హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా అన్యాయం పట్ల ప్రతిఘటనగా జీవన గాయాలపై ఓదార్పుగా కవి రచనా శైలి సాగింది. ఈ కవి రచన శైలి చాలా ప్రత్యేకం ఆయన కవిత్వంలో అలంకారాలు తక్కువే కానీ ప్రతి పదం వెనుక జీవన సత్యాలు కన్నీళ్లు కనిపిస్తాయి. ఆయన రాసే ప్రతి కవితలో సూటితనం గాఢమైన లోతు కూడా కనిపిస్తుంది తన అనుభవాలను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజపు అనుభవాలను కూడా పాఠకులకు అనుభవింపచేస్తాడు..

 గుండెకు చూపున్న కవిత్వం కవితలో ఆయన కవిత్వంపై ఉన్న అవగాహన బయటపడుతుంది కవిత్వం గుండెకు దర్పణం అని,. అది కేవలం శబ్దం కాదని ఆయన స్పష్టం చేశారు కవి దృష్టిలో కవిత్వం అంటే ఒక పోరాటం అదే ఆయన శైలికి మూలం..సింధూరం లాంటి కవితలో స్త్రీ వేదనను చెప్పేటప్పుడు ఆయన మాటలు సునితంగా ఉంటాయి. ఆ సున్నితత్వంలోనే శక్తి కనిపిస్తుంది ఒక స్త్రీ తన జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితిని సమాజపు కఠిన బంధాలను ఆయన పదాల లోతును తెలియజేస్తాయి. మణిపూర్ మినిట్స్ లాంటి కవితలు కవిలోని ఉద్యమకారున్ని బయటపెడతాయి. ఆయనకు కవిత్వం అనేది కేవలం భావుకథ కాదు అది ఒక ఆయుధం అన్యాయం హింస దౌర్జన్యం పట్ల కవికలం ప్రశ్నిస్తుంది ఇక్కడ కవిశైలి ఆగ్రహంతో నిండిపోతుంది ఆగ్రహం కూడా ఆయన అక్షరాల్లో ఒక భావంగా మారింది..

హతిరామ్ కవిత్వంలోని బాటసారి కవిత్వం చాలా బలంగా వినిపించే శబ్దం నా కాలి బొబ్బల నెత్తురు ఈ పాడుబడిన బాటకు కొత్త కళను తెస్తున్న నాకు బాధ లేదు ఇప్పుడు  కాకున్న ఏదో ఒక రోజు కచ్చితంగా నేను నా గమ్యాన్ని చేరుకుంటా నా  బయమళ్లా ఒకటి నిండు ఎడారిలో మానవత్వం అనేది లేకుండా తడి బట్టతో కుతికే కోసినట్లుండే..అదే సమయంలో ఫీనిక్స్ లాంటి కవితల్లో ఆయన కలం ఆశను రగిలిస్తుంది బూడిదల నుంచి మళ్లీ పుడుతున్న పక్షీలా మనిషి కూడా తిరిగి లేవగలడని కవి చెబుతారు ఇక్కడ కవి శైలి ప్రేరణాత్మకంగా మారుతుంది పాఠకుడిలో ధైర్యం నింపుతుంది. అలాగే అమ్మ నువ్వు యాది కొస్తే కవిత లో ఆయన శైలి మృదువుగా హృదయానికి దగ్గరగా ఉంటుంది తల్లి గురించి రాసేటప్పుడు ఆయనలోని ఆప్యాయత ప్రేమ మమకారం ప్రతిభంబిస్తాయి తన తల్లిని గురించి యాదిచేసుకుంటూ రాసిన కవి రచనా శైలికి పాఠకులు సైతం ప్రశంసింపక తప్పదు ఇది ఆయన రచనలోని కవిత మాధుర్యం అని చెప్పవచ్చు.. హతిరామ్ రచనలో ఒక ముఖ్యమైన అంశం ఆయన తన మూలాలను మర్చిపోకుండా “నా తండా గోస” తన తండాలోని ప్రజల వేదనను రాయడం ద్వారా ఒక వర్గం గొంతుకగా నిలుస్తాడు ఇక్కడ కవిశైలి ఒక దుఃఖ భరిత గీతంలో ఉంటుంది ఆయన కవిత్వం ఒక వ్యక్తి అనుభవం మాత్రమే కాక ఒక సమాజపు చరిత్ర అవుతుంది..

హతీరామ్ కవిత్వం అంటే విరుద్ధాల సమాహారం ఒకవైపు ఆగ్రహం మరోవైపు మమకారం ఒకవైపు సమాజపు గాయాలు మరోవైపు జీవన ఆశ. ఆయన శైలి చాలా సహజంగా అంతే లోతుగా సాగింది కవిత్వంలోని అలంకారాల కంటే కవిలోని నిజాయితీ ముఖ్యం కవిత్వంలో నిజం మాత్రమే చెబుతూ ఆ నిజం మనసును గాయపరుస్తుందని, ప్రేరేపిస్తుందని, కన్నీళ్లను తెప్పిస్తుందని, పాఠకులకు తెలియజేస్తుంది. నల్లింకు పెన్ను పుస్తకం ద్వారా హథిరాం ఒక కవి మాత్రమే కాదు ఒక ఉద్యమాకారుడిగా, ఒక సాక్షిగా,ఒక ప్రేమికుడిగా, ఒక బాధ్యత గల కొడుకుగా, అన్ని రకాలుగా ఆయన రచన శైలి పాఠకులను మెప్పిస్తుంది. ఇది కవి యొక్క మహత్తర విజయంగా చెప్పవచ్చు

Leave a Reply