ఇంటర్వ్యూ

ప్రజా ప్రయోజనం కోసం శాంతి కోరుకుంటున్నాం

(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్‌ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా  శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర - పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం ) వికాస్ తివారీ: ఛత్తీస్‌ఘడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది. నాలుగు దశాబ్దాల నుంచి  మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యలో
సమకాలీనం

శాంతి ప్రతిపాదనకు విరుద్ధంగా గుట్టల దిగ్బంధం

(మావోయిస్టులు కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్న సమయంలో భద్రతా బలగాలు అగ్రశ్రేణి తిరుగుబాటు నాయకులకు ఆశ్రయం కల్పిస్తున్న కొండలపై కాల్పులు జరిపాయి చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రధాన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం నుండి ఒక క్షేత్రస్థాయి రిపోర్ట్) ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం, భారీ ఫిరంగి కాల్పులు పెద్ద పేలుళ్ల శబ్దాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాయి, ఇక్కడ భారత భద్రతా బలలు ప్రారంభించిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) శాంతి చర్చలలో పాల్గొనడానికి తన సంసిద్ధతను
పత్రికా ప్రకటనలు

శాంతి చర్చలు: ద్రోహాలు, మానవాహననాలు  

పాలస్తీనా నుండి బస్తర్ దాకా కార్పొరేట్ యుద్ధ యంత్రాన్ని ఆపండి భారత ప్రభుత్వం తమపై కొనసాగిస్తున్న చర్యలను నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ఏప్రిల్ 3నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శాంతి చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నొక్కి చెబుతూ, అర్థవంతమైన చర్చలకు సానుకూల, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. "ప్రభుత్వం మా పిలుపుకు సానుకూలంగా స్పందిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము" అని కూడా పార్టీ  ఆ
సంపాదకీయం

కర్రెగుట్టలపై మీరు ఎగరేసింది కార్పొరేట్‌ జెండా కదూ

ప్రతీకలకు చాలా అర్థాలు ఉంటాయి. జెండాల్లో, రంగుల్లో, చిహ్నాల్లో అసలైన భావాలు ఉంటాయి.   మనుషులు చేసే పనుల్లో బైటికి కనిపించని లక్ష్యాలు సహితం అవి ప్రతిబింబిస్తుంటాయి. చత్తీస్‌ఘడ్‌`తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను భారత ప్రభుత్వ బలగాలు  ఏప్రిల్‌ 22వ తేదీన చుట్టుముట్టాయి. సరిగ్గా ఆ రోజే దిగ్బంధం మొదలైందా?  అంతక ముందు ఎంత సన్నాహం జరిగి ఉంటుంది? ఎంత ప్రణాళిక అమలయి ఉంటుంది? గుట్టలకు, గూడేలకు, రోడ్లకు యుద్ధం ఎంతగా భీతానుభవంలోకి వచ్చి ఉంటుంది? అడవి యుద్ధరంగం కావడం, ప్రకృతి తర్కం అటుపోట్లకు గురికావడం, మనుషులు గుండెలవిసేలా ఆందోళనపడటం పత్రికలకు అందేదేనా? టీవీలకు కనిపించేదానా? దేశమంతా కలవరపడి, కలతచెంది, యుద్ధం