అడవి ఇప్పుడు 
గాయపడింది
వెదురు వనాలు
నరికి వేయబడ్డాయి

మహా వృక్షాలు
కూకటి వేళ్ళతో
పెళ్ళగించబడ్డాయి

పులులు జింకలు
అభయారణ్యాలకు
తరలింపబడ్డాయి

నెమళ్ళు గోరపిట్టలు
వలలలో చిక్కుబడ్డాయి

కాకులు దూరని
కారడవి దారులన్నీ
బుల్డోజర్లు చేరాయి

భూమి గర్భంలోకి
గునపాలు దిగి
పుడమి పొత్తిళ్ళు
చీల్చబడుతున్నాయి

వీరులంతా
నేలపై ఒరుగుతూ
నెత్తుటి బాట
వేస్తున్నారు

చివరిగా వారి
ఆశయాన్ని అందుకొని
తూరుపున
నెలబాలుడు
ఉదయిస్తున్నాడు!!

Leave a Reply