కరపత్రాలు

తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి ...) ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ వివిధ స్థాయి నాయకులు కోరుతున్నారు.  మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలనే ప్రజా ఉద్యమంలో భాగమవుతున్నారు. జాతీయస్థాయిలోనూ ఇదే వైఖరి వినిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా కాక సామాజిక సమస్యగా తమ ప్రభుత్వం చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఇవన్నీ నోటి మాటలుగానే ఉండిపోయాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని  కాంగ్రెస్‌  అధిష్టానం పదేపదే చెబుతోంది. సంఫ్‌ుపరివార్‌ నుంచి
కవిత్వం

నెత్తుటి అధ్యాయం

వాళ్లు తమ ఊపిరి వున్నంతవరకు పోరాడుతూ మరణిస్తూనే వున్నారు నువ్వింకా ఎంతమందిని చంపినా చివరాఖరికి నువ్వు విసిగి పోవాలి కానీ వారు పుడుతూనే వుంటారు నువ్వు వాళ్ళతో మాటాడే ధైర్యం లేని పిరికి పందవు కనుక వాళ్ళు ప్రజల కోసం యుద్ధ రచన చేసే మేధావులు నువ్వు ప్రజలను దోపిడీ చేసే చదువు రాని మొద్దువు అందుకే నువ్వు ప్రతిసారి మాటల సందర్భాన్ని తప్పించుకుంటున్నావు ప్రజల ముందునీ ముసుగు తొలగిపోతుందని నీ బండారం బయట పడుతుందని నీకు భయం అందుకే వాళ్ళని చంపుతున్నావు కానీ ఇది వెయ్యేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం చరిత్రను మార్చి రాసే నీకు చరిత్రను
సంపాదకీయం

కాల్పుల విరమణ ఒప్పందాలు- విప్లవోద్యమ పంథా: మార్క్సిస్టు దృక్పథం

(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి ...) సాయుధ పోరాట సంస్థలకు, ప్రభుత్వాలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు రాజ్యాంగపరిధిలోనే జరుగుతాయి. ఈ కారణం వల్లనే మావోయిస్టు పార్టీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందాలకు రావాలని వివిధ ప్రజాస్వామిక శక్తులు ఆకాంక్షిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ డిమాండ్‌ ప్రజా ఉద్యమ రూపం తీసుకున్నది. శాంతి చర్చల ఆవశ్యకతను వివరిస్తూ అనేక విశ్లేషణలు వస్తున్నాయి. వీటితోపాటు కాల్పుల విరమణ ఒప్పందాలు`శాంతి చర్చల మీద మార్క్సిస్టు విశ్లేషణ కూడా