అనాగరిక అన్యాయ నేర చట్టాలు
ఇంకో అయిదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బిజెపి ప్రభుత్వం భారతదేశ క్రిమినల్ చట్టాలను మారుస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ చేసుకుంది. అప్పుడు 143 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదు. ప్రజా జీవితాన్ని ఎంతగానో శాసించే ఈ చట్టాల కోసం ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాత ప్రభుత్వానికి మూడొంతుల మెజారిటీ లేదు. కనుక ప్రతిపక్ష సభ్యుల మద్దతు లేకుండా చట్టాలు చేయలేదు. అయితే దానికి మెజారిటీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మూడు నేర చట్టాలు జులై 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ