కవిత్వం
కవిత్వం భయాన్ని ఎదిరించే ధైర్యం

కవిత్వం నిజానికి, అబద్ధానికి
తేడా తెలిపే అద్దం.

కవిత్వం కోపం అగ్నిలా మారే క్షణం కవిత్వమే అంతరిక్ష కాంతి.
కవిత్వమే చీకటి వెనుక దాగిన వెన్నెల.
కవిత్వమే అనురాగ నేస్తం.

మోదుగుపూలు విరజిమ్మే
ఎర్రని కాంతి కిరణం కవిత్వం
సమాజమార్పు నా కవిత్వం.

కంటికి కనిపించే మరోప్రపంచం కవిత్వం

కవిత్వం ఒక మార్గం.
కన్నీటి చుక్కల ప్రవాహం.

Leave a Reply