మేరీ రాయ్ అంతగా విస్మరించాల్సిన మనిషి కాదు . శూన్యం నుండి బయలుదేరి క్రిస్టియన్ వారసత్వాల కింద పనిచేస్తూ, స్త్రీల  సమానహక్కుల కోసం కొట్లాడిన మనిషామె. కొట్టాయంలో ఆమె జీవితాన్ని ఒక సూపర్ హీరో లాగా నడిపించి, తన 89 సంవత్సరాల  దాకా ఒక గ్యాంగ్ స్టర్ లాగానే గడిపేసింది .

తన తల్లి గురించి అరుంధతిరాయ్ ఎటువంటి శషభిషలు లేకుండా రాయాలని భావించింది . అదొక్కటేగాక , తన జీవితంలోని ఆకలి, క్రూరత్వం, నిందలు, వారసత్వపు హింస, తల్లి ని కుదిపేసిన అస్తమా,  ఆమె విపరీతపు కోపిష్టితనం కూడా కలిసి ఆమెను రాసేలా ప్రేరేపించాయి .

శారీరక, సాంఘిక , మానసిక హింస తో అట్టుడుకుతున్న సమాజంలో ,ఈ పుస్తకం రాసిన తీరు , నిజాయితీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. “మనందరం లోపల్లోపల విధ్వంసం అయిపోతున్నా , మనం కూడా ప్రేమకు, కోపానికి , దారుణమైన విషయాలకు , అత్యంత ఔదార్యానికి అర్హులమే” అంటుందామే. .     ” “ప్రజలకు ఒక సిద్ధాంతమంటూ లేకపోవడంతో అనాగరికంగా మారుతున్నారు అందరిని సరళరేఖలతో విభజించలేం . ముద్రలు వేయలేం కానీ వాళ్లు కూడా సాహిత్యంలో, చరిత్రలో భాగస్వాములే” అంటుంది.

అరుంధతిరాయ్, తన 18వ ఏట,  తన సొంత జీవిక కోసం ఇల్లు విడిచి పెట్టిందిగాని, తల్లి మీద ప్రేమ మాత్రం సడల లేదు. ఆ తర్వాత విపరీతంగా శ్రమించింది . భిన్నమైన ప్రేమల్ని జూసింది . బుకర్ ప్రైజ్ పొందింది . జైలుకు వెళ్ళింది . చట్టపరమైన కేసులు ఎదుర్కొన్నది . ఇతరులకు సాయం చేయడంలో తన డబ్బునంతా ఖర్చు పెట్టుకున్నది..  “నన్ను దేశద్రోహిఅని వెంటాడినా  కొద్దీ నాకు నా మాతృభూమి మీద మరింత మరింత ప్రేమ పెరిగింది” అంటుందామె)

జవాబు.. ఇంతకు ముందే నేనెవరితోనోచెబుతూ, నేను  మా అమ్మ మేరీరాయ్ కి తల్లినని చెప్పాను . నేనొక అనాగరిక, క్రూర, అల్ప, అద్భుతమేధాశక్తిగల అమ్మాయిని డీల్ చేస్తూ వొచ్చాను. మా అమ్మ జబ్బులతో నేను అవస్థ పడుతూనే, నన్ను నేను శాంతంగా ఉంచు కోవడానికి ప్రయత్నించాను.

ఎన్నున్నా మా పాత్రలు పూర్తిగా భిన్నమైనవి. మేమిద్దరం పెద్దవాళ్ళ లాగా ఒకరినొకరం డీల్ చేయడానికి ప్రయత్నించాం. ఎప్పుడైతే నేనామెనుండి ఏమాత్రమైనాఆశిం చడం దండగనుకున్నానో, అపుడే ఇ ల్లొదిలిపెట్టాను. లేకుంటే నేను పూర్తిగా నలిగిపోయి నాశనమై పోయే  దాన్ని. నేనామెను గెలవాలని ఎప్పుఢూ అనుకోలేదు. ఓడించాలనీ అనుకోలేదు. తాను రాణిలాగ వెళ్ళిపోవాలనుకున్నా.అదే జరిగింది.

జవాబు.. నేనీ పుస్తకం రాస్తున్నప్పుడు నాకేంగావాలో ఆలోచించాను. నాకపుడు 25 సంవత్సరాల వయసు. అప్పటికే నేను రాజకీయాల్లో కొచ్చాను..మూత్ర విసర్జన చేసుకున్న బట్టల్లో,కొరికేయబడ్డచెవితో వింతగా కనబడ్డ ఆ మనిషి (మా నాయన)నిజూసి తేరుకోవడానికి నాకు మూడు సెకన్లు పట్టింది..వెంటనే “దేముడా. ఆయనCEO గానందుకు బతికిపోయాను”..అనుకున్నా.

జవాబు..మా అమ్మ తన భర్త పెట్టిన హింసను అనుభవించడమే గాదు, తనలోనూ ఈ హింసా ప్రవృత్తి ఉంది. అదేదో హింసకు ప్రతి హింస లాంటిది గాదు. ఆమె అంతే. నేనూ మా సోదరుడూ దీన్ని పునరావృతంగాకుండా చాలానే ప్రయత్నించాం. కాని తరతరాల హింస, ట్రామా అనేవి పచ్చి నిజాలు. ఇవి కుటుంబంలోనేగాదు, కులం లోనూ, జాతి లోనూ , మతంలోనూ ఉన్నా యి.

అంతెందుకూ.. హింస అనేది మన నరాల్లోనే ఉం ది. నీమీద హింస అనేది ఏ రూపంలో జరిగినా కూడా, నీవు బాధితుడి గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఒక్క సారి అట్లా ఆలోచించడం మొదలెట్టాక నీ పరిమితులు నీకు తెలిసొస్తాయి. ఐతే అదంతా  ఈదేశంలో సులభంకాదు ..ముఖ్యంగా ముస్లింలకు, మహిళలకు.

ఇది ఎవరికి వారు సొంతంగా అలవర్ఛుకోవడమే గాని ఒకరు చెబితే వొచ్చే దిగాదు.

జవాబు.. స్వేచ్ఛాన్వేషణే నాకు దివిటీలాగ పనిచేసింది. ముఖ్యంగా  ఇంటినుండి విముక్తి చాలా అవసరం.

 “నువ్వు ధైర్య వంతురాలివి” అంటుంటారు కొందరు

 “నేను ధైర్య వంతురాలినిగాను. నాకు మరో మార్గం లేకపోయింది. నలిగిపోయి చావడమో బతకడమో ఏదో ఒకటి తేల్చుకోవాలి”.కాబట్టి ఇది ధైర్యం గాదు..ఒకానొక అనివార్య స్థితి

ఇదంతా ఎందుకు అనిపించొచ్చు. నేను సంతోషంగా ఉండాలనుకున్నా బాధ పడదల్చుకోలేదు. ఒక ఆదర్శ వంతమైనస్వేచ్ఛ కోసం నా అన్వేషణ. ఈ స్వేచ్ఛ కోసం నామస్తిష్కంలో అనేక ఘర్షణలు జరుగుతుంటాయి.స్వేచ్ఛ అంటే బంధనాల నుండి, డబ్బు నుండి, కీర్తి నుండి, మరింత యౌవనంగా కనబడాలనే లాలస నుండి..స్వేచ్ఛ అన్నమాట.

జవాబు..ఒకసారి బాల్యమనేది భద్రత లేనిదైనపుడు, కాశ్మీరైనా ఒకటే, ఏవీధైనా ఒకటే.భధ్రత శూన్యం. కాని,” నీకన్నతల్లే ప్రమాదకరం” అనేది ప్రత్యేక స్థితి. అప్పుడింకేదీ నమ్మబుద్ధి గాదు.నేనెప్పుడూ ప్రమాదాల వైపే అడుగులేస్తాను. భద్రజీవితాలు అనే విషయమే నాకర్థం గాదు. ఒకవేళ ఏదైనా సంబంధం బలీయమైన దనిభావించినా, నాకు ఊపిరాడదు

.జవాబు.. నేను  God of Small థింగ్స్ రాసినప్పుడు అకస్మాత్తుగా సెలబ్రిటీ అయిపోయాను .అప్పట్లో ప్రతి మ్యాగజైన్లో ముఖచిత్రం నాదే ఉండేది .తర్వాత నేను The End of   imagination రాసినప్పుడు నాపై కోపంతో విరుచుకుపడ్డారు . ఆ తర్వాత నేను నర్మద  మీద రాయడం మొదలు పెట్టాను .

మనిషి ఏదో ఒకప్పుడు క్లిష్ట దశ గుండా ప్రయాణించవలసి వస్తుంది . అప్పుడు నిన్ను వెక్కి రిస్తారు .లేనిపోనివి అంట గడతారు . మా అమ్మ మేరీ రాయ్ ఇట్లాంటివన్నీ పట్టించుకోవొద్దని నాకు అప్పుడే నేర్పింది.  ఇతరులకు బోర్ కొట్టే దాకా , అలసిపోయేదాకా లేదా తాము తప్పని తెలిసుకునేదాకా నేను రాస్తూనే ఉంటాను .

చిత్రమేమంటే నేను ఆ వ్యాసాలు రాస్తున్నప్పుడు నా మీద విద్వేషపు దాడి జరుగుతుందని నాకు బాగా తెలుసు . అయినా నన్ను మెచ్చుకోవాలని నేను ఎన్నడూ రాయలేదు. నాకు లైక్ బటన్ లేదు. అదెక్కడ ఉంటదో తెలియదు .

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గఉన్నా కూడా మీకు మెప్పుదల కావలసి ఉంటుంది. అప్పుడు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు.

నేనేమనుకున్నానో అది రాసేశాను.

 సోషల్ మీడియాలో ఒక మేరకు ప్రజాస్వామ్యం ఉన్నట్లనిపిస్తుంది . కానీ అది కార్పొరేట్ లు ఇచ్చిన వెసులుబాటు మాత్రమే . సోషల్ మీడియాలో నీవు అందరినీ కదిలించవచ్చు. కాశ్మీర్లో లాగా ఎప్పుడు పడితే అప్పుడు బందు చేసుకోవచ్చు .అందరిని నీ వైపు తిప్పుకుంటున్నట్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే సోషల్ మీడియా నుంచి నువ్వుబైటికి రావొచ్చు . అట్లా మనందరం సోషల్ మీడియాలో స్వేచ్ఛగానే ఉంటున్నామని భ్రమించవచ్చు .  కానీ  అది కార్పొరేట్ ఇస్తున్న వెసులుబాటే అని అర్థం చేసుకోవాలి .

జవాబు..The Docter and  the Saint   పుస్తకంలో కార్పొరేటర్లు ఎంత బలంగా పనిచే స్తున్నాయి ..వాటిని ఏ కులాలు నడిపిస్తున్నాయో స్పష్టంగా చెప్పాను .ఇదంతా ఏం సూచిస్తుంది? ఇదొక హిందూ జాతీయ వాదం మాత్రమే కాదు. ఇది కులాన్ని ఆధునికరించడం, కార్పొరేటీకరణ చేయడం కూడా. ఇది మనకు షాక్ అనిపిస్తుంది

 ఒకసారి మనం జడ్జిల వైపు , మీడియా వైపు వాటి యజమానుల వైపు చూస్తే మనము వర్ణ వివక్ష సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది . ఇక్కడ నలుపు వర్ణం కోడ్  రాదు. దీని కోడ్ వేరే ఉంది

అంతిమంగా దీని ఉద్దేశ్యం ఏమిటీ అంటే, ఇక్కడ కొన్ని కులాలు మాత్రమే జాతీయవాదుల ముసుగేసుకుని ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. అందువల్లనే సంపదంతా అతి కొద్ది మంది చేతులలో పోగుపడి పోతున్నది .

ఇంటర్వ్యూ : నేహా దీక్షిత్

స్వతంత్ర జర్నలిస్టు (ఢిల్లీ)  The Many Lives of Syida X రచయిత్రి

The Hindu – august 31, 2025 సౌజన్యంతో

తెలుగు: ఉదయ మిత్ర 

One thought on “నన్నిలా ఉండనీయండి

Leave a Reply