కవిత్వం

సంపూర్ణం…! 

దాహాలు అసంపూర్ణంగానే ఆరంభమౌతాయి. ఆలోచనల సంఘర్షణలోంచి ఒక దారి తళుక్కున మెరుస్తుంది. ఒక లక్ష్యం నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది. జీవితం ఒక్కో పాదముద్రను చెక్కుతూ నిరాడంబరంగా విజయానికో చిరునవ్వు విసురుకుంటూ ముందుకు పోతుంది. ప్రతి క్షణమూ తిరిగిరానిదే. ఇక్కడ ఛేదించాల్సినవి చేయాల్సినవి కొన్ని వుంటాయి. అలా అలా సంతోషాల్ని లిఖిస్తూ కాస్త ముందుకు జరగాలి. అసంపూర్ణం నుంచి సంపూర్ణానికి ఒక్కో అడుగు తొడుగుతూ ఒక్కో మైలురాయి లో చిహ్నాల్ని కొన్ని తీపి గురుతులు గా నిలిపి సంపూర్ణ ప్రయాణం గా ప్రయత్నాల్ని మలచుకోవడం లోనే వుంది. జీవితపు గెలుపు రహస్యం.
కవిత్వం

చలనం

స్వప్నం సాకారమవుతుందనిసంబరపడుతున్న వేళ...కల చెదిరి, నిజం బొట్లు బొట్లుగా కారిపోతూవుంది.వేదన కన్నీరు మున్నీరుగా ఉబికివస్తూ వుంది.ఇప్పుడిప్పుడే..మొలకెత్తి,ఎదుగుతున్న విశ్వాసం..ఊపిరి సలుపక..ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంది.ఉత్సాహ జవనాశ్వాలతో పరిగెడుతున్న వేళ..కాళ్ళు నరికివేయబడ్డఖండిత దేహం రోదిస్తూ వుంది.ఈ నేల బిడ్డలుపోరాడి, సాధించుకున్నపిడికెడు మట్టి, దోసెడు నీళ్లు, చారెడు నేల....కాసింత స్వేచ్ఛలనుకసాయి కర్కశత్వం...ఆసాంతం కబళిస్తూ వుంటే...ఏ జయ గీతాలను ఆలపించగలను ?బొడ్డు పేగు కూడా తెగని,పసికందుల కుత్తుకలను కోసే కంసులకు ఇక్కడ కొదువ లేదు.పాలుగారే పసిబుగ్గలకు..ముదిమి దేహాలకు...తేడా లేదిక్కడ !అన్నీ చిద్రం కావలసిందే !బ్రతుకే భారమైన చోట...త్యాగాలకు లెక్కలేదు..విలువ లేదు !ఇక్కడ యుద్ధం చేస్తున్న కపోతాలను...శాంతి పేరిట కసాయి డేగలు మట్టు బెడుతూ ఉన్నాయి.ఇక్కడ
కవిత్వం

అంధకారం

పులి లేడి ని చంపితే ప్రకృతి ధర్మం ఆహార వేట పెద్ద చేప చిన్న చేపనూ! చెట్టు కొమ్మ పండు బరువుకి వాలితే ప్రకృతే! కొమ్మ ను నరికేది నరుడే!! మనిషి మనిషి ని వేటాడితే వికృతి మనిషి ని రాజ్యం చంపదల్చుకుంటే ఎన్ కౌంటర్ హత్య లు కాపు కాసి చేసే రోజులు కావివి జన సమ్మర్దంలో బాహాటంగా ప్రత్యక్ష ప్రసార వినోద క్రీడలు ఇప్పుడు! అధికారం కోసం అహం రాజ్యం లో భాగం కులం మతం వనరు ద్రవ్యం కొలమానం లో దారిద్ర్య రేఖ ఊగిసలాట లో అటూ ఇటూ మనిషి వర్గాల కొమ్ము లేని
కవిత్వం

తిరోగమనం వైపు

నాడు పేలిన తుపాకీ నేడు విసిరేయబడ్డ చెప్పు వెనుక సనాతన మౌఢ్యం తుపాకీ వెనుక ఉన్మాదం లో మతం చెప్పు వెనుక కులం అదే వ్యక్తి అదే కుర్చీ లో ఆధిపత్య కుల వ్యక్తి వుంటే విసరగలడా?!సాంఘిక అసమానతలను పెంచి పోషించే సనాతనం అక్షరం అత్యున్నత స్థాయికి చేర్చినా సహించదు విసిరింది వ్యక్తి విస్ఫోటనం సంఘంలో ఖజురహో కాలానికి ఇప్పుడు తీర్పు కోరే మతిభ్రమణం విగ్రహాల వెనుక తవ్వే కొద్దీ సత్యాలు బయటపడుతున్నాయి అయినా తీర్పులు సంఖ్యా బలం వైపే మొగ్గు తుపాకీ వ్యక్తి నిర్మూలన వైపు చెప్పు సంఘ లోపాల పై విహారం ఏది ధర్మం?! ఏది
కవిత్వం

డియర్ మోదీ..

డియర్ మోదీ..నీదీ నాదీ సిద్ధాంత చర్చ అయ్యుంటే గౌరవప్రదంగా జరిపే వాడ్ని నీతోను.. నీ అనుచరులతోనూనీ బత్తాయి రౌడీలతోనూ మాగొప్పగా మాట్లాడేవాడ్ని కానీ నీది అబద్దాల రొష్టు నాది నిజాల కొలిమి నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడే ప్రతీ అబద్ధం నీ గూండాలు ఎలా మోస్తున్నారు?చరిత్ర..నీకు నచ్చినట్టు రాసుకునేది కాదు చరిత్ర..నీ సిద్ధాంతాలకి తగ్గట్టు చెరిపేసేది కాదు డబ్బై ఏళ్ళకి మెదడు మొద్దబారుతుంది కానీ అబద్ధాలను తయారీ చేస్తుందా? ప్రభుత్వ యంత్రాంగాన్ని నేడు అబద్ధాల తయారీ కేంద్రంగా మార్చావ్ దేశ ప్రధాని హోదాని గాలికి ఒదిలేసి నచ్చినట్ట వాగుతున్నావ్ నీకూ నీ నోటికి తాళం వేయాలంటే నిన్ను గద్దె నుంచి
కవిత్వం

దేశానికి ఏం కావాలి

ఈ దేశానికో కండ్లు కావాలిరాజ్యం చేస్తున్న కుట్రలను ధిక్కరించడానికి న్యాయాన్ని బహిరంగంగా బజారులో అమ్మేసుకుంటున్నందుకు దేశానికో కండ్లు కావాలిఈ రాజ్యానికి బలమైన గొంతుక కావాలి గొంతెత్తి గర్జించే గళాలేన్నో మూగబోయినందుకు ఫాసిస్టు పాలకుల పాలనలో బందీలుగా నలిగిపోతున్నందుకు రాజ్యానికి బలమైన గొంతుక కావాలి ఈ దేశానికి పిడికిలి కావాలి అన్యాయపు అంగట్లో ఆదివాసి కాళ్ళ కింద నేలను తాకట్టు పెడుతున్నందుకు కార్పొరేట్లపై పిడికిలెత్తి నినదించేందుకుదేశానికో పిడికిలి కావాలి ఈ దేశానికో రంగు కావాలి కాషాయపు కాగితాల కింద నలిగిపోతున్న జెండాను కాపాడేందుకు గాయపడిన పావురపు రంగు కావాలి దోపిడి దొంగలను తరమడానికి పిడికిలెత్తి నినదిస్తూ గొంతు ఎత్తి గర్జిస్తూఈ
కవిత్వం

ఎప్పుడైనా నేను గుర్తొస్తే!

ఎప్పుడైనా నేను గుర్తొస్తే కన్నీళ్లు పెట్టుకోకండి "కాలం చీకటి గర్భంలో నన్ను కంటుంది" అన్న నా కవితలను ఒక్కసారి చదువుకోండి అక్షర రూపంలో నేనెప్పుడూ మీతో బతికే ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే మీ చుట్టూ ఉన్న జీవితాలు అదే చరిత్రను దాచిన పుస్తకాలు చదవండి మహిళల కోసం, ఆదివాసి హక్కుల కోసం ప్రజా పోరాటాలను చేయండి ఆ పోరాటంలో నేను మీకు తోడుగా ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే నా బట్టల కింద ఉన్న డైరీలో మీ కోసం రాసిన కవితలను మరోసారి మీ గుండెలకు హత్తుకోండి కాసేపు భారమైన బాధలను మర్చిపోతారు ఎప్పుడైనా నేను గుర్తొస్తే
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1మళ్లీ ఊపిరి పోసుకుంటాయినా బిడ్డ తిరిగి వస్తాడా ముక్కుపచ్చలారని నా బిడ్డను నేను తొమ్మిది నెలలు మోసినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా పుట్టిన నా బిడ్డ మళ్లీ తిరిగి వస్తాడా. మొన్ననే మొదటిసారి అమ్మ అని పిలుస్తుంటే ఎంత సంతోష పడిపోయామో మళ్ళీ ఆ పిలుపు నాకు వినిపిస్తుందా నన్ను అమ్మ అని మళ్ళీ పిలుస్తాడా .నల్లని రూపున నా బిడ్డకు తెల్లని పాల బువ్వ తినిపించి జో కొడితే హాయిగా నిద్రపోయే నా బిడ్డ మళ్లీ తిరిగి లేస్తాడా మిగిలిన పాల బువ్వ తిని హాయిగా నిద్ర పోతాడా .మాటరాని నా బిడ్డను మావోయిస్టు అంటూ
కవిత్వం

వరి గొలుసులకు యమపాశాలు

సన్నని ముసురు కిందనాట్లు వేస్తున్న దృశ్యం చూసి ఫూలే గుండెమరోసారి మండే ఎడారి అవుతుంది చేతిలో పాత కాగితాల కట్టపట్టుకుని డ్యాము ఒడ్డున నిలబడితల్లిని పోగొట్టుకున్న బిడ్డలాపొలాలని పోగొట్టుకున్న 'శాలో'తల్లి డ్యాముకేసి నిర్వేదంగా చూస్తుంటది అవతల నగరం డ్యాము పుణ్యమా ..అని ధగధగా మెరిసిపోతుంటది జిలిబిలి నగవుల మురిసిపోతుంటది నగరం అభివృద్ధి కింద వ్యాపించిన పెంజీకట్లుమట్టి దీపాల్ని కలవర పెడుతుంటాయి ఇవాళ సోమాకు పస్తులే మిగిలాయి ఆయన పొలాలన్నింటినీరిజర్వాయర్ మింగేసింది పాలిపోయిన చర్మం లోంచిపొడుచుకొచ్చిన ఎముకల గూడుపిడచగట్టిన పేగులు లో లోపలికి ముడుచుకుపోతాయి ఉబికి వచ్చే కన్నీళ్లను అదిమిపెట్టిన డ్యాము విస్పోటిస్తున్న క్రోధాలనుఅదిమిపెట్టిన డ్యాముకూలిపోతాయి పర్వతాగ్రాన తిరుగుబాటు రగిలినప్పుడు
కవిత్వం

లెక్కింపు

జవాబుపత్రకట్ట స్పర్శించగానే కొన్నిమూలుగులు వినిపించాయి అణిచిపెట్టిన రబ్బరుబ్యాండు తొలగించగానే కొన్ని ఏడ్పులు వినిపించాయి పత్రాల లెక్కిస్తుంటే కొన్ని ఎక్కిళ్ళు వినిపించాయి పత్రాల మూల్యాంకిస్తుంటే ఒక రైలుశబ్ధం పెనవేసుకున్న లేలేత మృత్యుకేక బ్రద్ధలైంది పత్రాల్లమార్కులు వేసేకొద్ది ఉరితాళ్ళవరుస పేనుతున్న ధ్వని పత్రాలపేజీలు తిప్పుతుంటే పురుగుమందులవాసనంటుకున్నగాలి పూర్తైనమూల్యాంకన పత్రాలు కింద పెడుతుంటే ఎవరో మునుగుతున్న నీటిశబ్ధం ఇంత హింసను ముల్లెకట్టుకుంటూ ప్రశ్నపత్రాలు దిద్దడమంటే భవిష్యత్తును దిద్దడమే వాళ్ళు ఆడుకున్న అక్షరాలు వాళ్ళు పాడుకున్న అక్షరాలు వాళ్ళ మీద అలిగిన అక్షరాలు వాళ్ళే మూతిముడ్చుకున్న అక్షరాలు ఏడాదంతా మోసిన అక్షరాల్ని తెల్లకాగితమంతా పండిస్తారు ఆ పంట చుట్టూ ఆశల్ని కాపలా పెడుతారు అనేక