ఇది తెలుగువాళ్ళ వంతు
ప్రతి సంవత్సరం హిందీ సినిమా ప్రముఖుల ఆత్మకథలో, జ్ఞాపకాలో(memoir) ఒకటో రెండో వస్తూనే ఉంటాయి. దాన్ని పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ లాంటివి ప్రచురించి మార్కెట్ లో అమ్ముతూనే ఉంటాయి. దానికి ఉన్న రీడర్షిప్, మార్కెట్ కూడా అలాంటిదే. సాహిత్యంలో సినిమా గురించిన రచన కూడా ఒక ప్రక్రియ(genre). భారతీయ ఇంగ్లీషు సాహిత్యం ఈ genre ని దాదాపు హిందీ సినిమాకి సంబంధించిన విషయంగానే ఉంచింది. భారతీయ ఇంగ్లీషు సాహిత్యంలో వేరే ఏ సమాజం నిర్లక్ష్యం కాబడనంతగా తెలుగు సమాజం నిర్లక్ష్యం అయింది. గత కొన్నేళ్లుగా ఇంగ్లీషులో తమిళ, మలయాళ, కన్నడ భాషల సాహిత్యం, సంస్కృతి, చరిత్రకి సంబంధించిన పుస్తకాలు