విప్లవ రచయిత , పాత్రికేయుడు, బహుముఖ అనుభవ సంపన్నుడు గౌతందా
మధ్య రీజియన్ లోని గాలికొండ నుండి తిప్పాగఢ్ వరకు, దక్షిణ బస్తర్, పశ్చిం బస్తర్, మాడ్ కొండలను, సుర్జాగడ్, దంకోడివాహి అడవులను దాటుకొని తిప్పాగఢ్ వరకు ఆరు పదులు దాటిన ఆ విప్లవకారుడు తన బాధ్యతల నిర్వహణలో భాగంగా, అలుపెరుగక గెరిల్లాలతో కాలు కలిపేవాడు. ఆగినచోట యువ గెరిల్లాలంతా పొలోమంటూ తన చుట్టూ చేరితే వారి ముందు ప్రపంచాన్ని ఆవిష్కరించేవాడు. తన అపార అనుభవాల యవనికను పరిచేవాడు. ఒక భుజానికి ఏకే తుపాకి, మరో భుజానికి కుర్చీ, నడుంకు పోచ్, వీపున కిట్టు, కిట్లో అనేక పుస్తకాలు, జబ్బ సంచిలో కంప్యూటర్, మొబైల్ ఫోన్ తో కొద్దిగా వంగి