కవిత్వం

నల్ల కలువ..!

అదితెలంగాణ నేల విముక్తి కోసంసాగిన సాయుధ రైతాంగ పోరాట కాలమదిదేశ ముఖ చిత్రాన్ని కర్రు నాగలితోచెక్కినవసంత మేఘ గర్జనలోపల్లెలన్నీ తడిసాయి..ఆ వర్షపు జల్లుఅన్ని పల్లెల్ని కలిపాయి..ఆ ధారగోదావరికి తాకింది.. నాటిగొండ్వాన రాజ్యంనుస్పూర్ సంస్థానంమావో నాటే - మావో రాజ్(రాజ్యం) లోపురుడోసుకున్న కటకం.! ఎన్నిఅంతరాల దొంతరలున్నవ్యవస్థలోఅతనోఒక నల్ల కలువఈ నేల మాగానపునల్ల రేగడిసింగరేణినల్ల బంగారంపు రుపుఈ దేశపు వెలుగుఅతను.. ఆరు పదులు దాటిననాలుగు పదుల ఉద్యమంనాలుగు పాదాల రాజ్యాన్నిదిక్కరించిన సుదర్శనంఅతను. అతనుఎవరని చెప్పాలిఒక విద్యార్థి ఉద్యమమనా..ఒక సికాసా అనా..ఒక రైతాంగ కార్యకర్త అనా..నల్ల ఆదిరెడ్డి, రాజలింగం సోపతాఅతను ఎవరని చెప్పాలి.ఎన్ని అని చెప్పాలి.ఏమని చెప్పాలి అతనోఉద్యమంఅతనోయుద్ధ గీతికఅతనోవిముక్తి బాటఅతనోగెరిల్లా..అతనేకటకం సుదర్శన్అతనేపోరుబాటకు
కవిత్వం

ఈ కవిత్వం అసంపూర్ణవాక్యం కాదు..

అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. -మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు జరుగుతున్నదిదే. మతమనే మారణహోమంలో బలౌతున్నది మాత్రం మనుషులే. మానవ వికాసానికి ఎంతమాత్రమూ ఏ మాత్రమూ ఉపయోగపడని మతంకోసం మనిషి ఎంతటి విధ్వంసానికైనా ఒడిగడతాడు. ఇవాళ ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్దం సామ్రాజ్యవాదమే కానీ, ఈ సామ్రాజ్యవాదం పెంచిపోషిస్తున్న విషనాగుమాత్రం మతమే. అందుకే కవి మిరప మహేష్‌..                 యుద్దమంటే సాధించడం కాదు                 కోల్పోవడం మాత్రమే
కవిత్వం

యుద్ధం మాకు కొత్తేమీ కాదు

ఇప్పుడు జరిగే వైమానిక యుద్ధాలు మాకు కొత్తవి కావచ్చు మా తాతలు,ముత్తాతలు చెప్పిన కథలు, చేసిన యుద్ధాలు మా మస్తిష్కంలో ఇంకా భద్రంగానే ఉన్నాయి మీరు చేసిన అన్యాయాల, అక్రమాల తడి ఆరనేలేదు నివురు కప్పిన నిప్పులా మాకు తెలిసిన యుద్ధాన్ని దాచుకొని మా హక్కుల కోసం అందరి సహజ సంపద కోసం రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయడమే మా నేరం అయితే యుద్ధం మాకు కొత్తేమీ కాదు మీరు న్యాయ వ్యవస్థని కొనుక్కున్నా మా మీద అత్యాచారాలు జరిగినా కోర్టు తీర్పులు మాకు వ్యతిరేకంగా వచ్చినా సహించాం... సహిస్తున్నాం భరించాం.. భరిస్తున్నాం కానీ ఇప్పుడు నీ పాడు
కవిత్వం

కడుపు కోత

ఎక్కడోఒక తల్లి కన్నపేగు తెగింది..తండ్రి ఆశలు ఆవిరి అయ్యాయి..అమ్మ,నాన్న వస్తారుఏదో తెస్తారనిఎదురు చూసే చూపులువాళ్ళు రాలేరన్న వార్త వినిఎక్కి ఎక్కి ఏడ్చాయి. అవికుటుంబం కోసం కూలి పనికిదేశం మొత్తం సంచరించే వలసజీవితాలు..ఇప్పుడు మన నేతలువాటికి లెక్కలు వేస్తారు,బాగానే ఉంది.. అమ్మ కడుపు కోతకు..నాన్న కన్నీళ్లకు..పసి పిల్లల భవిష్యత్తుకు..సమాధానం చెప్పేదేవరు..?ఈ మారణఖండకు కారణం ఎవరు..?వాళ్ళ బాధలో భాగంగా..😰(ఒడిశా రైలు ప్రమాదం పై) 03.06.2023
కవిత్వం

ట్రాన్సజెండర్

చెక్కిళ్ళపైన గులాబీ రంగు అద్దుకొని, మెడ చుట్టూ నెక్లెస్ వేసుకుని షేవ్ చేసిన గడ్డం పై గాఢమైన మేకప్ అద్దుకొని ఆమె తనని తాను అద్దంలో చూసుకుంది ముక్కలైన అద్దంలో తన లక్షల ప్రతిబింబాలను ఒకేసారి ఆమెగా/ అతనుగా చూసుకుంది అద్దంలో ఆ బొమ్మలు ఒకదాన్ని మరొకటి వెక్కిరించుకున్నట్లు గా అనిపించింది మరొకరి దేహంలో తను ఇరుక్కు పోయి వూపిరాడనట్లు అనిపించింది తన దేహపు ఆకృతికి...కోరికలకు పొంతనే లేదు నేను ఎక్కడికి/దేనికి సంబంధించిన దాన్ని ? సరిగ్గా నేను ఎక్కడ ఇమడగలను ? లాంటి ప్రశ్నలు ఎడతెరిపిలేకుండా ఆమెని వేధిస్తాయి **** కొయ్యడానికి కూడా సాధ్యం కాని రంపపు
కవిత్వం

ప్రకృతి-విప్లవం

వ్యక్తులు వెళుతూ వెళుతూవారి జీవితాన్నిచ్చి వెళ్ళారుమేఘం చినుకులు కురిపించినట్టువెన్నెల కాంతిని పంచినట్టునేల చెట్టు వేళ్లని దాచినట్టువాళ్లేం ఊరకేనే వెళ్లలేదునదుల దారులను చూపివెలుగుల్లో చదువులు చెప్పిచెట్ల పత్రహరితాన్ని ఇచ్చిప్రకృతిని సౌందర్యం చేసి వెళ్ళారువారు వెళ్ళిపోవడమంటేమాయమైపోవడం కాదుమనలోకి మనం చేరుకోవడం..
కవిత్వం

నేను రాస్తూనే ఉంటా

గాజాలో మండుతున్న ఆకాశం కింద నేను రాస్తూనే ఉంటా యుద్ధపు కోరలు నా మాతృభూమిని నా కుటుంబాన్ని నా ఇల్లునుగోడకు మెరిసే నా మెడల్స్ ని నా హృదయంలో మెరిసి నా గదిని చేరని ఉజ్వల వైభవాలను నా నుండి లాగేసుకుంటేనేంనేను రాస్తూనే ఉంటా రచన నాకొక వినోదం కాదు అది నా మనుగడ నా రక్తాన్ని పంచుకుపుట్టేప్రతి పద్యం ఒక ధిక్కార గీతం దురాక్రమణకు ఎదురీదే హృదయ స్పందన దయచేసి ఈ పెన్నునూ ఒకప్పటి నా మాతృభూమినీనా నుంచి లాక్కోవద్దు నేన నా పద్యాన్ని ప్రపంచంలోకి విసిరేస్తాను ఒక్క వాక్యమైనా మీ గుండెల్లోకి చొచ్చుకొని నిద్రాణమైన మీ
కవిత్వం

వాళ్ళు..

వాళ్లు నిప్పు రవ్వలు వాళ్లు వెలుగు దివ్వెలు వాళ్ళు నీటి ఊటలు వాళ్ళు స్వచ్ఛ చెలిమలు వాళ్ళుఉప్పొంగిన నదీ ప్రవాహాలువాళ్లు పోటెత్తిన సంద్రపు అలలు వాళ్ళు తీరంతో విరామమెరుగకతలపడుతున్న తుఫాను హోరులు వాళ్ళను గురించి ఏమని చెప్పేది ఎంతని చెప్పేదివాళ్ళు లేని కాలాన్ని.. ఎలా ఊహించేది..వాళ్ళు ఉండనిలోకాన్నీ.. వాళ్ళు లేరన్న స్పృహను.. ఎలా భరించేది.. వాళ్లు రారన్నా వార్తను ఎలా తట్టుకునేది?!! తూరుపు అరుణిమలు వాళ్ళు.. తొలిపొద్దు వేకువలు వాళ్ళు.. ఛిద్రమైన మా బతుకు గాయాలకు.. ఆత్మీయ లేపనాలు వాళ్లు.. బూడిదై పోయిన మా బువ్వా.. ఇళ్ళూ..ఇడుపుల్లో.. ఉబికి వస్తున్న పొగల నడుమ.. గుక్కపట్టి ఏడుస్తున్న మా బిడ్డలను
కవిత్వం

   కలీం క‌విత‌లు రెండు

1. కొత్తకాదుఎన్ని ఆటుపోట్లుఎన్ని సంక్షోభాలుఎంత నిర్బంధంఎంత రక్త దారపోతఆటుపోట్లను అధిగమించిసంక్షోభాలను చిత్తుచేసినిర్బంధాన్ని బడ్డలుకొడుతూత్యాగాలతో ఎరుపెక్కిందినక్సల్బరీలో ముగిసిందన్నారుశ్రీకాకుళంలో మొదలుకాలేదా..శ్రీకాకుళంలోవెనకడుగు వేసిందనుకుంటేసిరిసిల్ల, జగిత్యాలలోజైత్రయాత్ర కాలేదా..జంగ్ సైరనూదలేదా..?నల్లదండులు, నయీమ్ ముఠాలుగ్రీన్ హంట్ లు, సల్వాజుడుంలుఆపరేషన్ ప్రహార్లు,ఆపరేషన్ సమాధాన్ లు,అన్నిటిని ప్రజా యుద్ధంతోనేఎదుర్కోలేదా..జనతన సర్కార్ లను ఏర్పరచలేదా..?లొంగుబాట్లు, కుంగుబాట్లువెన్నుపోట్లు, వెనకడుగులుఇవేవీ కొత్తకాదుప్రతీది ఒక గుణపాఠమేగుణపాఠం నుండే కదావిప్లవ పురోగమనంఖచ్చితంగా పురోగమిస్తాంపురోగమిస్తూ విస్తరిస్తాం. 2. అడవివెన్నుపోటుతో అడవికుంగిపోతుందిదోసుకునే దోపిడిగాళ్లకుదారి చూపుతున్న ద్రోహులను చూసి దుఃఖిస్తుంది.తన ఒడిలోని బిడ్డలనుఒక్కొక్కరిని కూల్చుతుంటేతల్లికోడిలా తల్లడిల్లుతుంది.తేదీలను బెట్టితుడిచేస్తామంటూకుట్రదారులు, పెట్టుబడిదారులుఒక్కటై వస్తూ ఉంటేతన బిడ్డల త్యాగాలతోతడిసిన అడవిసగర్వంతో ఎర్రబడిపోరుకు సై అంటున్నదివాడు చిగురించేఆకులను తుంచేస్తేనేను మళ్ళీగర్జించే గన్నులనుకంటానంటున్నది.
కవిత్వం

విప్లవం పురుడోసుకోక మానదు

పచ్చని అడవి వీరుల నెత్తుటితో తడిసిపోయి రక్తపు మడుగుగా మారొచ్చుఅమాయకపు ఆదివాసీలు ఏదో తెలియని కేసులో బంధించబడొచ్చు మిగిలినవాళ్ళు బానిసలుగా వాళ్ళ నేలని వారే తవ్వుతూ కార్పొరేట్ల కింద నలిగిపోవొచ్చు…..ఎప్పుడూ పేదల గుడిసెల వైపు అడుగు వేయని పాలకులు వారి నేలపై ఫాం హౌస్ కట్టుకుని జల్సాలు చేయొచ్చు ఇంతకంటే ఇంకా ఘోరమైనవి ఎన్నో జరగొచ్చు కానీఏరోజు అయితే …..ఏరోజు అయితే……అడవి లో చివరి మావోయిస్టు ను చంపుతారో నగరంలో మొదటి మావోయిస్టు పుడతాడు నిశీధి చీకటిలో మిణుగురు పురుగుల వెలుగులావిప్లవం పురుడోసుకోక మానదు.