పోషకాహార లోపం… పాలకుల వైఫల్యం!
నేటి బాలలే రేపటి పౌరులు. బాలల ఆహారం, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆ దేశం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ప్రస్తుతం మన దేశంలోని బాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేశం 2021లో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న 7 లక్షల మంది బాలలు చనిపోయారు. వీరిలో 5 లక్షల మంది (70 శాతంకు పైగా) పోషకాహార లోపంతో చనిపోయారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి ఎదుర్కొంటున్న పోషకాహార లోపం పిల్లల మరణాలకు కూడా కారణమౌతున్నది. ఇదేకాలంలో ప్రపంచ వ్యాపితంగా 47 లక్షల మంది పిల్లలు మరణించారు. వీరిలో 24 లక్షల










