లోకంలో అంతా బానే ఉంది  
ఇద్దరు ఆడవాళ్ళు కలిసి టీ తాగినప్పుడు

కాలం ఊపిరి బిగబెడుతుంది
అనాస పువ్వు మెరుస్తుంది
అల్లం ఆవిరైపోతుంది
నిమ్మగడ్డి తిరగబడుతుంది
దాల్చన చెక్క చేయవలసినదానికన్నా తక్కువ పాపం చేస్తుంది
బోధి ధర్మ మేల్కొంటాడు

ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు

వాయువీణలు కంపిస్తాయి, డోళ్ళు దొర్లిపోతాయి,
మనసు హృదయాన్ని కలుస్తుంది, భాగం సంపూర్ణమవుతుంది,

ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడు

మందుల దుకాణం వారు నవ్వుతారు, మద్యం సర్వ్ చేసేవారు రాగం తీస్తారు
పీఠాధిపతులు ధర్మశాస్త్రాలు ఉటంకిస్తారు
నీలగిరి డార్జిలింగ్ను కలుస్తుంది

ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చాయ్ తాగినప్పుడు

పచ్చని నురుగు, రత్నపు మంచు,
పురాతన కడాయి, స్నేహ పానీయం.
ఒకరే అయితే సన్యాసి, పది మంది ఉంటే అల్లరి
ముచ్చటైన సంఖ్య ముగ్గురు
సందడి చేసే జంట ఒకటి, ఒక టీ కుండ

ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడు

మన పురుషులను ప్రేమించడానికి సమయం ఉంటుంది
కానీ కెఫిన్ ఈస్ట్రోజెన్ కలిసినప్పుడు కాదు.
రక్షణ బడ్జెట్, ఏఐ ముచ్చట కాసేపలా పక్కన ఉండాలి
భూమి ఆకాశం కలిసినప్పుడు
టీస్పూన్లు నాట్యం చేస్తాయి హిప్పోలు ఎగురుతాయి
అది మన గొడవ కాదు

ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడు

మన విశ్వ విందులో మనిషి, జంతువు రెండూ చేర్చబడే సమయం వస్తుంది,
ఒక రోజు మార్టినినో వైన్ బాటిల్ నో తాగడం కూడా ఆమోదయోగ్యమే అవుతుంది

కానీ మిత్రమా, ఇప్పటికి మాత్రం,
చాలా కాలం అయ్యింది,
చాలా చాలా కాలం, అబ్బ ఎంత కాలమైందో

ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చాయ్ తాగి ..

Leave a Reply