కవిత్వం

దేవుడు  మాటాడాడా?

టీచరమ్మ చేతిలో బెత్తం ఎంత గట్టిగా కొట్టినా అప్పుడు ఏడుపొచ్చేది కాదు నాకు రాని వారం పేరేదో గుర్తుంచుకోవాలని కొట్టారనో హోం వర్కు చేయడం డుమ్మా కొట్టాననో ఇంట్లో నూనెలేక తలకు పెట్టుకోలేదనో నా తోటి మిత్రున్ని ఆట పట్టించాననో చింత బెత్తంతో తగిలిన బాధను పంటి బిగువన పట్టి చేయి దులుపుకునే వాణ్ణి! కానీ ఇప్పుడు నా ముఖంపై ముద్ర వేసిన మతం నన్ను వెక్కిరిస్తూ తరగతి గదిలో నన్నొంటరిని‌ చేసి రోజూ హత్తుకుని ఖుషీగా ఆటలాడుకుంటూ ఒకరికొకరం అన్నదమ్ములా భుజాలపై చేతులేసుకుని గంతులేసే మా మధ్య గోడను కట్టే ఈ తృప్తి త్యాగి టీచరమ్మలు మొలుచుకొచ్చి
కవిత్వం

ఆకుపచ్చని అమ్మ 

ఓ గొంతు మూగబోతే ఆ గజ్జె నీది కానేకాదు ఓ స్వరంలో అలలు ఎగిసిపడటం ఆగిపోతే కొన్ని అలల్లో కొన్ని కాంతులు మాయమవుతే ఆ సముద్రం నీది కానేకాదు కటకటాల వెనుక కాంతిరెక్కవు నువ్వు నీ సముద్రం, నువ్వైన సముద్రం ఎప్పటికీ ఆవిరి కాదు, ఎన్నటికీ మూగబోదు ప్రజాద్రోహం చేయకూడదని పాఠాలు చెప్పినవాడివి నీ కంఠం ఆదివాసుల పేగుల్లో కవిత్వం పలుకుతున్నది నీ కంఠం అన్నం మెతుకులకు కవాతు నేర్పుతున్నది మనిషి అమరుడైతే ఓ కంటిని తడి చేసుకున్న వాడివి మరో కంట్లో కత్తులకు బట్ట చుట్టని వాడివి అమరుల కనురెప్పల కవాతులో ఓ రెప్పవైన వాడిని నవ్వులో
కవిత్వం

నిక్లో సాథీ నీcద్ హరామ్

ఏ క్యా హోరహా హై ఆంఖోన్కే సామ్నే ఏ క్యా చల్ రహా హై డెమొక్రసీకే ఆడ్మే సుధార్ కా నామ్ బర్బాదీ ఆమ్ తరఖ్ఖీ నారా తబాయి పూరా అబ్ క్యా హువా మేరె దేశ్కో సాcస్ ఛోడ్ కే లాష్ బనేగా..!? ఓ ఖుదాయీ ఏ ఫుడాయీ రాస్ తేకే నాంపే మషీనోc కీ దౌడాయీ సారే ఖుద్రతీ జమీ ఔర్ జంగల్ కే జాన్ జైసే న్యామతోc కో లోడ్పేలోడ్ జమా జమాకే దేశ్ పార్ కరానే ఎత్రాజీ కే గలే దబాకే జాగ్ నే వాలోంకో జడ్ సే మిటాకే ఖానూన్ అప్
కవిత్వం

ఏకత్వం

ప్రియా! అన్వర్ ఇంటికాడ పీరీలు కట్టిన యాపశెట్టు మొదట్లోనే ఎలిశిన పుట్టకు పసుపు కుంకుమల పూజ చేయడానికి నీవొచ్చినపుడు ప్రేమంటే ఏంటని నేనడిగితే ఏమన్నావు? ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకోవడం! ఒకరి ఇష్టాలను ఒకరం గౌరవించుకోవడం! స్వేచ్ఛను స్వేచ్ఛగా ఆస్వాదించడమనే కదూ..? నేను తురకను! నీవు హిందువువి! మనం ప్రేమించుకోడమెట్లా? అన్నపుడు ఏం నీవు మనిషివి కాదా? అని నువ్వు సూటిగా అడిగినపుడు మబ్బులు తొలగినఆకాశమైంది నా ముఖం ! నేను ఆవు కూర అని నసుగుతుంటే- నెయ్యి కూడా దాని రక్తమేలేనని నీ తినే అన్నం చేతిని, నే తినే అన్నం చేతితో ప్రేమగా అలాయి -
కవిత్వం

నా కవిత్వం ప్రయోగశాల

కవిత్వమొక అంతర్నిర్మిత జ్వాలా రౌద్రాన్వేషణ రక్త ప్రవాహల్లో ఎదబీటల స్పర్శఅనుఘర్షణ స్పర్శాను ఘర్షణ కాలం కనురెప్పపై ఎప్పటికీ ఆరని నీటిచెమ్మనై అగాధపు తిమిరంలో వెన్నెల రేయిలా నను స్పర్శించేదీ కవిత్వమే కవిత్వమే కవిత్వమంటే నిరంతర జ్వలితం, నిరంతర రక్త ప్రవాహం కదిలే కాలగమనాన్ని మదిలో మెదిలే కన్నీటి సంద్రాన్ని వర్ణించేది కవిత్వమే... ఇప్పుడే వికసించిన తొలి అంకురాన్ని అప్పుడే ప్రసవించి రెప్ప విప్పకుండా పొదల్లో ఏడ్చి స్పృహ కోల్పోయిన ఆడబిడ్డ నిద్రని వర్ణించేది కవిత్వమే కవిత్వమొక ప్రయోగశాల ప్రతి ప్రయోగంలో సరికొత్త ఆవిష్కరణ ప్రతి పదంలో వింత్తైన పాదరస వైవిధ్యం ప్రళయకాలంలో ప్రభంజన గర్జనలా హృదయాంతాలలో అగ్ని పర్వతంలా
కవిత్వం

పరాభవమే!!

వాడు ఆమెను అచ్చట పీఠమెక్కించి మదంతో పేట్రేగుతున్నాడు వీధుల్లో జనావాసాల్లో ఒక కూలి కూలి డబ్బులు అడిగితే దౌర్జన్యం కూలిపై మూత్ర విసర్జన ఎక్కడిదా ధైర్యం?! ఎవడ్ని చూసుకుని ఆ దుశ్చర్య?! వాడు వాడి మను బంధువు కాబట్టే! ఆమె ఆది వాసి కూలి ఆదివాసి ఆమెకీ పరాభవం కూలికీ పరాభవమే తేడా ఏం లేదు అక్కడ కుర్చీ ఇక్కడ నేల అంతే!! చట్టం వాడికి చుట్టమే అవుతుంది ఎవడు కాదన్నా! ఫిర్యాదుకే భయ పడిన కూలి ఇక రాబందుల బెదిరింపులతో హడలి పోవు గోమూత్రం తాగే వాడు గో మలాన్ని ముఖానికి పూసుకునే వాడు అజ్ఞానం తో
కవిత్వం

అసాధ్యం

ఏ బాటసారికి తెలుసు, తను నడిచే దారుల్లో అణచబడ్డ రాళ్లకథ!! ఏ పువ్వులు తీర్చేను, తను వికసించే సాయంలో దాయబడిన వేర్ల కల!! నేలైనా అడిగిందా, తనకు రంగులద్దే రైతు వ్యధని!! పంటకు తెలుసో లేదో, చినుకు రుణం తీర్చలేనిదని!! దీపాలు ఒప్పుకోగలవా, చమురు మింగి బ్రతికామని.. కన్నీరు చెప్పగలదా, తన పుట్టుక కారణాన్ని.. అక్షరాలు రాయగలవా, యదనలుముకున్న మౌనాన్ని.. మనిషి నగ్నంగా తిరగగలడా తన ముసుగులన్ని వదిలేసి!!
కవిత్వం

మణిపూర్ ఒక్కటే! సీతలే అనేకం

మలయ మారుతాలెక్కడివి దేశం నిండా ముళ్ల కంచలే పచ్చని పంటలాంటి పైటలెక్కడివి రథచక్రాలు నడిచిన దారిలో చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే వున్నది నా శరీరానికి రంగేమిటని నన్నడగబోకు ఏ జాతికి చెందినదాన్నో నన్నడగబోకు సిరి సంపదలున్న దేశంలో సీకులు దిగిన దేహం నాది గంగా నదిలో పారుతున్నది ఏమిటని ఇంకా నన్ను అడగబోకు సరస్వతీ దేవిని చావబాదిన చరిత్ర నీది లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది పార్వతీ దేవిని చెరిచిన మేధస్సు నీది తిరంగ జెండాను చీల్చడానికి త్రిశూలాలను తయారు చేసిన చెడ్డీ నీది నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది ఫాసిజంలో ఫస్టు
కవిత్వం

మణిపూర్ మినిట్స్

అక్కడి మందార పూల రంగులన్నీ మా అక్కల నెత్తుటితో అద్దిన మెరుగులే...! అక్కడి వాకిట్లన్ని మా చెల్లెల కన్నీళ్ళతో అలకబడినవే....! అడుగు నేల కోసం అంటుకున్న మంటలు కావవి…! పాలకులే ఉత్ప్రేరకాలై ఉసిగొల్పబడ్డ అల్లర్లే…! మణిపూర్ ఇప్పుడు సర్జరీకి నోచుకోలేక పోస్టుమార్టంకు దగ్గరవుతున్న రోగి..! ఏ కృష్ణుడి సాయాన్ని నోచుకోని ద్రౌపది...! రామరాజ్యంలో ఊరేగే శవాల బండిపై ఎందరో తల్లుల కన్నీళ్ళ వడపోత...! అంతా ఆంతమయ్యాకా మణిపూర్ మినిట్స్ అంటూ ఆ మంటల సెగలను దేశమంతా వ్యాపితం చేసే మతోన్మాద పాలకుల చేతుల్లో ఓట్ల సాగరమైంది...!
కవిత్వం

కన్నీటిని రాల్చకు

నాకోసం కన్నీటిని రాల్చకండి వీలైతే కొన్ని అక్షరాల ఆమ్లాన్ని జల్లండి దీనంగా చూస్తున్న ఈ నాలుగు దిక్కులు అంతమవ్వని.. నా మీద జాలి చూపకండి కొన్ని పల్లేరు కాయల్ని నాటండి రేప్పొద్దున ఆ దారి గుండా నడిచే మత రాజకీయాల కాళ్ళను చీల్చనీ.. నాపై అమాయక స్త్రీ అని ముద్ర వేయకండి ఈ నీచ సంస్కృతి, సంప్రదాయాలను బోధించిన మత గ్రంథాల, కుల గొంతుకలకు నిప్పెటండి కాలి బూడిదవ్వని.. నన్ను ఇలానే నడిపించండి కశ్మీర్ నుండి కన్యాకుమారి దాక 21 వ శతాబ్దపు దేశ నగ్న చరిత్రను పుటలు పుటలుగా చదివి కాడ్రించి ఉమ్మనివ్వని.. నా తరపున న్యాయ