మీరీ పుస్తకం చదివారా ?

ఈ కథలనెందుకు చదవాలి..?

కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.  - ఆరుద్ర ఆధునిక కథపుట్టుకకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ గత నాలుగుదశాబ్దాల కథాప్రయాణంలో ‘కథ’ విస్తృతమైంది. కథాసాహిత్యం ఏ సాహిత్య ప్రయోజనాలకోసం ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొత్తతరం కథకులు ముందుకొస్తున్నారు. వైవిధ్యమైన కథావస్తువుల్ని కథాసాహిత్యానికి పరిచయం చేస్తున్నారు. ఆధునిక కథ ఆవిర్భావం సమాజాన్ని సంస్కరించే ఉద్దేశ్యంతో కథావస్తువులు వచ్చాయి. ఇప్పుడలా కాదు  వొక ఘటననూ, వొక జాతి సంస్కృతిని దాని తాలూకూ విలువల్ని, లేదా వివక్షల్ని, వర్తమాన ఆధునిక సమాజం ఎదుర్కొంటున్ని నైతికమానవతావిలువల పతనాన్ని, నాగరిక సమాజపు పోకడల్ని కథలుగా రాయడం
సంపాదకీయం

ఈసారి లోపలి నుంచి…

చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని  కొందరు హితవు పలికారు.   వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద,