కవిత్వం

ఒక నిస్సహాయుడి తలపోత

ఇంత ఉక్కపోతలో కాసింత ఊరటకి సంతోషపడిపోవడంగురించి కాదు..వచ్చే మంటల ఊడ్పులమండుటేసవి గురించే దిగులంతా -ఊచలు వంచుకొనిరాజ్యం కోరలు వంచిబయటకురావడం చూసికళ్ళు చెమర్చడం గురించి కాదు ..మనసు చిగుర్చడం గురించి కాదు..చేయని నేర నిరూపణలలోనే జీవితాల హరణ గురించే వేదనంతా-మనుషుల ఉదాసీనత మేత మేసిరాజ్య క్రూరత్వం ఇబ్బడిముబ్బడి కావడం వెచ్చని సుఖ జీవితాలుచల్లబడిన రక్తాల విరామ స్థలాలవడంరంగువెలసిన ఎర్రరంగులుఒక సమాధానపడిన ఎర్రగాబొగులుపోవడం గురించేఅసలు భయమంతా..పొడిచిన సూర్యోదయం లేఎండలో కాసింత ఒళ్లు కాగుతున్నంతలోనేప్రజా జీవితాల పొద్దు కుంగుతుందేమోననిఅభద్రతాఅనకొండ చుట్టుకౌగిలిలోపెనుగులాటల గురించే..కొన్ని నల్లకోటుల పట్టుదలలుకొన్ని వసంతాల ప్రేమలతలుఅండా సెల్లో పళ్ళ బిగువున ఒక చక్రాలకుర్చీ దివ్యాంశ యుద్ధంజీవితాశల తరువుకి ఒక లేతాకులారోజు రోజు
కవిత్వం

చావు ఇపుడు ఎవర్నీ ఎత్తుకుపోలేదు

వాళ్ళు చావును జయించిన వాళ్ళుజైలు గోడలకు పాటలు నేర్పిన వాళ్ళుఇనుప ఊచలకు జానపద సంగీతం నేర్పిన వాళ్ళుజైలుపై నక్షత్రల దుప్పటి కప్పిగోడల మధ్య రహస్య సంభాషణ చేసినవాళ్లువాళ్ళేక్కడ వున్నానీ నా విమిక్తినే కోరుకున్న వాళ్ళురెడ్ కారిడార్ ఇండియా అంతారూపొందించిన వాళ్ళువాళ్లకు చావేంటిప్రెమొక్కటే గానం చేసినమన కాలం కబీర్లు వాళ్ళుఎర్ర జెండా ఎత్తి ఉంచండిమలయ సమీరమ్లా వచ్చి తాకుతారుపిడికిలి ఎత్తి పట్టి ఉంచండినరనరానా ఉక్కు సంకల్పంతోఎత్తి పడతారుసాయి నిబ్బరంగానే వున్నాడుచావును నిరాకరించిన వాడు కదాచూడు చిరు నవ్వుతో తిరిగి వస్తాడు. 10.18పీఎం
కవిత్వం

చావును నిరాకరించిన జీవితం

ప్రియమైన వైద్యులారా, సాయిబాబా కళ్ళను తీసేప్పుడుకొంచెం మృదుత్వాన్ని జోడించండివాటిల్లో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలు మరొకరిలో విప్పారవచ్చునేమోఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికి తీయండిమనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలో"చావును నిరాకరించిన" ఆ ఉక్కునరాల గుండెలోతుల్లో,ఆదివాసుల పట్లా, పీడిత, తాడిత ప్రజానీకం పట్లాఅలవిమాలిన సున్నితత్వానికి మూలాలేమైనా దొరకవచ్చునిత్య నిర్బంధంలో, నొటొక్క జబ్బులతో పెనుగులాడుతూవిశ్వాసాల కోసం నిలబడడం అంటే ఏమిటో చెప్పేందుకుపూటకో సిద్దాంతం ప్రవచించేఊసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపైఆ పోలియోకాళ్ళతో జాడించేందుకేమైనా అవకాశముందేమో చూడండిమరొక్క, చివరి విన్నపం...ఆ మెదడును మాత్రంరేపటి తరాలకోసం, మరింత జాగ్రత్తగా భద్రపరచండితొంభై శాతం పైగా వికలాంగుడైనా, అతని "ఆలోచించే మెదడు" ప్రమాదానికి వణికినఈ దోపిడీవ్యవస్థబలహీన లంకె (వీక్
దండకారణ్య సమయం

ఊర్మిళ @ నీతి-ఆధునిక మహిళ

ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ - వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్
ఆర్థికం

మాంద్యంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

1980 దశకంలో నెమ్మదించిన వృద్ధి, వాణిజ్య అసమతుల్యత, క్షీణిస్తున్న సామాజిక పరిస్థితుల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకం ప్రారంభమైంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 1990 నుండి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో ఆటు పోట్లు ఏర్పడుతోన్నాయి. పర్యావరణ సమస్యలు, యుద్ధాలు. ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ప్రపంచ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్లు, ఆయా దేశాలలోని ఆశ్రితులు విపరీత లాభాలు గడిరచి బిలియనీర్లుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, దేశాలలోని ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు దేశాల రుణభారం పెరిగింది. సహజ వనరుల లూటీ
పత్రికా ప్రకటనలు

కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లు

ప్రపంచ విప్లవ మానవుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమకారుడు, కవి, మేధావి కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబకు అరుణారుణ జోహార్లుఆయన రాజ్య ధిక్కార స్ఫూర్తితో విశాల ఐక్య సంఘటనా పోరాటాలతో ఆపరేషన్‌ కగార్‌ను అడ్డుకుందాంహిందుత్వ కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసికెళదాం సుప్రసిద్ధ విప్లవ మేధావి, కవి, ప్రజా ఉద్యమ నాయకుడు, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కామ్రేడ్‌ జి.ఎన్‌ సాయిబాబ తీవ్ర ఆనారోగ్యంతో అక్టోబర్‌ 12 శనివారం రాత్రి 8.36 గంటలకు హైదరాబాదులోని నిమ్స్‌ హాస్పెటల్‌లో అమరుడయ్యాడు. భారత ప్రభుత్వం 2009లో ఆదివాసుల మీద ప్రకటించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రొ. సాయిబాబా
కవిత్వం

ఆక్రమణ యుద్ధంలో జనన మరణాల సరిహద్దు ఎక్కడ?

నాలుగు రోజుల కవలలు.అవును గాజాలో పిల్లలు పుడుతూనే ఉన్నారు నష్టాన్ని పూడ్చే కసితో కవలలు గానూ దువాతో తండ్రిబర్త్ సర్టిఫికెట్ తేవడానికి పోయాడు ఆకాశ విమాన దాడిలో ఆ పిల్లలిద్దరూ చనిపోయారు గాజా ప్రభుత్వ ఆరోగ్యశాఖ పసి పిల్లల మరణాల జాబితా ప్రకటన ఒక్కటేవిశ్వసనీయమైందని ఆమోదిస్తుంది ఐక్యరాజ్యసమితి.అంతకన్నా అది చేయగలిగింది ఏముంది!శరణార్థి శిబిరంలో చేరడానికిపుడుతండ్రి కవలల మృతదేహాలు తీసుకొని డెత్ సర్టిఫికెట్ల కోసం పోవాలి పసి పిల్లల జనన మరణాల మధ్య ఇజ్రాయిల్ అక్రమణ యుద్ధ సరిహద్దు ఎక్కడ?(పి. వరలక్ష్మి, ఎఫ్. బి. కి కృతజ్ఞతలతో) 17 ఆగస్టు 2024
కరపత్రాలు

ఆపరేషన్ కగార్ను ఆపండి

ధర్నా6 అక్టోబర్‌ 2024 సోమవారం ఉదయం 11 గంటల నుంచిఒంగోలు కలెక్టరేట్‌ వద్దఅడవిని, ఆదివాసులను, పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించి తొమ్మిది నెలలు దాటింది. చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పేరుతో మారణకాండ నడుస్తోంది. ఇది ఈ నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు.  ఇప్పటికే   దేశవ్యాప్తంగా వేర్వేరు రూపాల్లో  విస్తరిస్తున్నది. మధ్యభారతదేశంలో ఆరంభమైన ఆపరేషన్‌ కగార్‌ దేశంలో అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలన్నిటికీ చేరుకుంటున్నది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర
పాట

అడవి పోరు

పసి వయసుల ముసి నవ్వుల బాల్యమంటే కోపమా. .పచ్చనడవి రక్తమెందని అడుగుతుంటే నేరమా...అడవి జీవరాసులతో అందమైన జీవనం..."2"వెదురు తేనె తునికాకు వేరు కునేవాళ్ళము"2"కొండబండలెన్లో దాటికొనసాగేను దారిరా.. వేటగాడే కాకిలై మాటువేసి కాల్చేరా...... " పసి వయసుల ముసి నవ్వుల"అమ్మ పాల కమ్మదనం ఎరుగనట్టీ వాళ్ళము..."2"నాన్న చేతి స్పర్శ కూడా తాకనట్టి వాళ్ళము.."2".ఆరు నెలలు నిండలేని పసి పాప మంగ్లి రా..అడుగులేసే నేలనేవరు ఆక్రమిచ చూసేరా రా.... " పసి వయసుల ముసి నవ్వుల"డ్రోను బాంబుదాడులతో అంతర్యుద్ధరంగమా..."2"తల్లి పిల్ల అక్కచెల్లి అశ్లీత చిత్రామా..."2"గూడాలను కూల్చి గూండా రాజ్యమేచేసేరా...కూలితల్లి గూడుచెదిరే పక్షిలాగా మార్చేరా... " పసి వయసుల ముసి నవ్వుల"బస్తర్లో బందుకుల
స్పందన

నాకు నచ్చిన శికారి

పాణి రాసిన శికారి నవలలో నన్ను అమితంగా మెప్పించిన పాత్ర, నాకు నచ్చిన పాత్ర గుమ్లి. ఏ వర్గంలో అయినా స్త్రీలు సమాజ కట్టుబాట్లకు తల వంచక తప్పదేమో అని గుమ్లి పాత్ర ద్వారా నాకు అనిపించింది. భర్త ఎలాంటి వాడైనా పిల్లల కోసం స్త్రీ జీవన పోరాటం చేయక తప్పడం లేదు. ఇది  ఈ సమాజంలో స్త్రీల స్థానాన్ని తెలియజేస్తుంది. గుమ్లి భర్త డొక్కోడు రెండో పెళ్లికి చెల్లించే కట్నం కూడా తానే ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆమె అనుకుంటుంది. అప్పుడు భర్త రెండో పెళ్లికంటే దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుందనుకున్నప్పుడు గుమ్లి పడిన