దేహం కూడా పొయ్యిలాంటిదే..
దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు శిఖరం గూర్చి