కవిత్వం

సరోజ్‌దత్తా కవితలు

1969 ఏప్రిల్‌ 22న లెనిన్‌ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్‌ కు సరోజ్‌దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్‌రే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్‌ చేసి కలకత్తా, షహీద్‌మినార్‌ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం... 1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు
కవిత్వం

మహమూద్ కవితలు

1 వేడుకోలు చీకటి పాత్ర లో నిండుగా ఉన్నది వెన్నెల మధువు మత్తుని ఆహ్వానించడానికి సిధ్ధంగా ఉంది ప్రేమ నిండిన హృదయం ఏక్కడో దూరం నుంచి ఓ తల్లి గాత్రం బిడ్డకి పాలు పడతూ ఆదమరచడానికి భూమికింత చల్లగాలిని జోలపాటగా అందిస్తోంది ఏ బతుకు యుధ్ధంతో ఘర్షణ పడుతున్నారో మనుషుల జాడ లేదు మధువు తాగేటప్పుడు తోడు కోరుతుంది కదా మనసు ఒంటరితనం ఒక ఉన్మత్త దుఃఖం దుఃఖం ఓ ఒంటరి యుధ్ధం దేహానికీ, హృదయానికీ గాయం కానివాడెవడూ మధువుని కోరుకోడు తోడునీ కోరుకోడు తెగిన బంధాలని జతచేయడానికి గాయాలు మానడానికి అనువైన కాలం ఇది జహాపనా! కొందరు
కవిత్వం

పోదాం పద ఢిల్లీలో కవాతు చేద్దాం

కవితలల్లుదాం ఢిల్లీలో రైతుల పోరు నినాదాలను కథలు చెపుదాం రైతుల నెత్తురే ధారలై పారుతున్న ఢిల్లీ సరిహద్దుల దారుల కోసం! పిడికిళ్లు ఎత్తుదాం దగాపడ్డ బతుకుల పోరుదారిలో ! ఈ అక్షరాలను అస్వాదించండి ఆరాధించడం వద్దు మాట్లాడుదాం రైతుల పోరు ముచ్చట్లను! ఈ పదాలకు పెదవి విరుపులు అలంకారమే ! పెదాల బిగువున దాగిన మౌనాన్ని వీడి అక్షరాల అలుగు దునికిద్దాం ! మాట్లాడుదాం రైతుల పోరు గాథలను ఢిల్లీ సరిహద్దులు రక్తసిక్త మౌతుంటే, అక్షరాలా అగ్నిదీపాలను సృష్టిస్తాం! మనం తినే పళ్లెంలో అన్నంకు బదులు, రైతన్నల రక్తపుచుక్కలు మెరుస్తున్నయ్ ! ఆ వేళ యాడాదినర్థం పోరు పొద్దులై
కవిత్వం

నాదొక చివరి కోరిక

నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా మొఖాన్ని తడుముకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా కన్నీళ్లను తుడుచుకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు ఆకలంటూ నా పొట్టను పట్టుకున్నాను బాంబుల శబ్దానికి ఉలిక్కిపడి నా తల్లిని కౌగిలించుకునేవాడిని నా తల్లి పొట్టమీద ఒక చేయి వేసి హాయిగా నిదురపోయేవాడిని నీళ్ళల్లో పడ్డ చందమామను నా అరచేతులతో తీసి కాపాడేవాడిని బాంబులతో నా తల్లిరొమ్మును పేల్చినట్టు చందమామనూ బాంబులతో నీళ్లలో పడవేసి ఉంటారో కాబోలు ఉదయాన్నే నా అరచేతుల మీద సూర్యకాంతి పడుతుంటే ఎంత్అందంగా ఉండేవో చేతులను చూసి మురిసిపోయేవాడిని నా మురిపాన్ని చూసి చేతులు కూడా సన్నగా
కవిత్వం

షహీద్ మంగ్లీ కోసం

గజ్జెలు లేకుండా కూడ నీ పాదాలు ఎంత భంగిమలో ఉన్నాయి ఈ పాదాల్లో కొంచెం కొంచెం దుమ్ము పట్టి ఉన్నది ధూళి అనగానే గుర్తుకొచ్చింది నువ్వు నీ ‘యోయో’ (అమ్మమ్మ) ఒళ్లోకి వట్టికాళ్లతోనే గోముతో పరుగెత్తాలనుకోవడం కూడ ప్రేమనే మట్టితో సూటిగా మాట్లాడుతూ నీ కాళ్లు పాదాలు రేలా స్వరంలోకి తర్వాత ఎగుస్తాయి మొదట నీ పాదాలను ఈ మట్టి రమ్మని పిలుస్తుంది నువ్వూ నీ పాదాలు రెండూ ఎంత శాంతంగా ఎంత ప్రకాశిస్తూ, ఎంత నిష్కళంకంగా కనిపిస్తున్నారు నీ గోళ్లు చాల విచారంగా కనిపిస్తున్నాయి నీ అమ్మ దగ్గర నెయిల్కట్టర్ లేదు నువ్వీ పాదాలతో కొంచెం దూరం
కవిత్వం

రైతు దృశ్యమే నాకు కనబడుతుంది

వాడు దేశాన్ని ఒక మూసలో నెట్టుతుంటే కావడి పట్టుకొని అన్నదాత ఆందోళన చేస్తున్నాడు మద్దత్తు ధర కోసమో, పంటల రక్షణ కోసం మాత్రమే కాదు ఫాసిజం ఎంత వెర్రి తలలు వేసిందో దేశ రాజధాని నలుదిక్కుల చుట్టూ ముట్టిన రైతు చాటి చెపుతున్నాడు వాడు అయ్యోధ్యా రామమందిరం అంటూ దేశ ప్రజల మేదల్లో మూడవిశ్వాసాన్ని నింపి దేశాన్ని మతం పేర ముక్కలు చెయ్య చూస్తున్న చోట దేశమే తమ ఇల్లు అంటూ అన్నదాతల ఆందోళన చూడమంటాను వాడు ప్రశ్నను ఎదుర్కోనలేక ధర్నాలను, రాస్తారోకాలను అడ్డుకొనడానికి అక్రమంగా కుట్ర కేసులు,NIA దాడులను ఉసిగొల్పుతున్న కాడా నిటారుగా నిలబడి నాగలి కర్రును
కవిత్వం

నా క్యాలెండర్

ఇంట్లో క్యాలెండర్ లేదు పొడిచే పొద్దు నడి నెత్తిన పొద్దు కుంగిన పొద్దు ఇదే నా లెక్క ఇదే నా రోజు కూసే కోడి నా అలారం మొరిగే కుక్క నా అప్రమత్తత కి ఆధారం నిప్పు ఇచ్చే పొరుగు లేదు సూరీడు తొలి కిరణం గుడిసె తాటాకు లోనుండి నా ముఖం పై నా మేలు కొలుపు భుజాన కాడి ముందు నడిచే ఎద్దులు నేల దున్న నడక కాళ్లకు చెప్పులు లేవు పల్లేర్లు పక్కకి నా పై దయతో సాగే అరక నేల నాది తరాలుగా అడవి నాది దుంప నాది పండు నాది తేనె
కవిత్వం

ఉత్తేజమై  వికసించు

నువ్వు అలవోకగా నడుస్తున్నప్పుడో బండి నడుపుతున్నప్పుడో నీ వెనకాలో నీ పక్కనుండో ఒక బుల్డోజర్ వచ్చి గుద్దితే నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు నువ్వు కుర్చీ వేసుకొని ప్రశాంతంగా చదువుతున్నప్పుడో పరధ్యానంగా పడుకున్నప్పుడో నీపై ఎం ఐ ఏ దాడులు జరిగితే నీవు బెదిరిపోనక్కర్లేదు వాడు నిన్ను జైలుకు ఇడ్చికెళ్ళినప్పుడో నాలుగు గోడల మధ్య నిన్ను బందీ చేసినప్పుడో ఉచ్ఛ్వాస నిశ్వాసలకి తావివ్వనప్పుడో నీవు అలసిపొనక్కర్లేదు కొన్ని పుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం తిసేసినప్పుడో మత గ్రంథాలను ప్రబోధించినప్పుడో రాయిని సైతం దేవుణ్ణి చేసి నిన్ను మైలపరిచినప్పుడో నువ్వు కృంగిపోనక్కర్లేదు సలసలా కాగే నెత్తురు నీ గుండెల్లో ఇంకా పచ్చిగానే పారుతుంది నిజాల
కవిత్వం

నాలుగు పిట్టలు

వస్తూ వస్తూ నీ ఇంటి బయట ఓ చెట్టు నాటి వచ్చాను నాది కాకపోయినా ఏదో ఒక నీడ నీకుండాలని * పని నీ కోసమే చేస్తున్న వాడిని పనిలోపడి నన్ను మరిచిపోకు అంటావు ** బతుకు తరిమితే వలస వచ్చాను ప్రేమ పిలిస్తే తిరిగి వెళ్ళిపోతాను * చెమట చుక్క నుదుటి నుండి టప్పున జారిపడినప్పుడంతా నీ గుండె ముక్కలైందేమో అని భయపడతాను * ఎలా నిజం అవుతాయి స్వప్నాలు దిండు కింద పడి నలిగిపోతుంటే * పర్లేదు ఖాళిగానే ముగిసిపోని రాత్రుళ్ళు నీ ఇంటిపని తగ్గిపోయే వరకూ * అందం గురించి దిగులుపడకు నీ లావణ్యం
కవిత్వం

రఫాత్ అలరీర్ కోసం

మనమంతా మరణించాల్సిందే నేనంగీకరిస్తాను కానీ ఎవ్వరూ ఒక భవనం నుంచి మరొక భవనానికి, శిథిలం కావడానికో, మాంసధూళి కావడానికో పరుగెత్తరాదు ఏ తల్లీ తన పిల్లలకు వీడ్కోలు గాలిలో రాసే పరిస్థితి రాకూడదు మృత్యువు కాసేపు నుదిటి పై నిలిచి పోవాలి ఆకులపై దట్టమైన మంచువలె అప్పుడు మనం దుఃఖించాలి కరుగుతున్న మంచుబిందువులు నేలపై రాలుతున్నట్లుగా అర్థాంతరంగా, ఆకస్మికంగా, అమానవీయంగా మృత్యువు ఇంతటి కూృరమైన శత్రువు కాకూడదు నేను నీ కోసం ఒక పతంగి తయారు చేస్తాను ఆ రోజు మనల్ని మనం విముక్తం చేసుకుంటాం ఆ రోజు మనం స్వాతంత్య్రయాన్ని పొందుతాం అయితే నేను పతంగిని కఫన్