నేర్చుకోవలసిన పాఠం
(ఇటీవల విడుదలైన కామ్రేడ్ కె ఎస్ *కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర*కు రాసిన ముందు మాట ) నక్సల్బరీని తిరిగి నిర్మించుకునే క్రమంలో క్యాడర్‌కు కె.ఎస్.చెప్పిన పాఠాలివి. ఆనాటికుండిన సాంకేతికతను ఉపయోగించుకుని లోచర్ల పెద్దారెడ్డి కె.పస్. చెప్పిన పాఠాన్ని అక్షరీకరించారు. ఈ పాఠం రెండు భాగాలుగా వెలువడనుంది. దాదాపు ఎనభైయవ దశకం ప్రారంభంలో కొత్తగా పార్టీ నిర్మాణంలోకి వచ్చిన వారికి చెప్పిన పాఠమైనా ఇవ్వాల్టికీ దీని ప్రాసంగికత వుంది. కమ్యూనిస్టు పార్టీలు కృశ్చేవ్ శాంతి మంత్రాన్ని పఠిస్తూ వర్గ పోరాటాన్ని మరచిపోయి, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఎరుకను మరచి ఆర్థిక పోరాటాలకు పరిమితమైన కాలంలో నక్సల్బరీ ఉద్యమం ఆరంభమైంది. అనేక