కవిత్వం

“రద్దు”

నగ్నంగా ఊరేగించబడింది అత్యాచారం గావించబడింది అత్యంత దారుణంగా హత్యగావించబడింది ఆదివాసీలు, అడవి బిడ్డలు మాత్రమే కాదు. ఇంకేదో.. ఇంకా ఏదో, ఏదేదో... * బలహీనుల ఎదుట అధికారం అస్సలు మాట్లాడదు నిశ్శబ్దంగా తన పనేదో తాను చేసుకుంటూ వెడుతుంది. హక్కుల్నే కాదు మాన ప్రాణాల్ని రద్దు చేసేస్తుంది మీరింకా పాఠాలు మాత్రమే మారిపోయాయని, అనుకుంటున్నారు. చిన్నప్పటినుండి చేస్తున్న 'ప్రతిజ్ఞ 'ను కూడా మార్చేసిన విషయం ఇంకా తెలియదు. మనుషులందరూ సమానం కాదని అందరూ సోదర సోదరీమణులు కాదని అందరికీ హక్కులు ఉండవని వాళ్లు కొత్త గొంతుతో ప్రతిజ్ఞ మొదలుపెట్టేశారు * నోట్ల కన్నా ముందే స్త్రీత్వం, మనిషితనం ఆత్మగౌరవం,
కవిత్వం

నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు

నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు నిజాం పోలిక సరిపోదు హిట్లర్ ముస్సోలిని అస్సలు అతకదు ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు మనిషి కాదు పశువు మద మగ మృగం ఊ...హు! కీచకుడు దుశ్శాసనుడు ఐనా అసంపూర్ణమే "మో- షా"ల మొఖం గుమ్మాలమీద ఉమ్మేయడానికి జనం ముక్కోపం పదకోశంలో లేని మాటలు కావాలి తిట్ల దండకాల గ్రంథాలలో దొరకని మాటలు కావాలి అందుకే, నాక్కొన్ని మాటలు కావాలి గుజరాత్ నుండి కాశ్మీర్ మీదుగా ఇప్పుడు మణిపూర్ దాకా మంటలతో వచ్చాడు వాడు కొండకీ మైదానానికీ మధ్య చిచ్చు పచ్చగడ్డేసి రాజేసి మతం మంటల్తో చలిమంటలు కాగుతాడు వాడు నెట్
కవిత్వం

మంటల హారం

మైదానాల్లో ఆంబోతుల అకృత్యాలకు తల్లులు సాధు మాతలు తల్లడిల్లుతున్నారు ఒకనాడు సైన్యానికి ఎదురుగా దిశమొలగా నిలబడ్డ ధిక్కారాలు నేడు పొరుగువాడి దౌర్జన్యం ముందు తలదించుకుంటున్నారు. మైదానాల్లో చెలరేగిన చర్య లోయలను వణికించే పదఘట్టన ప్రతిచర్యలు చిందించే హింసోన్మాదంలో నిస్సహాయ జాతులు అణిగిపోతున్నాయి . నెపాలను మోపుతూ ఒక కుట్ర దురాలోచనలు దట్టించిన ఒక వ్యూహం ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఒక ప్రణాళిక మణిపూర్ కు మంటల హారాన్ని తలకెత్తుతున్నవి. పరిణామాల విస్తీర్ణాన్ని వాస్తవాల వ్యాసార్ధం కొలవలేనప్పుడు అతలకుతల తలమే అడవిగా నిలబడుతుంది. జరుగుతున్నదంతా అలవిలేని దృశ్యమై బోరవిడిచి హింసాంగమై చెలరేగినపుడు సున్నితత్వం నలిగి బండబారుతుంది. కదలిపోయిన చరిత్రలకు వక్ర కషాయాలద్దే
కవిత్వం

తెలుగు వెంకటేష్ ఐదు కవితలు

మణిపూర్ దుఃఖం 1 ఈ నొప్పికి బాధ ఉంది మనుషులమేనా మనమసలు ఈశాన్య మహిళలు మనకు ఏమీకారా భారత మాత విగ్రహానికి మువ్వన్నెల చీర కట్టి మురిసిపోయే మనం ఇపుడు ఏమి మాట్లాడాలి నగ్నంగా ఊరేగించి అత్యాచార హింసను అమ్మలపై చేస్తోన్న రాజకీయ అంగాలు చెద పట్టవా ఆకుల్ని రాల్చినట్టు ప్రాణాల్ని మంటల్లో విసిరే కిరాతక హంతకుల్ని ఎన్ని వందలసార్లు ఉరి తీయాలి కసాయి హింసకు మన నిశ్శబ్దం తరాల ధృతరాష్ట్ర మౌనమేనా పూలను ప్రేమించని ఈ రాతి మనుషులకు నొప్పి గురించి ఎవరు పాఠాలు చెబుతారు ఈ ముళ్ళచెట్లను నడిమికి విరిచే కొడవళ్లు ఎపుడు మొలుస్తాయి ఒక
కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు
కవిత్వం

మేము అర్బన్ నక్సలైట్లమైతాము

ప్రజలు అంటరానితనానికి గురౌతున్నప్పుడు లైంగిక వేధింపులకు గురౌతున్నప్పుడు మతం ముసుగులో మునుగుతున్నప్పుడు మూఢనమ్మకాలకు బలౌతున్నప్పుడు మేము కలం నుండి జాలువారిన కన్నీటి చుక్కలమైతాం ఆదివాసీ హక్కులకై ఉద్యమించినప్పుడు వారిపై వైమానిక దాడులు జరుగుతున్నప్పుడు దేశపు సహజ సంపదను దోచుకుపోతున్నప్పుడు ఈ దేశ ఆదివాసీ ముఖంపై ఉచ్చ పోసినప్పుడు మేము ప్రశ్నించే మొక్కలమై మొలకెత్తుతాం కాలేజీలో దేశ చరిత్రను విప్పి చెప్పినప్పుడు సమాన హక్కు గురించి మేము పోరాడినప్పుడు ఈ దేశపు అన్యాయాన్ని అక్షరమైన మేము ప్రశ్నించినప్పుడు రాజ్యం మా పైన పీడియఫ్లు ఉపా కేసులు పెట్టినప్పుడు ఈ రాజ్యం దృష్టిలో మేము అర్బన్ నక్సలైట్లమైతాము
కవిత్వం

‘గే’ గా ఉండడం….

మీకెవరికీ ఎప్పటికీ అర్థం కాదు. బయటకు కనిపించే అందమైన ముఖం వెనక ఉన్న నా హృదయం ఉపిరాడానంతగా మూసుకుపోయిందని. చిక్కని మీసాల కింద కోరిక అణిచివేయబడింది. మీరు విధించిన నిషేధ ఫత్వాల మధ్య నా ఆకాంక్షలు ఉరిపోసుకున్నాయి. ఇక ఎప్పటికీ ఎవరితోనూ .మధురమైన ముద్దు పెట్టించుకోలేను.. మరెవరితోనూ ప్రేమించబడలేను ! నా ప్రేమ అసహ్యించుకోబడుతుంది. ఎవరితోనూ దాన్ని ఇచ్చిపుచ్చుకోలేను. నా ఒకే ఒక్క జీవితంలో నా ప్రేమ వృధాగా.,ఈ అనంతమైన లోకంలో ఏకాకిగా మిగిలిపోతుంది. అయినా...మరోసారి గట్టిగా చెబుతున్నాను వినండి..అవును ! నేను 'గే' ని. అలాగ ఉండిపోవడమే నాకు ఇష్టం. ఎంత దుఖఃమైనా సరే...! అసలు ఈ
కవిత్వం

కలలతో పయనించే కాలం రాలేదింకా

మనసు మత్తడి పోస్తున్నది కలలను కానీ మనసుకు ఆవల పని చాలా మిగిలున్నది నేస్తం! ఇంకా కొన్ని దేహాలపై కాంక్షలు దాడులు చేస్తున్నవి! ఇంకా కొన్ని నేరాలకై ప్రజాస్వామ్య పావురం గొడుగు పడుతున్నది! ఇంకా పార్లమెంటు అసెంబ్లీ భవనాలు ఏదో అంటరానితనాన్ని పాటిస్తున్నవి! ఇంకా ఓ ఆడకూతురు పెందలకడనే మరణిస్తున్నది ఇంకా విద్య పౌష్టికాహార లోపంతో జబ్బుపడి తల్లడిల్లుతున్నది! ఇంకా ఓ సంచారి సాయంకాలానికి ఓ చెట్టును, ఓ ముద్దను అర్థిస్తున్నాడు! ఇంకా నగరం రోజుకో బిచ్చగాణ్ణి అపస్మారక స్థితికి చేరుస్తున్నది! ఇంకా పల్లె దేహం వలసలతో సలసల కాగుతూనే ఉంది! ఇంకా ఈ స్వరాజ్యం బానిసత్వపు అవార్డులు
కవిత్వం

చీకటి పాట

చూపు మసకబారిన చోట స్వరాలకు కన్నులు మొలుస్తాయి. చీకటి దీపం మేల్కొని దీపానికి చీకటి లేదని ఒక గాయం ఆ వీధిన గేయమై వికసిస్తుంది. రద్దీలో పరిగెడుతున్న కూడలిని నిలువునా రోడ్డుకు కట్టేసి ఒక సమ్మోహన రాగం బిచ్చమెత్తుకుంటుంది. అక్కడొక వర్షం విచ్చుకుంటుంది. కాలం కాసేపలా వినమ్రంగా మొక్కుతుంది. ఒక సముద్రమేదో..అలల ఊయలలో వీధిని జో కొడుతుంది. అనంత జీవనకాంక్షా స్వరం కదల బారిన క్షణాల రోడ్డు పుష్పిస్తుంది. వీధికి వసంతాన్నిస్తుంది. ఆశ భూమిని ఆహ్వానిస్తుంది. సంకల్పాన్ని ఆకాశం హత్తుకుంటుంది. బతుకు ఒక పాటల పల్లవై మోగుతుంది. ఎడారులు అరణ్యాలై చిగురుస్తాయి. భయానికి ధైర్యం వస్తుంది. ఓటమికి భయం
కవిత్వం

ఊహ చేయడమే హెచ్చరిక

నీ ఊపిరి విశ్వమంతా పాకిపోయింది విశ్వాన్నెలా భస్మం చేస్తాడు నీ ఆలోచన జనసంద్రం నిండా నిండిపోయింది సముద్రాన్నెలా బందీ చేస్తాడు నీ ఆలోచనకు కాళ్లెలా వుంటాయి గాలికీ జీవనదికీ కాళ్లుంటాయా మండే సూర్యుడున్నాక వెలిగే చంద్రుడున్నాక నీ శ్వాసకు అంతమెలా వుంటుంది పీక పిసుకుతాడు కనురెప్పల్ని పీక సాగుతాడు ఊహకెలా ఉరితాడు వేస్తాడు వరిగింజల్లో పిడికిళ్లున్నాయని రాలుతున్న వరిపొట్టులోంచి పిట్టలు పైకెగురుతున్నాయని సృజన చేసిన మెదళ్ళను కూల్చడానికి ఏ బుల్డోజరూ సరిపోదు నీ చేతులు విల్లంబులు పట్టలేదు నీ వాక్యాలు బాణాలయ్యాయి నీ చేతులు తుపాకులు పట్టలేదు చావును నిరాకరించిన నీ దైర్యం తూటాగా మారింది నీ తలనరాలు