యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది.  పాలస్తీనాలో, ఉక్రెయిన్‌లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలు మానవతను ధ్వంసం చేస్తున్నాయి. అట్టడుగు సమూహాల ఉనికినే రద్దు చేస్తున్నాయి. మానవ ప్రాణానికన్నా  ఆధిపత్యం,  ఆయుధ వ్యాపారం,  కార్పొరేట్‌ లాభాలే పాలకులకు ముఖ్యమని ఈ హింసాకాండ నిరూపిస్తున్నది. మరీ ముఖ్యంగా  ఇజ్రాయిల్‌ దాడుల్లో వేలాదిగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. భారతదేశంలో  సొంత ప్రజలపైనే పాలకులు యుద్ధం ప్రకటించి నెత్తుటేరులు పారిస్తున్నారు. 2026 మార్చ్‌ నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పదే పదే ప్రకటిస్తున్నారు. 

ప్రభుత్వం ఇట్లా తేదీ ప్రకటించి హత్యాకాండకు పాల్పడటం భారత సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చట్టబద్ధ పాలన చేయవలసిన ప్రభుత్వం హింసకు పాల్పడటం నాగరిక విలువలకు ప్రమాదం. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో చేస్తున్న దాడుల్లో మావోయిస్టులేగాక సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. ప్రభుత్వం మూకుమ్మడిగా హింసకు పాల్పడటం  వల్ల ప్రజాస్వామ్యం సంక్షోభంలో చిక్కుకున్నది. రాజ్యాంగ విలువలు, ఆదర్శాలు ప్రశ్నార్థకం అయ్యాయి.  ఏండ్ల తరబడి ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండ వల్ల హింస మామూలు విషయంగా మారిపోయింది.  సమాజ సున్నితత్వం దెబ్బతినిపోతున్నది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 భారత భూభాగంలో ప్రజలందరి ప్రాణాలకు రక్షణ ఇచ్చింది. చట్టం ప్రకారం నేర విచారణ జరిగి, తగిన ఆధారాలు ఉంటే న్యాయస్థానం మాత్రమే పౌరులకు శిక్ష విధించాలి. కానీ ప్రభుత్వం ఏక పక్షంగా పెద్ద ఎత్తున సైనిక, అర్ధ సైనిక బలగాలను, పోలీసులకు మోహరించి మధ్య భారతదేశంలో ఆదివాసులను హత్య చేస్తున్నది. అటవీ ప్రాంతాల్లో ఉన్న సహజవనరులను కార్పొరేట్లకు ఇవ్వడానికే ఈ హత్యాకాండకు ప్రభుత్వం పాల్పడుతోందనే విమర్శ ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఎన్నో నిజ నిర్ధారణ నివేదికలు ఈ విషయాలను ధృవపరుస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజల ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదనే మేధావుల సూచనతో మావోయిస్టులు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించాలని ఐదు నెలల కింద కోరారు.  మధ్యభారతదేశంలోని ఆరేడు రాష్ట్రాల్లో  అంతర్యుద్ధ వాతావరణాన్ని కాల్పుల విరమణ వల్ల తొలగించవచ్చని తెలంగాణలో, ఢల్లీిలో శాంతి చర్చల కమిటీలు కృషి చేస్తున్నాయి.  వామపక్ష, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్‌ కగార్‌ను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు లేవని, వాళ్లను నిర్మూలించడమే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నది.

ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి మినహా మిగతా రాజకీయ పార్టీలు కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాయి.  తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం శాంతి భద్రతల సమస్య కాదని, అదొక సామాజిక రాజకీయ సమస్య అని, మావోయిజం ఒక ఐడియాలజీ అని తెలంగాణ ముఖ్యమంత్రి వేర్వేరు సందర్భాల్లో ప్రకటించి ఉన్నారు.  మావోయిస్టులు లేవదీసిన సామాజిక సమస్యలను పరిష్కరించాలేగాని అణచివేత పరిష్కారం కాదని కూడా అన్నారు.

ఇలాంటి రాజ్యాంగబద్ధ వైఖరి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థితిని మరింత ముందుకు తీసుకపోవడానికి కాల్పుల విరమణ ప్రకటించడం సమంజసంగా ఉంటుంది. ఈ దిశగా తెలంగాణ పౌర సమాజ అభిప్రాయాన్ని కూడగట్టడానికి పూర్వ విప్లవ విద్యార్థి వేదిక గత రెండు నెలలుగా సంతకాలు సేకరించింది. తెలంగాణలోని వివిధ రంగాలకు చెందిన వందలాది మంది ప్రముఖులు హింసలేని తెలంగాణను కోరుకుంటూ సంతకాలు చేశారు.

ఇందులో భాగంగా మేము ఈ పాత్రికేయ సమావేశం ద్వారా తెలంగాణ పౌర సమాజ ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతున్నాం. ప్రజల, ప్రజాస్వామికవాదుల సూచనలను స్వీకరించడం వల్ల ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది.  మావోయిస్టుల పేరు మీద ఎలాంటి హింస జరగకుండా ఉండేలా కాల్పుల విరమణ ప్రకటన చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆపరేషన్‌ కగార్‌ను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపేతర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం.  \

పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక సేకరించిన  ఈ సంతకాల  కాపీలను మేము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చేరుస్తాం.  ఈ దేశ పౌరులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే

4 సెప్టెంబర్‌ 2025

హైదరాబాదు

Leave a Reply