కవిత్వం

ఆట పాటల రూపు

ఆట వైతివా అన్న పాట వైతివా జనహోరు గుండెల్లో రాగమైతివా ధన ధన మోగెడప్పు దరువువైతివా...."2" ఎగిసేటి ఉద్యమాల గురువువైతివా...2" పొడిసేటి పొద్దుల్లో వెలుగుగైతివా "ఆట వైతివా" వెలివాడ బతుకుల్లో ఎట్టి చూసినవ్ ఏతలన్ని పోయే పోరు బాట వట్టినవ్ ప్రశ్నించే పాటవై మేలు కొల్పినావు .."2"... పాలకుల గుండెల్లో దండోరావైనవ్ " ఆట వైతివా" నల్లమల అడవులన్ని కలియతిరిగినవ్ నమ్ముకున్న పేదప్రజల గోసచూసినవ్ సమ సమాజ స్థాపన ధ్యేయమన్నవు..."2" అమరులే..ఆదర్శ మూర్తులన్నావు "ఆట వైతినా" పసిపాప నవ్వంత స్వచ్ఛమైంది స్వార్థమే లేనట్టి ప్రయాణం నీది సామ్రాజ్యవాదం పై పోరాటం నీది...."2" దాన్ని కొనసాగించే నినాదం మాది.
కవిత్వం

కొత్తాట నేర్చుకుందాం

ఆకురాలు కాలం,అడవిలో రాలుతున్న ఆకుల సవ్వడిఆ సవ్వడికిసుడిగాలి తోడవుతూఆ సుళ్ల చక్రబంధంలో రాలిన ఆకులుసుళ్లు తిరుగుతూ దుమ్ము లేపుతూగలగల పైకెగురుతున్న శబ్దాల మోత ఆ మోత మరే శబ్దాలను విననివ్వడమే లేదురాలిన ఆకులతో బోసిపోయిన అడవివన్నెలుడిగి, గ్రీష్మ తాపానికి తహతహలాడుతోంది.ఆరు రుతువులలో అడవిఆరు రకాలుగా ముస్తాబవుతోందికానీ, గ్రీష్మమే దాని వన్నెలన్నీ దోచుకుంటుందిచిందులన్నీ చెరిపివేస్తుంది.నిన్నటి వరకు పచ్చదనాన్ని కప్పుకున్న మానులన్నీఆకుల సోయగాలు మటుమాయమైనట్టే,బోసిపోయిన అడవి పల్చబడిందా అనే సందేహం....లేదుకదూ!పచ్చని ఆకులు పండుటాకులై రాలడం సహజంరాలిన ఆకులు ఎండటం,ఎండిన ఆకులు ఎలుగడితో కాలడం అడవిలో అంతకన్నా సహజంఆకులు రాలిన చెట్లు వసంతంలోచిగురిస్తాయి, అడవి వన్నెలన్నీ మళ్లీ మొదలవుతాయిచిగురించిన ఆకులు, మొగ్గ తొడుగుతాయి,మొగ్గలు,
కవిత్వం

కోయ కవితలు రెండు

విప్లవం ఒక చిన్నారిని కవిగా మలిచింది . విప్లవకారుడిగా తీర్చి దిద్దింది . ఈ కవి సల్వాజుడుం రోజుల్లో తల్లి వేలు పట్టుకొని వచ్చి బీ.ఆర్.ను తొలిసారి చూశాడు , తరువాత ఉద్యమంలో చేరాడు. కంప్యూటర్ గురూజీగా పేరు పొందిన సుప్రసిద్ధ రచయిత్రి, అమర యోధ రేణుక అలియాస్ మిడ్కో వద్ద కంప్యూటర్ శిక్షణ పొందాడు. 1 . మా ప్రాణం బీ.ఆర్నా కళ్ల నుండి నెత్తుటి ధారలునేల రాలుతుంటే,నీ త్యాగం, నీతో, నే గడిపిన క్షణాలనుపదే పదే గుర్తు చేస్తున్నాయినీతో గడిపిన ప్రతి క్షణంనాలో నీ త్యాగాన్ని ఎత్తిపడుతోందినీ అమర స్మృతులనువిశ్వ పీడిత ప్రజ సదా స్మరిస్తారురణభూమిలో
కవిత్వం

ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు..

లోకంలో అంతా బానే ఉంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి టీ తాగినప్పుడు కాలం ఊపిరి బిగబెడుతుంది అనాస పువ్వు మెరుస్తుంది అల్లం ఆవిరైపోతుంది నిమ్మగడ్డి తిరగబడుతుంది దాల్చన చెక్క చేయవలసినదానికన్నా తక్కువ పాపం చేస్తుంది బోధి ధర్మ మేల్కొంటాడు ఇద్దరు స్త్రీలు కలిసి చాయ్ తాగినప్పుడు వాయువీణలు కంపిస్తాయి, డోళ్ళు దొర్లిపోతాయి,మనసు హృదయాన్ని కలుస్తుంది, భాగం సంపూర్ణమవుతుంది,ఇద్దరు మహిళలు కలిసి టీ తాగినప్పుడుమందుల దుకాణం వారు నవ్వుతారు, మద్యం సర్వ్ చేసేవారు రాగం తీస్తారు పీఠాధిపతులు ధర్మశాస్త్రాలు ఉటంకిస్తారు నీలగిరి డార్జిలింగ్ను కలుస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చాయ్ తాగినప్పుడు పచ్చని నురుగు, రత్నపు మంచు,పురాతన కడాయి, స్నేహ
కవిత్వం

భూమిని మాటాడనివ్వు…

మనమింకా‌ బతికే వున్నామా? ఇదేదో‌ భేతాళుని‌ భుజాన‌ వేలాడే రాజు ప్రశ్న కాదు వాదనలు‌ ముగిసిన‌ వేళ వాడొక్క మాటతో‌ ఫుల్ స్టాప్ పెట్టేసే వేళ అటూ ఇటూగా సరిపెట్టుకుంటే నువ్వూ నేనూ కోల్పోయేదేమీ లేదు వాడి తుపాకీ‌ మొన ముందు వారి మానం ఛిద్రమైన వేళ కోర్టుల ముందు నగ్నంగా నిలబడిన తల్లులను వంచించిన నీ న్యాయం నీకు నైతిక విజయమా? కోల్పోయిన మానానికి కళ్ళు లేని‌ న్యాయం ధర కడుతుందా? తాను రుజువు చేయలేని ఆ పదముగ్గురినీ వాకపల్లిలో నిలబెడితే న్యాయమేదో బిగ్గరగా వినబడేది కదా? పదారేళ్ళ నీ విచారణకు తమ కొంగు చివర కట్టుకున్న
కవిత్వం

కిటికీ

జైలు గదుల ఉక్కపోతల నుండి ఉపశమనం కోసం అతడు కిటికీ తెరిచాడు ఎదురుగా సముద్రం... బయటి సముద్రం లోపటి సముద్రం అలయ్ బలాయ్ తీసుకున్న చోట ఆకాశం నక్షత్ర కాంతుల వెదజల్లింది సహనానికి మారు పేరైన భూమి తన విముక్తి కోసం సంకెళ్లకు చేతులిచ్చి సహనంగా ఎదురుచూసే రేపటిలోకిచూపులు సారించే మానవ మహా సంకల్పానికి జే జే లు పలికింది
కవిత్వం

పల్లె పిలుస్తోంది…!

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి లేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూ ముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానే చిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కా ఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలు పిల్లలు పల్లె కు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలో జీడి చెట్ల కొమ్మల్లో అడుగులు వడివడిగా మురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకుని మంచు బిందువుల్ని పూసుకుని ఎగిరే పక్షుల వెంట ఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని నా పల్లె లో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్ని వెలిగించుకుని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 కమ్మటి దాల్చా తెలంగాణమా! నా ప్రాణమా!! ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి నడిచి వెళ్ళే ఇంటింటికి ఇనుప గోడలల్లుతున్న సాలీలు తిరుగుతున్నాయి గడపలకు విద్వేష బొట్లు పెడుతున్నాయి దుఃఖం మీద దునుకు లాడుతూ దూర దూరాలు పంపిణీ చేస్తున్నాయి వాటి అడుగుల్లో మంటలు లేస్తుంటాయి వాటి మాటల్లో మృత్యు వాసనొస్తుంది నా ప్రియతమా! మూసి ప్రవహిస్తున్న గుండెల్లో మానవతా పరిమళాల మాగానివి గోదావరై ప్రేమలు ప్రవహించే దానా! మనసులు కలిసిన చేతుల మీంచి ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి పంట కావలి మంచై చార్మినార్ కమ్మటి దాల్చా జుర్రుకునే మతాతీత మనసులు అలాయి బలాయి ఆత్మీయతలు
కవిత్వం

సర్రియల్‌ క్లౌడ్‌ బర్స్‌ట్స్‌  వర్సెస్‌ వసంతమేఘం

ఇట్లా వాణిజ్య రాజధాని మీదికి జనం ఎప్పుడొస్తారు వానవలెవలస కూలీలుగా కాదుకోలీలు1గా కార్మికులుగాకోస్టల్ కారిడార్ కోసం నిర్వాసితులై కాదుఈ సముద్రమూ సముద్రంలోని సరుకులూ మావే అని స్వాధీనం చేసుకోవడానికికార్పొరేట్ కాలుష్య మబ్బులు అనిక్లౌడ్ బర్స్ట్స్ కాదని హెచ్చరిస్తూమీ అక్రమ నిర్మాణాల వలన మావాళ్లే చావడానికి కాదు చెట్లు కూలిపోవడానికీ కాదుఆదివాసులను చంపివాళ్లు కళ్లల్లో పెట్టుకున్న మనుషుల్ని చంపిఅడవితల్లి గర్భం నుంచి పుట్టుకొచ్చి ఇంకా పేగుబంధం తెగనిలక్షలాది చెట్లను నరికే గఢ్ చోరీలుఉక్కుచెట్లను నాటితే అడవెక్కడికి పోవాలి మరినదులై మహానగర రోడ్లనే ముంచెత్తుతున్నది.పల్లెల్లోని రైతాంగమంతా ఢల్లీలో ఒక బహదూర్షాను పెట్టుకొని కంపెనీ మీద యుద్ధానికి తమ బిడ్డల్ని పంపింది మోషా(సా)ల
కవిత్వం

రణం దిక్కైనోళ్ళు!!

తలమీది నీడను త్యాగం చేసుడు తమవల్ల కాదని తెల చెప్పినోళ్ళు కాళ్ళ కింది నేల కడుపాకలి తీర్చే వొనరది మాకు వొదలమన్నోళ్ళు రిజర్వాయరు రక్కసి కోరని ఎరుగక జిక్కి అల్లాడెటోళ్ళు యాడాది పైనాయె ఎద బాదుకుంటు మొరల్ బెట్టి బెట్టి మోసపొయ్నోళ్ళు దొంగలోలె పట్టి టేషన్లకు దెచ్చి బైండోర్లు జేసెనే దొరోల్ల రాజ్యం ఇంత కెవరీళ్ళో సెప్పనైతి నేను ఎత్తిపోతల కత్తి ఎదలోకి దిగిన సిన్నోని పల్లెంట బతుకగ్గి పాలై బజారు పడిన పల్లె రైతులీళ్ళు ఎట్లైతె అట్లాయె ఇట్లైతె కాదంటు లీడర్ల రంగెరిగి రణం దిక్కైన్నోళ్ళు.