కవిత్వం

సంక్రాంతి

నగరాలు పట్టణాలు ఖాళీ పల్లెలు రద్దీ పండుగ సంక్రాంతి గొట్టాలు ఊదరగొట్టే వాతావరణం గతం వర్తమానం విషమం పల్లె తరిమితే పట్టణీకరణ  బహుళ అంతస్థులే అభివృద్ధి భ్రాంతుల ప్రజ పండుగకి పల్లెకు పయనం ద్రవ్యం పల్లెల్లో జొరబడింది  ప్రపంచీకరణ తో పల్లె విధ్వంసం పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ల మార్పిడి లేదు అంతా పెట్టుబడి సంకలో సేద తీరు రాశుల కొద్దీ ధాన్యం లేదు వాణిజ్య పంటల ధాటికి నేల నిస్సారంగా పెట్టుబడి అమ్మేదే ఎరువు పెంట దిబ్బల్లేవు చెరువు మట్టి తోలేది లేదు అదే నేల కిందికి మీదికి దున్నితే ఏం వుంటది! సారం!! పంటలో
కవిత్వం

మనోభావాలు

శాకమూరి రవి నాకు రాయిని చూపి  రాముడని నమ్మించి  రాజ్యాలేలే చోట  నేను రాయిని 'రాయని'నిజం మాట్లాడితే  వాని మనోభావాలు   దెబ్బతినవా మరి   నాకు మనుధర్మమే  ధర్మమని నమ్మించి మనుషుల మధ్య   మంటల్ని సృష్టించి  రాజ్యాలేలే చోట  నేను మనుధర్మం గుట్టువిప్పితే  వాని మనోభావాలు దెబ్బతివా మరి  నాకు  అశాస్త్రీయాన్ని  శాస్త్రీయమని  నమ్మించి నా అణువణువునా  కర్మసిద్ధాంతాన్ని కరింగించి అందమైన రాజ్యభవనంలో  కునుకుతున్న మనువుకు  నేేను శాస్త్రీయ గీతాలను అందుకుంటే   వాని మనోభావాలు  దెబ్బతినవా మరి.  
సాహిత్యం కవిత్వం

ఒక రహశ్యం చెబుతా..

పట్టుపరుపులు లేవుజారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు అప్పుడంతానడక నేర్పిన పూల దారుల పెరళ్ళవిఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమదినిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమదిఅప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే! ఇప్పుడుఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాంఇద్దరి మధ్యా కొలవలేనంత దూరంవేలు పెట్టి చూపిస్తూ!కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలనితీసివేతల జాబితా అదంతా!మెదడు అట్టడుగు పొరల్లోపూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది! ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?ఎవరు ఏమైనా అనుకోనీఒక మాట మాత్రం చెప్పుకోవాలిప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్నిప్లాస్టిక్ జార్ లో కుదించిన
సాహిత్యం కవిత్వం

వసంత మేఘమై కురస్తాం.

దిగులు పడకు నేస్తంవర్గ పోరాటాల చరిత్ర మనది.రేపటి సూర్యోదయం కోసం త్యాగం అనివార్యమైనది.తూర్పు పవనానాలువికసిస్తున్నాయి.అక్రమ చట్టాలతోమతాల మరణహోమం జరుగుతున్నది.బూటకపు ప్రజాస్వామ్య వ్యవస్థలకుళ్లును కడుగుదం.రండి నేస్తం…త్యాగం బాటలో చిందిన రక్తంను విత్తనాలుగా చల్లుదాం.నేల రాలిన చోటపువ్వులు వికసిస్తున్నయ్.కష్టాలు కన్నీళ్లు లేనిసమాజం కోసం కవాత్ చేద్దం..రేపటి వసంతం కోసంకదలి రండి .మరో వసంత మేఘమై కురస్తాం…..
సాహిత్యం కవిత్వం

నాలుగు పిట్టలు ( మినీ కవితలు)

కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22
సాహిత్యం కవిత్వం

వనాన్ని మింగిన కులం

ఒక చాటింపు పొద్దు కుంగే వేళఓ సమూహ కలయికవంటా వార్పు రేపుడప్పు పై దరువు తో మరునాడు పొద్దు పొడిచే వేళబండెడ్లు సిద్దంగిన్నెలు తపేలాలతో తరలుఅంతా ఒకే చోటు వనం అంటే చెట్లుఇళ్లకు గొళ్ళెం పెట్టిచెట్ల కిందకిసమూహాలుగాసమూహ సంఖ్య బట్టి చెట్టు ఎంపికనీడ కోసం ఉసిరి లేదు మర్రి లేదువేప లేదు రావి లేదుచల్లని గాలి కాసింత నీడ ఆ వేళమంత్రం లేదుతంత్రం లేదుసామూహిక వికాసంలో భాగంమానసిక సంఘర్షణకు ఉపశమనంఅందరిలో ఒకరమై ఒకరికి ఒకరమైమాటలు చేతలు కలివిడిగా చెట్టు కొమ్మలకు వేలాడే వేటలుజంతు అనాటమీ లో ఆరి తేరిన చేతులుపొందిక గా పోగులుపొయ్యి మీద నూనె తాళింపు చిటపటఅల్లం
సాహిత్యం కవిత్వం

అమ్మ

అవును!!!నేను..ఎన్నిసార్లు పిలిచినావిసుగురాని పదం అమ్మ! ఎందుకంటే..మా అమ్మ అందరి అమ్మలాటీవీ ముందు కూర్చునివంట ప్రోగ్రామోకామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ! నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!మరిమా అమ్మ ఎలాంటి అమ్మ ? ఈ భూమి మీదఅరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూపంటకి కలుపు తీసే అమ్మ… మా అమ్మ ! ఆకాశమంత దుఃఖంఅవనికి ఉన్నంత ఓర్పుమా అమ్మ సొంతం తన చెమట చుక్కల్నితన కన్నీటి గుక్కల్నితాగిన ఈ భూమిమా అమ్మకి ఎప్పుడు
సాహిత్యం కవిత్వం

వాళ్ళు ముగ్గురు

వాళ్ళు ముగ్గురే అనుకునివాళ్ళని లేకుండా చేస్తేఇంకేమీ మిగలదనివిషం పెట్టిచిత్రహింసలకు గురిచేసికొయ్యూరు అడవుల్లోహతమార్చిసంబరాలు చేసుకున్నావు కానీ ఆ చిత్రహింసలకొలిమిలోంచిఫీనిక్స్ పక్షిలావేలాదిమంది సాయుధప్రజా విముక్తి సైన్యంపుట్టుకొచ్చింది నువ్వో కాగితప్పులవనిరుజువయిందిస్పార్టకస్ నుండిదండకారణ్య ఆదివాసీ వరకునెత్తుటి పుటలలోంచిమరల మరలవిముక్తి నినాదంవినబడుతూనే వుంది అమరత్వం పొత్తికడపులోంచిఉద్యమ నెల వంకలుఉదయిస్తూనే వుంటారు శ్యాం మహేష్ మురళీఅమర్ రహే అమర్ రహే
సాహిత్యం కవిత్వం

అలల కెరటాలు

అనంత విశ్వాన్ని నిబ్బరంగా చూస్తానుఅంతా అర్థం అయినట్టే కట్టిపడేస్తుందిజీవితం కూడా. ఆకర్షణ తో కట్టుబడ్డట్టుముడిపడటాలు చెదిరిపోవటాలు చూస్తాం. కాలం పైన చిరు నవ్వు తాకికాసేపు చేసే కాలక్షేపం చూస్తాం. మరుక్షణంగాలికి కాలం ఊగిపెట్టే కన్నీటిని చూస్తాం. మురిసిపోయే లోపేతుపాను ముసిరినట్లుఅంతలోనేస్వచ్ఛం గా దృశ్యాలుగా చెక్కబడుతున్నట్లుఅనుభవాలు కుదుపుతుంటాయి . తీరం వైపు కళ్ళను పరచిఅలల కెరటాలను చూస్తాను.సంతోషాలు దుఃఖాలు పోటీపడిఊగిపోతుంటాయి. అయినానిశ్చలంగా సముద్రం వైపు చూస్తూప్రశాంతతను పల్లవిస్తాను.