మీరీ పుస్తకం చదివారా ?

‘స్టిల్‌ షీ ఈజ్‌ అలైవ్‌’

సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్‌ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి  మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి,  నెత్తుటినది కాస్త  రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను
సంభాషణ

ఇల్లు వర్సెస్ రోడ్డు

“ఇల్లు ఖాళీ చేసినప్పుడు…” ఈ కవిత 88 లో అచ్చుకి దిగింది. కరీంనగర్ పల్లెటూళ్ళలో ఎక్కడో పడివున్న నా మొహం మీకు చూపించింది. కాబట్టి దాని పట్ల నాకు వల్లమాలిన అమ్మతనం లాంటిదేదో వుంది.అసలు అందులో ఏం ఉంది? నన్ను దాచిపెట్టిన నాలుగ్గోడలు , వాటిమీద పెంచుకున్న ప్రేమ ప్లస్ కోపం, రాసుకున్న నిట్టూర్పులు , ఇంతే కదా. “పట్టా మార్చిన పడక్కుర్చీలా, నే వున్న ఇల్లు \ కొత్త శరీరం కోసం ఎదురుచుస్తు౦ది\భయానికీ ఓటమికీ , ఎడారితనానికీ మీసాలు దిద్ది హుందాగా కనిపి౦చేందుకు \ కరడు కట్టిన స్వార్ధానికి పురి విప్పిన అసూయకీ తెల్లటి చొక్కా తొడిగి
నివాళి

ప్రజాన్యాయవాది, మానవహక్కుల నాయకుడు గొర్రెపాటి మాధవరావుకు నివాళి

నిజామాబాద్‌ జిల్లాలోనేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా న్యాయవాదిగా, మానవహక్కుల నాయకుడిగా, విప్లవాభిమానిగా గుర్తింపు ఉన్న గొర్రెపాటి మాధవరావు డిసెంబర్‌ 28న మృతి చెందారు. నేరమే అధికారమైపోయిన ఫాసిస్టు సందర్భంలో నిరపరాధులు, బలహీనులు, న్యాయం కోసం నిలబడినవాళ్లు ‘నేరస్తులుగా’ వేధింపులకు గురవుతున్న కాలంలో హక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా మాధవరావు అర్ధాంతరంగా వెళ్లిపోవడం చాలా పెద్ద నష్టం. ఆయన విప్లవ విద్యార్థి ఉద్యమాల చైతన్యంతో సామాజిక, రాజకీయ జీవితంలో ప్రవేశించారు. అందుకే విప్లవ విద్యార్థి ఉద్యమంలో సదా నిలిచి ఉండే జంపాల చంద్రశేఖర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాడు విప్లవోద్యమం అందించిన ప్రజాస్వామిక
ఖండన

ఎన్. వేణుగోపాల్, ఇతర ఆలోచనాపరులపట్ల సంఘ్ దురుసు ప్రవర్తనను ఖండిద్దాం.

హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ చివ‌రిరోజు వీక్ష‌ణం స్టాల్‌లో అమ్మ‌కానికి పెట్టిన ఓ పుస్త‌కం విష‌యంలో ఆ స్టాల్ నిర్వాహ‌కుడు, వీక్ష‌ణం సంపాద‌కుడు ఎన్‌.వేణుగోపాల్ ప‌ట్ల‌ ఆర్ఎస్ఎస్ వ్య‌క్తుల‌ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను విప్ల‌వ ర‌చ‌యితల సంఘం ఖండిస్తోంది. "తిరుప‌తి బాలాజీ బుద్ధ క్షేత్ర‌మే" అనే ఆ పుస్త‌కాన్ని.. మ‌న గతం ప‌ట్ల ఎరుక‌ను పెంచ‌డంలోభాగంగా  ప్ర‌చురించిన సమాంత‌రకు, అనువాద‌కుడు ఎ.ఎన్‌.నాగేశ్వ‌ర‌రావుకు అండ‌గా తెలుగు స‌మాజం నిల‌బ‌డాల‌ని కోరుతున్నాం. బ‌హుళ‌త్వ విలువ‌ల‌ను సాహిత్యంలో బ‌లంగా ప్ర‌తిపాదిస్తున్న మెర్సీ మార్గ‌రేట్‌, స్కైబాబా వంటి ర‌చ‌యిత‌లు త‌మ భావాల కార‌ణంగా త‌ర‌చూ వేధింపుల‌కు గుర‌వుతున్నారు. త‌న సంపాద‌క‌త్వంలో "ఉచ్చ‌ల జ‌ల‌ధి త‌రంగ" పేరుతో క‌వితా
వ్యాసాలు

“గుండె చప్పుళ్ళు”

(ఇటీవల విడుదలయిన కథా సంపుటికి రచయిత రాసిన ముందుమాట ) తెలుగు సాహిత్యంలో ఈ "ఏకలవ్య కాలనీ" మొదటి ఎరుకల కథా సంపుటి. ఇవి మా జీవితాలు. ఇవి మా ఎరుకల కథలు. ఈ దేశపు మూలవాసీల్లో, ఆదివాసీల్లో ముఖ్యమైన ఎరుకల జీవనగాథలివి. ఈ కథల్లోని మా అవమానాలు, దుఃఖాలు, మా ఓటములు, గెలుపులు, మా కన్నీళ్ళు, నవ్వులు మిమ్మల్ని మా గురించి ఆలోచించమంటాయి. ఒక భరోసా కోసం ఒక ఆసరా కోసం ఒక నమ్మకం కోసం ఒక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న ఎరుకల బ్రతుకుల్లో నిజమైన మార్పు కోసమే ఈ కథలు.. 1991లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా
stories

Why I Became a Guerrilla

My name is Ungi, and I am eighteen years old. My family lived in a village near Geedam Town in Dantewada district, Chhattisgarh. We lived a life where we had to work hard just to survive. If we didn’t find work on some days, we would go hungry. Despite his old age, my grandfather too would go out for daily labour. Since my mother didn’t have enough milk, I used
వ్యాసాలు

స్వీయాత్మకత నుంచి సమిష్టి ఆచరణలోకి

(ఇటీవల విడుదలైన  పాణి  నవల ‘అనేకవైపుల’కు రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు) అనేక ఉద్వేగాలతో పాణి రాసిన ‘అనేక వైపుల’ నవల చదవడమంటే నేర్చుకోవడమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తీవ్రమవుతున్న వాతావరణం ఇది. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల మీద క్రూరమైన అణచివేత ప్రయోగిస్తున్నది. ప్రజా ప్రతిఘటన కూడా వీరోచితంగా సాగుతున్నది. మన దేశంలో యాభై సంవత్సరాలుగా ప్రజలు అన్ని రకాల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ యుద్ధరంగంలో ఉన్నారు. అనేక రకాల అణచివేతలకు దాటుకొని ముందుకు పోతున్నారు. ఇటువంటి ఉద్రిక్త ఉద్విగ్న హింసాత్మక వాతావరణంలో ఈ నవల రూపొందింది. ‘చదవడం అంటే నేర్చుకోవడమే. అమలు
కవిత్వం

లేనిది మరణమే!

నిజమే! అప్పుడప్పుడుమరణాలు గురించి మాటాడుకుంటాం, జీవితం నిండా విజయదరహాసాలనువెదజల్లుకుంటూ నడిచిన ప్రయాణాల గురించి చర్చించుకుంటాంమరణం దాకా ప్రవహించిన ఎగుడుదిగుళ్ళ ప్రవాహాల గురించీమాట్లాడుకుంటాం..దారులలో ముళ్ళను ఏరుకుంటూ గాయాల మూటల్లోకిబతికుని సర్దుకుంటూఅనుకున్న పనులు నిర్వహించుకుంటూ శ్వాస ఆగేదాకా సాగిన ప్రవాహాల గురించి చర్చించుకుంటాం అతడు మిగిల్చిపోయిన పనులని స్నేహితుల మధ్యలో పంచుకుంటాం దేహంలో అరణ్యం లా అతడి భావాల్ని పెంచుకుంటాం అంతరంగం నిండా అతడిక్కడ వొదిలి వెళ్ళిన ఉద్యమ పవనాల్ని పీల్చి ఆ గాలిలో అతడి ప్రాణాన్ని వెదుక్కుంటాంఅతడెప్పటికీ మనల్ని వీడిపోలేదనే ఆలోచన మన నడకలో వేగాన్ని పెంచుతుందిమరణాలతో మనం దేహాల్ని కోల్పోవచ్చు కానీ చాలా మరణాలు జీవించడాన్ని కోల్పోవు అవి
కవిత్వం

ఆకుతేలు

నువ్వు పట్టాభూమిని దున్నుతవుపరంపోగును దున్నుతవునీ కర్రు గట్టితనం గొప్పదిబయటి బాపతులుఇంటిదాక వచ్చిపొయిల ఉప్పు పోసినాచిటపొట చిచ్చు రేగినాఇంటా, బయటా తెల్వకుండాబహురూపుల విన్యాసాలు ఎన్నోఇది తెలిసిన వారికి తెల్క పిండితెలువని వారికి గానుగ పిండిరెండూ ఒకటేననిబైరాగి చేతిలోని తంత్రి తల నిమురుతుంది.ఇసుకలో నూనె పుట్టించడంఇరుసుకు కందెన రాయకుండానేనడిపించే ఉపాయం నేర్పడంనీకు తెలుసుపత్రికల్లో వచ్చినపతాక శీర్షికలనుపేర్చి కూర్చితే అది కవిత్వం కాదుసంపుటాల కుంపట్లు ఎన్ని వెలిగించినా అగ్గి లేకుంటేఅది కుమ్మై కూలుతుందిగూడ పోయి యాతం వచ్చిందియాతం పోయి మోట వచ్చిందిమోట పోయి రాటు వచ్చిందిరాటు పోయి ఆయిల్ ఇంజన్ వచ్చిందిఆయిల్ ఇంజన్ పోయి అంటుకుంటేనేమాడి మసై పోయేకరంటు మోటర వచ్చింది.గూడ కాడ
కవిత్వం

కొత్త సంవత్సరమయినా మాట్లాడుదాం..!

ఎప్పడు మాట్లాడేదే అయినా ఇంకా ఇంకా మాట్లాడాలి కొత్త నినాదాలతో మాట్లాడాలి కొత్త రూపాలను సంతరించుకొని అన్ని తలాలకు విస్తరించే విధంగా నువ్వు- నేను కలిసి కట్టుగా మాట్లాడాలి కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి నిజాన్ని నిగ్గు తేల్చేలా మాట్లాడాలి..!ప్రపంచ నలుమూలను దిగ్బంధనంగా మార్చినా అమెరికా సామ్రాజ్యవాదం ఆయుధ భాండాగారంతో ఆధిపత్యానికి అర్రులు చాస్తూ దేశ దేశాల మీద గుత్తాధిపత్యానికి తెర లేపే యుద్దాలకు బలైపోతున్న దేశ ప్రజలు ఎందరో ఈ గాయాలకు మందు రాయడానికైనా మాట్లాడాలి ఇప్పుడు ఎప్పడు మాట్లాడాలి నువ్వు- నేను కలిసి కట్టుగానే మాట్లాడాలి కొత్త సంవత్సరం అయినా మాట్లాడాలి కాశ్మీర్ జాతి కోసం