అన్ని వైపులలో రాయలసీమ
ముందుగా పాఠకులకు విజ్ఞప్తి. మీరు చదవబోతున్నది పాణి నవల ‘అనేక వైపుల’పై విమర్శ కాదు, కనీసం సమీక్ష కాదు. ఇది కేవలం ఒక సామాన్య పాఠకుని హృదయ స్పందన మాత్రమే. ఎన్నడూ ఏ పుస్తకాన్ని పూర్తయ్యంత వరకు ఒకే మారు చదివే అలవాటు లేని నన్ను, ఈ నవల దాన్ని పూర్తి చేసేంతవరకు మరో పుస్తకాన్నే కాదు, కంప్యూటర్ జీవిగా బతికే నన్ను దానికీ దూరం చేసింది. అంత లావు నవల ఎలా చదువుతానా? అనుకున్న నన్ను దానికి కట్టిపడేసాడు పాణి. దానికి కేవల ఆ నవల శిల్పం కారణం కాదు. అందులోని సారమే నన్ను కట్టి పడేసింది.