ఆ ముగ్గురి స్ఫూర్తి.. దేశ సార్వభౌమాధికార పోరాటం
మార్చి 23 భారతదేశ చరిత్రలో మరువలేని రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ నేలకొరిగి 95 ఏళ్ళు నిండాయి.ఈ సందర్భంగా వారిని స్మరించుకోడంతో పాటు వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశాన్ని కుల,మత,జాతి వివక్షలకు తావులేకుండా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లే సార్వసత్తాక దేశంగా నిర్మించుకోవాల్సిన బాధ్యత ఈ దేశ యువతీ యువకులపై, విద్యార్థులపై ఉంది. క్రీ.శ 1608 లో బ్రిటన్ కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో










