తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అంటే శాశ్వత విరమణే
ఈ సంవత్సరం మార్చ్ నెల నుండి – అంటే మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటి నుండి దేశంలో ప్రజాస్వామిక వాదులు, విప్లవ సానుభూతిపరులు, మేధావులు ఈ విషయంలో చర్చలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై తమ వైఖరిని ప్రకటించి ఉన్నాయి. ఎన్నో ప్రజాసంఘాలు, విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా శాంతి చర్చలను జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహించాయి. ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్, తమిళ్ నాడు లలో ఇవి పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా ఒక్కొక్క ఘటనలో పది, ఇరవై,