిపోతోంది ఇలా నీరింకని కళ్ళను ఓదార్చుతూ గొంతు పెగలని దుఃఖం సుడిగుండమై మిగిలిపోతుందిలా నాలోలోపల.
కవిత్వం

రూపాంతరం

నీకోసం నేకవితలు రాయలేను. రూపాంతరం చెందిన దుఃఖగాధ ల్ని మాత్రం విప్పగలను వసంతం తరలిపోయింది ఎండాకాలపు ఒడిలో స్వార్థపు క్రీడల్లో నదులు ప్రేతాత్మల్లా కళ్ళు తేలేశాయి అవతల ప్రైవేటు ఆస్తుల సైన్ బోర్డులు పెటపెటలాడుతున్నాయి. ఇంతకు చేపలన్నీ ఎక్కడికెళ్లాయి వన సంరక్షణ సమావేశంలో ప్లేట్లలో ముక్కలుగా నిండిపోయాయి వాటి తెల్లని కనుగుడ్లను జాగ్రత్తగా పీకేశారు ఓ ఘనమైన మెమొరాండంను మాత్రం వాటి ముందు చదువుతారు చచ్చిన చేపలకు అది వినపడుతుందా.. *** చంకలో వెంట్రుకల్ని సాపు జేసినట్టు భూమి మీద చెట్లను సాపు చేస్తారు నున్నగా గొరిగిన భూమి నిత్యాగ్ని గుండమైతే మనం సమాధి నుండి లేచిన ప్రేతాత్మల్లా
కవిత్వం

గెంటి వేయబడ్డ వారి కోసం పాట!

నిజం వాళ్ళు అబద్ధం చెప్పారు..ఈ వీధులేమీ బంగారంతో చేయబడలేదని అరిచి అరిచీ నా గొంతు బొంగురుపోయింది.. చివరకు నాకు కఠోరమైన జీవితమే దక్కింది. వాళ్లన్నట్లు ఈ వీధులు బంగారంతో చేయబడ్డాయా ..లేదు పచ్చిఅబద్ధం ఇది ! ప్రమాదాలతో..నిండి ఉన్న వీధులు ఇవి. నాకు తెలుసు ! కానీ ..ఈ లోపల ఓ అద్భుతం జరిగిపోయింది. ఈ రాత్రి నేను కూడా వాళ్ళలా ఉండడానికి.. నాలోపల ఒక విచిత్రమైన మనోలైంగిక మానసిక స్థితి సంసిద్ధమై పోయింది ! వాళ్ళు నన్ను నా నడుము దాకా మీలో...మిమ్మల్ని నాలో చూసారు. వాళ్ళు నన్ను ... మిమ్మల్ని నేను కళ్ళతో తాగేయడం చూసారు.
కవిత్వం

కుకవులు

చంద్రయాన్ మీద కవితలు ప్రశంసలై రాలుతున్నాయి దేశంలో స్త్రీలను మనువాదులు నగ్నంగా నడిపిస్తే కలాలు చూస్తూ మనకెందుకులే అనుకుంటున్నాయి మన జాతి కీర్తి ఆకాశంలోకి రాకెట్లలా దూసుకుపోతుందని అక్షరాలతో నమ్మబలికి, రోడ్ల మీద ఆదివాసీలపై మూత్రం పోస్తున్న కవుల కలాలు చోద్యం చూస్తూ మధ్యయుగాలలోకి కాలయానం చేస్తూ ఈ గళాలు మౌనంగా ప్రభుత్వాలను శ్లాఘిస్తున్నాయి మానుషం అతి భయంకర అమానుషమై ద్వేషం దేశభక్తి తోలు కప్పుకొని విచ్చలవిడిగా దేశాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నా, వంధిమాగదులైన కవుల కలాలు ప్రజాద్రోహులై నిరంకుశ పాలకులతో సన్మానాలు సత్కారాలు పొందుతూ ముసి ముసిగా మురిసి పోతున్నాయి మానవత్వం కోసం పరితపించే మేధావులను న్యాయం