రోనా: జన హృదయాల్లోనిప్రతిఘటనా స్వరం
బికె -16 కేసులో కటకటాల వెనుక ఉన్న కార్యకర్త రోనా విల్సన్ క్రియాశీలత ఫాసిస్టు రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకొంది. కేరళలోని కొల్లంలో పెరిగి, 1990 ల ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్ళిన రోనా తన అరెస్టు వరకు తన జీవితాన్ని అక్కడే గడిపాడు. దక్షిణ ఢిల్లీలోని మునీర్కా గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక గదిలో పూనే, ఢిల్లీ పోలీసుల సంయుక్త చర్యలో రోనాను అరెస్టు చేశారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత, రోనా తాను కృషి చేయాల్సింది ఆ రంగం కాదని గ్రహించి, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి