అదే ప్రశ్న
ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది. మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ? ముగ్గురు