మీరీ పుస్తకం చదివారా ?

కనిపించని డైరీలో కవిత్వపు అంతరంగం

"ఇక మాటలు అనవసరం. కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం విప్లవాత్మక దృక్ఫథంతో రచనలు చేయాలి"-మహాకవి శ్రీశ్రీ(ఖమ్మంలో 8`10`1970న విరసం తొలిమహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతినిధుల సభలో..) నేటితరం కవులు అనివార్యంగా వర్తమాన సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, ఆక్రంధనలు, అత్యాచారాలులాంటి ఘటనలే కాక ప్రతీ సామాజిక దురాగతాలు, అసమానతలూ, దోపిడీ, ప్రపంచీకరణ, కార్పోరేటీకరణ లాంటి ప్రతి దుర్మార్గాన్ని ఎండగడుతూ కలమెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వపు కాన్వాసు మరింత విశాలంగా మారింది. ఎలా రాస్తున్నారనో ఏం రాస్తున్నారనో విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గూర్చైతే ఆలోచిస్తున్నారు. ఇటీవం కవిత్వంలోకి  మహిళలు వరదలా వస్తున్నారు..ఇది గొప్ప పరిణామం..అలా అనుకుంటున్న క్రమంలో ‘‘ నాడైరీ
వ్యాసాలు

రక్షిత అడవుల్లో రక్షణలేని ఆదివాసీలు

గత కొన్ని సంవత్సరాలుగా, ఆదివాసీల ఐక్యత, పోరాటం, నిరంతరం పెరుగుతున్న బలం కారణంగా, వారి ప్రయోజనం కోసం అనేక చట్టాలు రూపొందాయి, ప్రభుత్వాలు కూడా వారికి రక్షణ కల్పించాలని ప్రకటిస్తూ వుంటాయి, కానీ నిజంగా ఈ ప్రయత్నాల ద్వారా ఆదివాసీలకు ఏదైనా మంచి జరిగిందా? పర్యాటకం కోసం పరిరక్షించబడుతున్న అటవీ ప్రాంతాలలో ఆదివాసీలు ఎంత సురక్షితంగా ఉన్నారు? భారతదేశంలో ఆదివాసీలు/మూల నివాసులకు అడవులతో ఉన్న సంబంధం సహ అస్తిత్వం సూత్రం పై ఆధారపడి ఉంది. చారిత్రాత్మకంగా, అడవులు, అటవీ ప్రాంతాలు ఆదివాసీ తెగల సాంప్రదాయ నివాసంగా ఉండేవి. అయితే, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ కోసం 'రిజర్వు ప్రాంతం' అనే
అనువాదాలు

అదానీ బొగ్గు విద్యుత్ ప్రాజెక్టు పై ప్రజా ప్రతిఘటన  

భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు సామర్థ్యాన్ని విస్తరించాలని ఒక అదానీ కంపెనీ యోచిస్తోంది. సమీపంలోని గనులు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటుల కాలుష్యం కారణంగా ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2024 జూలైలో, రాయగఢ్ సమీపంలో అదానీ విద్యుత్ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనపై అధికారిక బహిరంగ విచారణలో, గ్రామస్తులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. విస్తరించిన ప్లాంట్ ప్రతి సంవత్సరం 4 మిలియన్ టన్నుల బొగ్గు బూడిద అవశేషాలను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, స్థానిక రహదారులపై బొగ్గును ట్రక్కులతో రవాణా చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని
నివేదిక

బస్తర్ అడవుల అదృశ్యం కోసం కొత్త సాధనాలు

బస్తర్‌లో పౌర హత్యలపై మేము నివేదికను ప్రచురించిన నెలలో, మరో రెండు దఫాలు ఈ ప్రాంతంలో నక్సల్ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి, 16 మంది మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మరణించినట్లు తెలిసింది. జూన్ ప్రారంభంలో, సునీతా పొట్టం అనే 25 ఏళ్ల కార్యకర్తను ఆమె ఇంటి నుండి బయటకు లాగి, కొట్టి, అరెస్టు చేసి అనేక కేసులు పెట్టినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కార్పొరేటీకరణ, సైనికీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ప్రచారంలో నిమగ్నమైన మానవ హక్కుల కార్యకర్తలు సుర్జు టేకం, శంకర్ కశ్యప్, ఓరం సామ్లు కోరం, లఖ్మా కోరం, రాను పోడ్యమ్ వంటి వారిని అరెస్టు చేసి హింసకు గురిచేశారు.
విశ్లేషణ

గడ్చిరోలీ ఎన్‌కౌంటర్‌: 17 జూలై.  సూర్జాఘడ్‌ కోసం సూరజ్‌ఖుండ్‌

అమరుల బంధుమిత్రుల సంఘం 22వ వార్షికోత్సవం కగార్‌ వ్యతిరేక  దినంగా జరుపుకుంటున్న ఒక రోజు ముందు కారంచేడు దళిత ఆత్మగౌరవ పోరాటాలను దేశమంతా స్మరించుకున్న రోజు గడ్చిరోలీ (మహారాష్ట్ర) జిల్లాలో, మావోయిస్టుల రాజకీయ చిత్రపటంలో దండకారణ్యం మీద భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు భారీ ఎన్‌కౌంటర్‌ జరిపి 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు, ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు ప్రకటించింది. పూర్తిగా బిజెపి ప్రభుత్వం కానప్పటికీ శివసేన నుంచి ఏక్‌నాథ్‌శిండేను మరికొందరు ఎంఎల్‌ఏలను ఎత్తుకుపోయి అస్సాం ముఖ్యమంత్రి కరడుగట్టిన బ్రాహ్మణీయ ఫాసిస్టు హేమంతశర్మ అజమాయిషీలో క్యాంపు పెట్టి ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వాన్ని (ఎంవిఎ సంకీర్ణ
పత్రికా ప్రకటనలు

Uniting for Justice: A Global Solidarity Call

On the occasion of the International Day of the World's Indigenous Peoples (August 9), the Solidarity Forum for Adivasi Rights Struggle, based in the southern Indian states of Telangana and Andhra Pradesh, urges the global community to join in observing Solidarity Week from August 9 to August 15, 2024. This solidarity week is dedicated to supporting the ongoing struggles and advocating for the rights of Adivasis, the Indigenous people of
పత్రికా ప్రకటనలు

ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణను సామాజిక న్యాయ భావనగా చూడాలి

ఎస్సీ కులాలు వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, సామాజిక వివక్షను అనుభవించాయి. సంపద మీద హక్కు లేకుండా ఆర్థిక వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, చారిత్రక, సామాజిక కారణాల వల్ల వాటి పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 ప్రకారం ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్‌ ఫలాలను అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024, గురువారం ఇచ్చిన తీర్పును విప్లవ రచయితల సంఘం స్వాగతిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం
కథలు

Hey! Show Me Your Papers!

"Yes, I am faithful to the Indian Constitution! I am a watchdog of the Constitution, " Khadar mumbled and rolled on the bed, not sleeping a wink. It was March. Across the starlit and cloudless sky on a new Moon night, the light was playing hide-and-seek. Khadar lay lying under the open sky. Though the cool breeze tickled him, the pestering thoughts made him restless. The rickety cot creaked while
సంపాదకీయం

తెలంగాణలో మళ్లీ ఎన్‌కౌంటర్లు

చరిత్ర మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణలో మళ్ళీ ఎనకౌంటర్లు మొదలయ్యాయి. మూడేళ్ళ తరువాత మళ్ళీ తెలంగాణ నేల విప్లవకారుల రక్తంతో తడిసింది. జూలై 25న దామరతోగు  అడువుల్లో జరిగిన కాల్పులలో నలమారి అశోక్‌ అలియాస్‌ విజేందర్‌ చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. మరొక వైపు అనారోగ్యంతో ఉన్న అశెక్‌ను  పట్టుకుని చంపివేసినట్టు విప్లవ పార్టీ ప్రకటించింది. వీటిలో వాస్తవాలు ఏవైనా.. ఎన్‌కౌంటర్ల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటని తేలాల్సి ఉన్నది.   ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ సమాజం  ప్రభుత్వాన్ని అడగవల్సిన ప్రశ్న ఇది. ఒక్క ఎన్‌కౌంటర్‌కే ఇలా అడగవచ్చునా? అనేవాళ్లు కూడా ఉంటారు.  కానీ ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం
ఎరుకల కథలు

ఏనుగుల రాజ్యంలో

ఊరు మొత్తం  ఒక్కసారిగా  ఉలిక్కిపడింది. ఏనుగులు అడవి దాటి సరాసరి కోటూరు వద్ద పొలాల్లోకి వచ్చేసాయి.ఎన్ని వచ్చాయో ఎవరికీ తెలీదు.  ఎవరూ సరిగ్గా చూడలేదు. అంత సమయం లేదు. పొలాల్లో అక్కడక్కడా  పనులు చేసుకుంటున్న రైతులు అందరూ  పలుగూ పారా కత్తీ, కొడవలి,  తట్టాబుట్టా ఎక్కడవి అక్కడే పడేసి కేకలు పెట్టుకుంటూ ఒకర్ని ఒకరు హెచ్చరించుకుంటూ పరుగుపరుగున ఊర్లోకి వచ్చేశారు. “ ఏనుగులు వచ్చేసాయి, ఏనుగులంట.. గుంపులు గుంపులుగా వచ్చేసాయంట ..” “ ఈ రోజు ఎవురికి మూడిందో ఏమో .. ఎవరి  పంటలు తినేసి, తొక్కేసి పోతాయో  ఏమో ? “  “ముండా ఏనుగులు, మిడిమాలం ఏనుగులు