అనిశెట్టి రజితకు జోహార్లు..
ప్రజాపక్ష రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితకు జోహార్లు.వరంగల్‌లో ఈ నెల 11 తేదీన గుండెపోటుతో ఆమె మరణించారు. సామాజిక ఉద్యమ సందర్భాలకు స్పందిస్తూ, ఊరేగింపుల ముందు కవిత్వాన్ని కవాతులా నడిపించిన సాహిత్య, సామాజిక ఆచరణజీవిగా రజిత గుర్తుండిపోతారు.ఉద్యమాలతో మమేకమై జీవిస్తూ కళా, సాహిత్య రంగాల్లో పనిచేయాల్సిన అవసరం గతం కంటే ఇప్పుడు మరింత పెరిగింది. భిన్నాభిప్రాయాలను సహించని వాతావరణంలో ప్రజాపక్షం వహిస్తూ చిన్న కామెంట్, పదునైన ఒక వాక్యం సోషల్ మీడియాలో పెట్టీపెట్టగానే ట్రోలింగ్ వేట మొదలయిపోతోంది. సొంత లాభం కొంత మానుకు.. పొరుగువానికి తోడుపడవోయ్.. అన్న గురజాడ అప్పారావు జీవించి ఉంటే