కాలమ్స్ విశ్లేషణ

బస్తరును కాపాడుకుందాం

ప్రొఫెసర్‌ సాయిబాబా రాజ్య వ్యవస్థీకృత హింస, నిర్బంధం కారణంగా అమరుడైన సందర్భంగా గత అక్టోబర్‌ నుంచి విజయవాడ బుక్‌ ఫెయిర్‌ (జనవరి మొదటి వారం) దాకా కవులు, రచయితలు బుద్ధిజీవుల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చింది. ఒక నెల కూడా గడవకుండా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సాయిబాబా అమరత్వం సందర్భంలో సంక్షోభ కాలంలో సాహిత్యం భూమిక’ గురించి విరసం ఏర్పాటు చేసిన రెండు రోజుల సాహిత్య పాఠశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఈ సాహిత్య పాఠశాలను ప్రారంభిస్తూ సాయి సహచరి వసంత
పత్రికా ప్రకటనలు

ఆదివాసీ నాయకుడు రఘు మిడియామి  అక్రమ అరెస్టు 

2025 ఫిబ్రవరి 27 నాడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ‌ఎ) దంతేవాడ నుండి ప్రముఖ యువ ఆదివాసీ నాయకుడు రఘు మిడియామిని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అరెస్టు చేసింది. 2025 ఫిబ్రవరి 28నాడు ఎన్‌ఐ‌ఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మూల్‌వాసీ బచావో మంచ్‌తో సంబంధం ఉన్న గజేంద్ర మాండవితో పాటు మరొక వ్యక్తిని 6 లక్షల రూపాయల నగదు,  మూల్‌వాసీ బచావో మంచ్‌, మావోయిస్టుల కరపత్రాలతో అరెస్టు చేసినట్లు చెప్పింది. 25.03.23న గజేంద్ర మాండవిని అరెస్టు చేసిన తర్వాత 24.08.23న నమోదు చేసిన FIR నం.02-2023-NIA-RPR పై దర్యాప్తులో, రఘు మిడియామి మూల్‌వాసీ బచావో మంచ్
కాలమ్స్ మీరీ పుస్తకం చదివారా ?

‘ఇదే నేను ఇదే నా జీవితమనుకో…’

ఇదే నేను ఇదే నా జీవితమనుకో...’ అంటూ వొకచోట..ఇంకిపోని ఊట బావిలాంటిదే ఈ దేహం/ఇదికూడా వో సామూహిక కన్నీటి సమీకరణ కేంద్రమే..అంటూ మరొకచోట కవిత్వాన్ని జీవితానికి మిళితం చేసి రాస్తున్న కవి వైష్ణవిశ్రీ. తెలుగు కవిత్వంలో సీరియస్‌గా కవిత్వం రాస్తున్న కవుల జాబితాలో ఉన్నారు. అనతికాలంలోనే తనకంటూ సాహిత్యలోకంలో వొకపుటను ఏర్పరచుకున్నారు. కవిత్వాన్ని ప్రేమగా ప్రేమిస్తుంది. ఆమె కవిత్వంలో గాఢత, లౌల్యం కలగలసి కనబడతాయి. సమాజాన్ని చూసేకోణం వొక్కొక్కరిది వొక్కో విధంగా వుంటుంది. సమాజం పట్ల స్పష్టమైన దృక్ఫథం కలిగి వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ప్రతీదాన్ని వస్తువుగా తీసుకుని ప్రగతిశీలతను చాటుతుంది. కొన్ని చోట్ల కవిత్వాన్ని మంటల్లా మండిస్తే, 
stories

Memento

Narmada was lying down with the saline drip inserted into her veins and looked very weak. I sat beside her on a stool. I looked in turn at the saline bottle and Narmada’s face with death writ largely on it. Occasionally I looked out of the window located above her bed. ‘The skies are so dark. It is going to be a heavy downpour,’ I thought. “News of our comrades
కవిత్వం

ఊరికే వుండలేను కదా

చుట్టూ ఇంత పొగ మంచుకమ్ముకున్న వేళరెండు అక్షరాలు రాయకుండావుండలేను జీవితం చుట్టూ ఇంత బూడిదపడుతున్న వేళరెండు వాక్యాలుగామారకుండా వుండలేను ఎవరి కోసమో పసిపాపలగొంతుకోస్తున్న వేళరెండు కన్నీటి చుక్కలనుకాకుండా వుండలేను భూమిని చెరబట్టి బాంబులుకురిపిస్తున్న వేళవాడి చేతులలో బూబీ ట్రాప్అయి పేలకుండా వుండలేను.
అనువాదం

బస్తర్ యుద్ధంలో అస్పష్ట  విభజన రేఖ

2024లో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల బలమైన కోట అయిన బస్తర్‌లో 287 మంది మావోయిస్టులను లేదా అంతకుముందు సంవత్సరం కంటే 10 రెట్లు ఎక్కువ మందిని తాము చంపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఫిబ్రవరి 9నాడు హత్య చేసిన 31 మందితో సహా 2025 ఫిబ్రవరి 10 వరకు కనీసం 80 మంది మావోయిస్టులను కాల్చి చంపారు. మధ్య భారతదేశంలోని అడవులు, గ్రామాలలో యుద్ధం ఉధృతంగా జరుగుతోంది; దౌర్జన్యాలు, చట్టాతీత హత్యల ఆరోపణలు, ఆత్మీయుల మరణాలకు కావలసింది పరిహారం కాదనీ న్యాయం అనీ డిమాండ్ చేస్తున్న; తమ స్వంత గ్రామాలలోనే జరిగే హింస, మరణాలకు భయపడుతున్న ఆదివాసీలను వెతకడానికి మేం
పత్రికా ప్రకటనలు

పదమూడు నెలల ఆపరేషన్ కగార్

ప్రజల హక్కులను పణంగా పెట్టి, అంతర్గత సాయుధ సంఘర్షణ పరిస్థితులలో రాజ్య బలప్రయోగాన్ని నియంత్రించే దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్‌లో సంవత్సరానికి పైగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా విధానాన్ని ఖండిస్తున్నాం. ఇటీవల ఫిబ్రవరి 9నాడు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలతో సహా  2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. మొత్తం అరెస్టులు 1033, లొంగుబాటులు 925 కు చేరుకున్నాయి. 2025లో కూడా మావోయిస్టులు కూడా కనీసం తొమ్మిది మంది పౌరులను చంపారని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి.
ఆర్థికం

ఏకరూప జాతీయ మార్కెట్లు: రైతులకు మరణశాసనం

గత సంవత్సరం మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోడీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మెజారిటీ తగ్గిపోవడానికి ప్రదాన కారణం. జెడియు, టిడిపి మద్దతుతో బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్‌ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బిజెపి కొనసాగిస్తోంది. కేంద్రంలో
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారత రాజ్యం చేపట్టిన జాతి విధ్వంసక సైనిక ప్రాజెక్టు ఆపరేషన్ కగార్‌లో ఫిబ్రవరి 9నాడు 31 మంది మావోయిస్టులను హత్యచేసింది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల చట్టాతీత హత్యలను ఖండిస్తూ, సుప్రీంకోర్టు, "రిపబ్లిక్ తన సొంత పిల్లలను తానే చంపుకోవడానికి మేం అనుమతించలేం" అని అన్నది. తన 76వ వార్షికోత్సవ సంవత్సరంలో (2025), ‘మావోయిస్టులపై యుద్ధం’ పేరుతో  మావోయిస్టులని చెబుతూ భారత గణతంత్ర రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 81 మంది పౌరులను చంపింది. ఫిబ్రవరి 1న, బీజాపూర్‌లో ఎనిమిది మంది ఆదివాసీ గ్రామస్తులను మావోయిస్టులుగా ముద్రవేసి చంపారు. రెండు రోజుల క్రితమే
సంపాదకీయం

జీవనది మాట్లాడితే…

కుంభమేళా ముగిసింది. గంగానది ప్రవాహం కొనసాగుతోంది. కోట్ల మంది మనుషుల శరీర వాసనను నది తన నీటితో శుద్ధి చేసింది. నది రాత్రివేళ తనతో తను సంభాషించుకుంటుంది. ఇన్ని కోట్ల మంది మనుషులు.. సగ భారతదేశం నాలో మునక వేసిందా ఆని. నిరంతర ప్రవాహగతిలో నది నిశ్చల  జలధి  తరంగం. సముద్రతీరం లేని ప్రాంతంలో జీవించలేను అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అతని జీవన మజిలీలు విశాఖపట్నం, చెన్నపట్నం. సముద్రంతో మనుషులకు ఉన్న భావోద్వేగ స్థితిని శ్రీశ్రీ పలవరించారు. నదులు మానవ నాగరికతా వికాసానికి జీవనోత్సవాన్ని ఇచ్చాయి. నది నుండి మానవులు  ఎంత స్వీకరించాలో అంతకు  మించి  వశం చేసుకున్నారు