భయం, అభద్రత
ఇవ్వాల్టి సగటు ముస్లిం జీవితం ఈ కథలో ఉంది. నేటి పెహెల్గాం సందర్భమే కాదు. నిన్నటి కరోనా సందర్భమూ కూడా ముఖ్యంగా మోషాల నాయకత్వంలో బీజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భయం! అభద్రత! మరీ ఎక్కువయ్యింది. చదువుకున్నవారు చదువురానివారు అనే తేడా లేదు. వయసు బేధం అంతకూ లేదు. మతం మత్తు ఎక్కితే చాలు. అందులో భాగమే చదువుకున్న రఘు"రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్లా వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట" అంతా "అట" ప్రచారమే. వాస్తవ పరిశీలన ఉండదు. మంచీ చెడుల ఆలోచన ఉండదు. నిజనిజాలకు తావేలేదు.