చివరి పాలస్తీనియన్ గురించి రాండా జర్రర్
బహిరంగ జియోనిస్టు మద్దతుదారుడు మయిమ్ బియాలిక్ ఫిబ్రవరి 2024లో నిర్వహించిన ‘పెన్ అవుట్ లౌడ్’1 సమావేశం నుంచి బయటకు ఈడ్చుకెళ్తుంటే, “ఒక పాలస్తీనీయుడితో పెన్‌లో ఇలా వ్యవహరిస్తున్నారు?” అని రండా జర్రర్ నినదించింది. గాజాపైన ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గురించి మయిమ్ చాలా మొరటు హాస్యం చేసాడు. నిరసనగా, జర్రర్ తదితరులు అప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ చంపిన 13 మంది పాలస్తీనా రచయితల పేర్లను చదివారు. 2023 అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు (సెప్టెంబర్ 2025) గాజాలో 270 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ చంపింది. భావప్రకటనా స్వేచ్ఛ, సాహిత్యం, కళల కోసం పనిచేసే లాభాపేక్ష