కవిత్వం

చివరి పిచ్చుక

చివరిపిచ్చుక కొమ్మపై వాలింది బతుకునిచ్చిన లోకంలో తనకిదే ఆఖరి అరుపనిచుట్టూరా ధూళిమేఘంకమ్ముకుంది కూలుతున్న ఎత్తైన ఆశలగూళ్ళ కింద నవజాతాలుపిండాలు రూపం కోల్పోనాయి పిచ్చుక ఉహాగానంలో ఉంది నేను దేహాన్ని నిర్మిస్తే మీరా దేహంలో ఎముకలగూళ్ళు సృష్టించారు నేనొక ప్రకృతి రమణీయమిస్తే మీరందులో మృదంగాల్తో మృత్యుఘోషనుకానుకిచ్చారురెండహాల మధ్య రణమైతేరెండు తరాలకు సరిపడా గుండె సప్పుళ్ళు ఈ దినమే అంకితమివ్వడమేననియోచిస్తోంది కాలమై నిలిచి...!పిచ్చుక మళ్ళీ ఊహాగానం చేస్తుంది మనిషి యంత్రాలలోకం నుంచి ఆదిమలోకంలోకి పయనించాలని..!ఆయుధాలొదిలేసీప్రాణుల్తో మమేకమై ప్రకృతితో కంఠం కదిలించాలని ఊహాగానం చేస్తోందింకా.
కథలు

మౌనం

సాయంత్రం సూర్యుడు ఆకాశం నుండి సెలవు తీసుకుని మసకబారుతున్నాడు. యాకూబ్ తన భార్య షబానా సమీపంలో నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని అతనికి అనిపిస్తోంది. కవల పిల్లలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో విలవిల్లాడుతున్నారు. ఒకరు పాప. మరొకరు బాబు. షబానా: "యాకూబ్, వీళ్ల శ్వాస ఇంకా బాగా లేనట్టుంది. మన దగ్గరి ఇంటి వైద్యం చేశాం. ఇంతకన్నా చేయగలిగింది ఏమీలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లడమే మంచిదేమో." యాకూబ్: "నేను కూడా అదే అనుకుంటున్నా. వాళ్లను ఇక్కడ ఉంచితే ఏమైనా జరిగి పోతుందేమోనని భయం వేస్తోంది. మనం ఆలస్యం చేయకూడదు." షబానా: (పిల్లల్ని
పరిచయం

వెలుగును హత్య చేసిన చీకట్ల కథలే మార్జినోళ్లు

సమాజం పట్ల బాధ్యత గల రచయితల్లో సమాజానికి ఏదో చేయలాని తపన పడి, సమాజం వైపు నిలబడి తమ గళాన్ని విప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సామాజిక సృహను కలిగి సాహిత్య సేవా దృక్పథంతో, సమాజం మార్పు కోసం ఎల్లప్పుడూ ముందుండే రచయితల కలం నుండి మాత్రమే భావోద్వేగమైన కథలు బయటికొస్తాయి.అలాంటి కథలే పి.శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్ళు కథలు.  ఈ కథలు సమాజంపై ప్రభావం చూపే కథలని చెప్పొచ్చు. ఇలాంటి రచయితలు ఒక నిబద్ధత, సమాజం పట్ల కొంత బాధ్యత వుండడం వల్ల కూడా ఇటువంటి కథలను రాస్తారు. నేటి కాలంలో ప్రేమ కవితలకో, కథలకో
మీరీ పుస్తకం చదివారా ?

బాధితులంతా ఐక్యమవుదాం

ముమ్మాటికీ నిజమే. ప్రపంచమంతా వేధనతో నెత్తుటిధారల్లో తడిసిపోయింది. పీడితులకు అండగా నిలిచేరాజ్యం  ఈ భూగ్రహంమీద మొలవలేదనిపిస్తోంది. నూతనప్రపంచావిష్కరణకు ఇంకెన్నాళ్లో..సామ్రాజ్యవాదకాంక్షలో దేశాలకు దేశాలు  నాశనమౌవుతున్నాయి. దుర్నీతి దురంహంకార పాలకులు రాజ్యాలనేలేందుకొస్తున్నారు. పసిపిల్లలు, వృద్దులు, ఎవ్వరూ వీళ్ళకడ్డులేదు. కాజీనజ్రుల్‌ ఇస్లాం కలలు కన్న రాజ్యం ఇంకా ఉద్భవించలేదు. ఆయన కలలు కన్న పాలకులింతవరకూ రాలేదనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎర్రపూలు పూస్తున్నాయి..ఆ ఆశతోనే సామాన్యుడు, పీడితుడు, బాధితుడు బతుకుతున్నాడు. ఐనా కాజీనజ్రుల్‌ ఇస్లాం యుద్దం ద్వారా మా హక్కులన్నీ సాధించుకుంటామన్నారు. ఆయన రాసిన గొప్పకవిత్వం మనకిటీవల అందుబాటులోకి వచ్చింది. ముస్లింలు దానికంటి ముత్యాలు/హిందువులు దాని జీవితం/ఆకాశమాత ఒడిలో సూర్య చంద్రుల వలె/వాళ్ళ
సంపాదకీయం

షరతులు వర్తిస్తాయి…

ఏ వివాదానికైనా పరిష్కారం ఉండవలసిందే. అసలు వివాదమే లేనప్పుడు పరిష్కారం వెతకడం వృధా ప్రయాస.  భారతదేశానికి ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. యోగి పాలనలో ఏం జరుగుతోందో  తెలిసిన విషయమే. గుజరాత్ నమూనా తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రయోగం కొనసాగుతోంది. ప్రజల దైనందిక జీవనంలో జోక్యం ఎక్కువవుతోంది. ఈ జోక్యం బహురూపాలలో వ్యక్తం అవుతోంది.  ఈ నమూనా భారతదేశం అంతటా విస్తరించవచ్చు. భారతదేశ పని సంస్కృతిలో ఉన్న సంబంధాన్ని విడదీసే ప్రయత్నం యోగి ప్రభుత్వం చేస్తోంది. క్షురక, దర్జీ వృత్తులలో ఉన్న పురుషుల దగ్గరకు స్త్రీలు వెళ్ళకూడదు. స్త్రీలు తమ అవసరాల కోసం స్త్రీల దగ్గరికి వెళ్ళాలి.