పదునెక్కిన ఆయుధం కదా జీవితం..!
స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని దు:ఖాలు, మరికొన్ని విషాదాలు కవిత్వంలో కనబడతాయి. వర్తమాన కవిత్వలోకంలో విస్తృతంగా కవిత్వం వస్తునే వుంది. నవతరం యువ కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిగమ్యం, కవిత్వ పరిణామం ఏమిటి అని ప్రశ్నించినపుడు జవాబు మనికిప్పుడు అస్పష్ట్టంగానే వినబడుతుంది. సామాజికవాస్తవాన్ని నొక్కి చెప్పగలిగిన కవిత్వం వర్తమాన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడుతుందన్న విషయం కొద్ది మందికే తెలుసు. సామాజిక వాస్తవాన్ని కవిత్వంలో చెప్పాలనుకున్నప్పుడు కవికి సైద్దాంతికబలం ఉండాలి. అలా ఉన్నప్పుడే కవి