stories

Backwardness

The moonlight was bright! Green fields surrounded by rows of coconut trees greeted the comrades who had traveled from afar, easing their fatigue and offering them a pleasing sightas they halted among the sweet limetrees on the village outskirts. The wind blew, frantically trying to extinguish the fire of hunger in their bellies. While everyone else was engrossed in admiring the beautiful scenery and trying to forget their tiredness, Ashokanna
సమకాలీనం

టెండూ ఆకును అమ్ముకునే  స్వేచ్ఛ కోసం కోరాపుట్ ఆదివాసుల పోరాటం

దేశ వ్యాప్తంగా ఆదివాసులకు కెండు లేదా టెండు ఆకు (బీడీ ఆకు) కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే  కాదు, వారి జీవనాధారం. పొడి నెలల్లో వచ్చే ఈ ఆకులు వేలాది కుటుంబాలకు కాలానుగుణ  ఆదాయాన్ని అందించే హామీనిస్తున్నాయి. కానీ అకారణ ఆలస్యాలు, అమ్ముకోడానికి అనుమతినివ్వడంలో ఆలస్యం, ప్రభుత్వ ఉదాసీన ప్రవృత్తి వల్ల ప్రతీ ఏడాదీ ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత పూర్తి స్థాయిలో ఉండగా, రుతుపవనాలు వేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో, ఒడిశాలోని కొరాపుట్‌లోని ని బోయిపారిగుడా బ్లాక్‌లోని ఎనిమిది గ్రామ సభలు ఈ సీజన్‌లో తాము సేకరించిన బీడీ ఆకును స్వతంత్రంగా అమ్ముకోవడానికి అనుమతి కోసం ఇంకా వేచి
సంపాదకీయం

ప్రజా యుద్ధ శాంతి దూతలు

ఒక్కరొక్కరే ఒరిగిపోతూ కన్నీటి చుక్కలవుతున్నారు. కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోబోతే అవి రక్తాశ్రువులని గుండెలు బరువెక్కుతున్నాయి. కానీ రెండు నెలలకు పైగా శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో యోధుల పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న స్పందన ఆ యోధులిచ్చిన శాంతి సందేశపు ప్రదర్శనలుగా తెలుగు నేల అన్ని చెరగులలోనే కాదు ఇవాళ దేశమంతా నలు దిశలా విస్తరిస్తున్నది. ఇది మృతదేహాల స్వాధీన ఉద్యమం ఎన్కౌంటర్లు జరిగి ఆ శవాలనుంచే ఆసుపత్రి శవాగారాల నుంచి, రిపోస్టుమార్టం కోసం న్యాయపోరాటం జరిగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి, రిపోస్టుమార్టం జరిగే ఆసుపత్రుల నుంచి, అమరుల గ్రామాల దాకా ప్రదర్శన లైనట్లుగా మారుమూల గ్రామాలలో కూడా అంతిమయాత్రలుగా
వ్యాసాలు

జనతన రాజ్యంలో కా . గౌతమ్

(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి) పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో  ఉండగానే కామ్రేడ్‌ గౌతం కనిపించాడు. ఆయన విప్లవోద్యమంలో సీనియర్‌ నాయకుడు. నేను అక్కడికి వస్తానని ఆయనకు ముందే తెలుసు. నన్నెంతో ఎరిగినవాడివలె ఆలింగనం చేసుకొని నా కళ్లలోకి ఆత్మీయంగా చూశాడు. అందులో ఎన్నో పరామర్శలు. నా ప్రయాణంలో పార్టీ నాయకులు ఎవరెవరు కలుస్తారో నాకెలాంటి ఊహ కూడా లేదు. అయితే నేను విని ఉన్న వాళ్లెందరినో కలవాలనే ఆశ ఉండేది. అయితే ఇన్ని రోజుల్లో అలాంటివారేమైనా కలుస్తారా? అని నేను కామ్రేడ్‌ ఇడిమెను ప్రత్యేకించి
వ్యాసాలు

ఆపరేషన్ కర్రెగుట్టలు – సఫలమా? విఫలమా?

2025 మే 14నసి‌ఆర్‌పి‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ డీజీపి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఏప్రిల్ 21 నుండి 21 రోజుల పాటు జరిపిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రధానంగా నెరవేర్చామనీ, అమిత్ షా ప్రకటించినట్లు 2026 మార్చ్ 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టించి తీరుతామని ప్రకటించారు. ఈ పత్రికా సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాను ఆహ్వానించారు. ఆ ప్రెస్ మీట్ లో పేర్కొన్న ముఖ్య అంశాలు: 1. ఆపరేషన్ కర్రెగుట్టలు విజయవంతమైంది. మొత్తంగా 31 మంది మావోయిస్టులను తుదముట్టించాము. 2. 450 ఐ‌ఈ‌డి లను నిర్వీర్యం చేశాము.
సంపాదకీయం

ఆయన మరణానంతర జీవితం

కా. బసవరాజు అమరుడయ్యాక,  అర కన్నులతో ఆయన మృతదేహం ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అదిగాక, ఆయన నవ్వ యవ్వనంలో ఉన్నప్పటి మరో ఫొటోను డెవలప్‌ చేసి  అభిమానులు ప్రచారంలోకి తెచ్చారు. దాన్ని ఒక మిత్రుడు  చూసి  ‘ఇది ఆయనకు సరిపోలినది కాద’ని అన్నారు. ఈ పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆయన నివాళి సందర్భాల్లో అదే కనిపిస్తున్నది. యాభై ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపిన నంబళ్ల కేశవరావుకు ఉద్యమంలో ఉండిన  పేర్లు బైటికి వచ్చాయేగాని, ఇంకో ఫొటో ఏదీ ఎవ్వరి దగ్గరా ఉన్నట్లు లేదు.   ఆయన కుటుంబసభ్యులు కూడా పాతికేళ్ల వయసులోని ఆ ఫొటోకే పూల దండలు వేసి
నివేదిక

కాల్పుల విరమణ డిమాండ్ – మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు

(కర్రె గుట్టల దిగ్బంధం మీద  క్షేత్రస్థాయి నివేదిక ) ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం; భారీ ఫిరంగి కాల్పులు; పెద్ద పేలుళ్ల శబ్దాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాయి; ఇక్కడ భారత భద్రతా బలలు ప్రారంభించిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక సైనిక చర్య  జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) శాంతి చర్చలలో పాల్గొనడానికి తన సంసిద్ధతను పదేపదే వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ భద్రతాబలగాలు ఈ సైనిక చర్యను చేపతాయి. మార్చి 28 నుండి, మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ కోసం నాలుగు ప్రకటనలను విడుదల చేసింది.
అనువాదాలు

మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఎలా దహనం చేశారు?

మే 27న, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు మృతదేహం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో పోలీసు వలయం చుట్టుముట్టిన ఆదివాసీల శ్మశానవాటికలో దహనం అవుతుంటే, అతని తమ్ముడు నంబాళ్ళ రాంప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్ వెలుపల తీవ్ర ఆగ్రహంతో నిలబడివున్నాడు. “మరణించిన తర్వాత, మృతుడి మృతదేహం కుటుంబానికి చెందుతుంది” అని ఆయన అన్నారు. “ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేసింది చాలా తప్పు; ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదు.” నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) అగ్ర నాయకుడు బసవరాజుగా ప్రసిద్ధి చెందిన 72 ఏళ్ల కేశవరావును, మరో 26 మందిని భద్రతా చర్యలో రాష్ట్ర పోలీసులు చంపారనే వార్తలు వచ్చిన
మీరీ పుస్తకం చదివారా ?

నిప్పులుగా ప్రవహించే కవిత్వం

చాన్నాళ్ళుగా కవి వసీరా గూర్చి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. అప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చదివిన కవిత్వం ఇప్పుడు ఒక్కచోట ఇలా వసీరా లోహనది పేరుతో లభించడం కవిత్వప్రేమికులకు...నాకూ ఆనందమే. కవి వసీరా రాసింది మూడంటే మూడు కవిత్వసంపుటాలే. ఎంతలోతుగా రాస్తారు. ఎంతగాఢతగా రాస్తారు. ఇది చదువుతున్నంతసేపూ కవిత్వం కోసమే కవిత్వం రాసిన అనుభూతి కలిగింది. ఆపకుండా చదివించాడీకవి. గుండెకు ప్రకంపనం కలిగింది. కవిత్వం చదువుతున్నంత సేపూ హృదయం లయాత్మక విన్యాసమైంది. ఎనబయ్యోదశకంలోనే ఎంతో గొప్ప కవిత్వం రాశారు. ఇప్పటికది అవసరమని భావించి ఈ కవిత్వం గూర్చి నాల్గుమాటలు రాయాలనిపించింది.          ‘అన్నా! నాకు నిరుద్యోగం వచ్చింది’ అని                
stories

Collective Grief

‘Chinnamma, here, have just this one idli’, Aruna said to her aunt pleadingly. Kamalamma  shook her head in a way that showed more inability than refusal. Aruna put her arms around her aunt’s shoulders and said, ‘You haven’t eaten since this morning, you must eat.’ ‘No, bidda’, she said, turning away, hiding the tears that were threatening to flow out of her eyes, and rested her head against the seat.