ప్రజాస్వామ్యం లేకుండా శాంతి, శాంతి లేకుండా ప్రజాస్వామ్యం సాధ్యం కాదు
(ఇటీవల విడుదల అయిన *శాంతి చర్చలు - ప్రజాస్వామిక అన్వేషణ * అనే పుస్తకంలోని ముందుమాట) ఈ ప్రచురణ ఒక ప్రయోగం లాంటిది. ఇందులో రెండు ఇంటర్వ్యూలు, ఒక సంస్మరణోపన్యాసం రెండు ప్రసంగ వ్యాసాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రక్రియలు. ఇంటర్వ్యూలు చాలా వరకు అది చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సంస్మరణ ఉపన్యాసం పూర్తిగా లిఖిత రూపంలో ఉంటుంది. ప్రసంగ వ్యాసాలు సందర్భాన్ని బట్టి ఏ సంస్థ నిర్వహిస్తున్నదో దాన్ని బట్టి ఉంటాయి. అయితే ఈ అన్నింటిలో అంశం దాదాపు ఒకటే కాబట్టి ఒక రన్నింగ్ థీమ్ ఉంది. వీటిలో శాంతి ప్రధానమైన అంశమైనా, శాంతి