మధ్య భారతంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా – ఒక పరిశీలన
ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభానికి కారణం లాభాపేక్షతో కూడిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అని, బీజాపూర్, దండకారణ్యాలలో మావోయిస్టుల జనతన సర్కార్ల రూపంలో ఉన్న పాలనా నమూనాలాంటి ప్రత్యామ్నాయ ప్రజా అభివృద్ధి నమూనాను మనం నిర్మించుకోవాలని నిరసనకారుల్లో ఒకరు మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాలుష్యం సంక్షోభానికి గల నిజమైన మూలాలను, వాటిని అంతం చేయగల ఏకైక పరిష్కారాన్ని వారు సరిగ్గా, ఖచ్చితంగా ప్రకటించారని మేము భావిస్తున్నాము. మా పత్రిక నాల్గవ సంచికలోని 'ప్రజల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా, మధ్య భారతదేశంలో పాలన' అనే వ్యాసాన్ని మా వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం. ఈ వ్యాసాన్ని చదివి, ప్రజలు, ప్రకృతి








