సంపాదకీయం

రేణుక పర్యాయపదం మిడ్కో

విప్లవోద్యమం స్త్రీలను ఒక విశాలమైన ప్రపంచంలోకి తీసికెళుతుంది. వేల ఏళ్ల సంకెళ్ల నుంచి విముక్తమయ్యేందుకు రెక్కలు తొడుగుతుంది. పితృస్వామ్యమనే అత్యంత హేయమైన బందీఖాన నుంచి సుందరమైన స్వేచ్ఛాతీరంలోకి నడిపిస్తుంది. సొంత ఆస్తి పునాదిగా, లైంగిక శ్రమ విభజన అనే ఇరుకు గోడల మధ్య నిర్మాణమైన కుటుంబం నుంచి ఉత్పత్తిదాయకమైన, సృజనాత్మకమైన వర్గపోరాటంలో భాగం చేస్తుంది. అప్పుడు స్త్రీలు చేయగల అద్భుతాలు ఎట్లా ఉంటాయో, అవెంత సాహసికంగా పదునెక్కుతాయో తెలుసుకోవాలంటే మిడ్కో జీవితంలోకి తొంగి చూస్తే చాలు.  ఆమెలాంటి వేలాది, లక్షలాది నూతన మహిళలను అర్థం చేసుకోడానికి ఆమె నడచిన దారులను గమనిస్తే సరిపోతుంది. రేణుక ఒక మధ్య తరగతి