ప్రమాదకరమైన వికసిత్ భారత్
1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి కూటమి 18 సంవత్సరాలు పాలన సాగిస్తూ నేడు వారే అధికారంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంచవర్ష ప్రణాళికలు, జమీందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాల విలీనం, భూ సంస్కరణలు, గరీబీ హటావో మొదలగు వాటిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.1975 ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలలో ముఖ్యంగా










