కవిత్వం

నల్లని కత్తి

ఎందుకో?కార్పోరేట్లకుబహుళ జాతులకుశూలల సూపులకునల్ల కలువలే నచ్చుతయి వాళ్ళు ఏం మేలు చేయాలనుకొన్నా ?తోలునే తొలకరిని చేస్తరునల్లని ముఖం మీదతెల్లని మల్లెలు ఆరబోసినట్టునింగి మంగుళం మీదమక్క పాలాలు ఏంచినట్టువాళ్ళ నవ్వుల పువ్వుల కోసమేపూనికతోని దీక్ష పట్టినట్టుఇది ప్రపంచ పెద్దలుపేదరికం మీద విసిరినపరిహాసపుటస్త్రం అనిపరిపరి విధాల పరితపించినాకాలే కడుపు సాలు దున్నదనీమాడే ఎండ నీడ కోరుతదనీమర్మం తెలిసిన వారికిమనసున పట్టింది.నూకలు పెడతా మేకలు కాస్తావా?అన్నడొకడువివక్షల విలువల ధర్మానికివిలుకాన్నై కావలుంటానన్నడింకొకడు.నోరును అదుపులో వెట్టుకొనిపోరును పొరక పొరక చేసివిలాసాల వినువీధుల్లోకులాసాల కుటిల నీతుల్లోకుర్చీలు ఎక్కినంకకుత్తుకలను కోసేకత్తులైతరుకోరుకున్న కుదురుకుంగుతుందంటేనోటికి పడ్డ తాళాలు ఊడితైతక్కలాడుతయిఏరి ఏరి కొన్ని అన్యాయాల మీదనేకోరి కోరి ఆయుధాలు ఎక్కుపెడుతరుఅవసరం తీరినంక ఆయుధాలు
కవిత్వం

ఎటు చెందిన వాడిని

ఊరుకి చెందిన వాడినాతల్లివేర్లు తెంపుకు వచ్చిన వాడినాఊరు వదిలి వేరైపోయిన వాడినానిలువునా నీరైపోయిన వాడినాఅయినోళ్ళకి చెందిన వాడినాపలునోళ్ళకు జంకిన వాడినాఎవరిని ?నేను ఎవరికి చెందిన వాడిని ?చేతులు రెండూచాచిన వాడిని కదా..చూపంతా వచ్చిన దారిన పరచిన వాడిని కదా..నివశించే నేలకితలని తాటించేవాడిని కదా..ఎక్కడైనా ఒక బొట్టు ప్రేమ కోసంభిక్ష పట్టినవాడిని కదా..భుజాన బరువుతోబతుకు భ్రమణ గీతం పాడేవాడిని కదా..మరి, నేను ఎవరిని ?సూరీడికి చెందిన వాడినాచుర్రుమనే ఎండకు చెందిన వాడినాచంద్రునికి చెందిన వాడినాచల్లని వెన్నెలకు చెందిన వాడినాకడలికి చెందిన వాడినావిరిగి లేచే కెరటానికి చెందిన వాడినాఅడివికి చెందిన వాడినాగాయానికి పూసే ఆకు పసరుకి చెందిన వాడినానగరానికి చెందిన వాడినానగుబాటుకు
నివాళి

బ్రాహ్మణీయ వ్యతిరేక సాంస్కృతిక, మేధో ఉద్యమంలో డా. విజయ భారతి

బి. విజయ భారతి సెప్టెంబర్‌ 28 ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ప్రజల ఆధునిక సాహిత్య సాంస్కృతిక, మేధో ఉద్యమంలో ఆమె స్థానం చిరస్మరణీయమైనది. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి, సంస్కృతికి వ్యతిరేకంగా వందల, వేల ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని విజయభారతి తన రచనలతో చాలా విశాలం చేశారు. ముందుకు తీసికెళ్లారు. దీన్ని ఆమె ప్రధానంగా రెండు మార్గాల్లో కొనసాగించారు. ఒకటి: కుల వ్యవస్థ, సనాతన ధర్మం, పితృస్వామ్యం.. సామాజికంగా వ్యవస్థీకృతం కావడానికి, భావజాలపరంగా, సాంస్కృతికంగా నిరంతరం పునరుత్పత్తి కావడానికి సాధనంగా పని చేస్తున్న పురాణాలను ఆధునిక, బ్రాహ్మణీయ వ్యతిరేక దృక్పథంతో విమర్శనాత్మకంగా చూసి విశ్లేషించడం. రెండు: కుల వ్యవస్థకు