ఎటూ తేలని చర్చలు.. ఆగని యుద్ధం
రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్ పైబర్ డ్రోన్ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది. రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి