సన్నని ముసురు కింద
నాట్లు వేస్తున్న దృశ్యం చూసి
ఫూలే గుండె
మరోసారి
మండే ఎడారి అవుతుంది
చేతిలో
పాత కాగితాల కట్టపట్టుకుని
డ్యాము ఒడ్డున నిలబడి
తల్లిని పోగొట్టుకున్న బిడ్డలా
పొలాలని పోగొట్టుకున్న 'శాలో'తల్లి
డ్యాముకేసి నిర్వేదంగా చూస్తుంటది
అవతల నగరం
డ్యాము పుణ్యమా ..అని
ధగధగా మెరిసిపోతుంటది
జిలిబిలి నగవుల మురిసిపోతుంటది
నగరం అభివృద్ధి కింద
వ్యాపించిన పెంజీకట్లు
మట్టి దీపాల్ని కలవర పెడుతుంటాయి
ఇవాళ సోమాకు
పస్తులే మిగిలాయి
ఆయన పొలాలన్నింటినీ
రిజర్వాయర్ మింగేసింది
పాలిపోయిన చర్మం లోంచి
పొడుచుకొచ్చిన ఎముకల గూడు
పిడచగట్టిన పేగులు
లో లోపలికి ముడుచుకుపోతాయి
ఉబికి వచ్చే కన్నీళ్లను
అదిమిపెట్టిన డ్యాము
విస్పోటిస్తున్న క్రోధాలను
అదిమిపెట్టిన డ్యాము
కూలిపోతాయి
పర్వతాగ్రాన
తిరుగుబాటు రగిలినప్పుడు
సకువా పొదల గర్జనలో
ఈ డ్యాములు కుప్పగూలిపోతాయి
ఈ విధ్వంసాలు, ఈ విస్తాపనలు
తుడిచిపెట్టుకుపోతాయి
అమ్మ మనసులా
చల్లగాలులు వీస్తాయి
విధ్వంసక డ్యాములు లేని చోట
మట్టి వాసనను గమ్ముకు
వరి గొలుసులు
గాలికి ఊగుతూ
జనపదాలు వినిపిస్తాయి
**
"Ears of Paddy Tied Bound By The Dam."..కు స్వేచ్ఛానువాదం

బావుంది
Thanks