కవిత్వం

సైన్సు విజయం

ఎన్ని వేల ప్రయోగాలుఈ నేల మట్టి నుంచి విరబూస్తేమనమీరోజు హరితగీతాలమై ప్రవహిస్తున్నాంతెల్లని బువ్వ పాటలు పాడుకుంటున్నాంఎన్ని లక్షల శరీరాలకువానచినుకులు తూట్లు పొడిస్తేఎండ నిప్పుల కొర్రాయితో మలాము పూస్తేతలమీద ఇంత నీడను కప్పుకున్నాంఎంతమంది మన తాతలుప్రయోగాల ప్రమాదాల మధ్య గ్రీజుగా నుజ్జు నుజ్జయితేమన ఇంట్లోని వస్తువులనుంచిహాయిగా సుఖాన్ని పిండుకుంటున్నాంఎంతమంది శాస్త్రవేత్తలునెత్తురును చెమట చుక్కలుగా ధారబోస్తేభోగోళాన్ని బంతిలా చేసుకొని పిట్టల్లా వాలిమూలమూలల్లోనూ గూళ్ళు కట్టగలుగుతున్నాంఎన్ని మెదళ్లనుసైన్సు ఆకురాయి మీద సానపడితేచంద్రుని మీద మన జెండా నాటగల్గుతున్నాంమంత్రాలకు చింతకాయలు రాలలేదువిజ్ఞాన శాస్త్రం మెట్లు లేకుండాచంద్రుని చల్లని కౌగిలింతలు దక్కలేదుభూమి మీదనయినాచంద్రుని మీదనయినామనిషి విజయమెప్పుడుసైన్సు విజయమే!-తోకల రాజేశం
కవిత్వం

చంద్రహాస రెండు కవితలు

1. సాంస్కృతిక దిగ్భ్రాంతి!నీ తల్లిని దూషించారనినువ్వు దిగ్భ్రాంతి చెందావుఅది న్యాయమే!కానీ...ఒక తల్లి కళ్లముందేకొడుకును మత మూకలు చంపినప్పుడునీ గుండె ఎందుకు కదలలేదు?ఒక గర్భిణీ పొట్టనుమతం పేరుతో చీల్చినప్పుడునీ సంస్కృతి ఎక్కడ దాక్కుంది?ఒక మైనారిటీ ఇంటి తలుపువిద్వేషపు మంటల్లో కాలిపోయినప్పుడునీ జాలి , దయ ఎక్కడ?దిగ్భ్రాంతిఅధికారపు అద్దంలో కనిపించేనీ ముఖం మాత్రమేనా?లేకరక్తంతో తడిసినప్రజల ముఖాల్లో కూడాదాని ప్రతిబింబం కనిపిస్తుందా?ఒక మనిషినిఅతని మతం అడిగి చంపినప్పుడునీ సంస్కృతిఎందుకు మౌనంగా నిలబడింది?ఒక దళిత యువతిన్యాయం కోసంచివరి శ్వాస వరకు పోరాడినప్పుడునీ గొంతులోఎందుకు ఒక్క నినాదం పుట్టలేదు?ఒక జర్నలిస్టుప్రశ్న అడిగినందుకుఆమె శరీరాన్ని లక్ష్యంగా చేసుకునిఅసభ్య పదాల వర్షం కురిపించినప్పుడునీ సంస్కృతిఎందుకు చెవులు మూసుకుంది?ఆమెను బెదిరించినడిజిటల్
కవిత్వం

అన్వేషణ

ప్రతి రోజూ చుట్టి ముట్టే ఈ పూల పరిమళమే కదానన్ను వెన్నెల్లో తడిపి హృదయాన్ని ముంచేది.ఈ మల్లెల వెలుగులోనే కదానీ నవ్వులు మెరిసిపోతుంది.ఇన్ని సువాసనల వెనుక నలిగే జీవితాలు లేవంటావాఎండలో పేలే దేహాలు ఇక్కడ చూడలేమంటున్నావా నువ్వు చూపే పూల దండ వెనుక చేతులు నలిగిన కథలను తెలుసుకోకాసిన్ని కన్నీటి ప్రవాహాలు దాగుంటాయి పెదవులు పూసే ఉదయం విరాజితమై ఇలా పువ్వుల్లా పరిమళిస్తుంది.జీవితం నిగూఢంగా ధారమై ప్రవహిస్తుంది.మట్టి దేహాలు మొగ్గల్లా ఎదిగి సువాసనలకి ఆధారమౌతుంటే గొడుగు కింద పూలమ్మే ముసలమ్మ ప్రాణవాయువు ఇక్కడే పైకి లేస్తుంది.ఈ మాల దేవునిదైనా పెళ్ళింటి సందడిదైనా పుష్ప గుచ్ఛమై ప్రేమను అలంకరించినా ప్రేమ
కవిత్వం

రెడ్ క్లిఫ్

ఆయన తనకిచ్చిన పనిమీద వచ్చినప్పుడు నిష్పక్షపాతంగానే వచ్చాడు భిన్నమైన ఆహారపు అలవాట్లతో సరిపడని దేవుళ్లతో ఉన్మాదంలో ఉన్న రెండు సముదాయాలున్న ఈ దేశాన్నిఆయన కళ్ళుఎన్నడూ చూడలేదు కానీ విభజించడానికి వచ్చాడు లండన్ లోనే వాళ్లు ఆయనకు వివరించారు "సమయం చాలా స్వల్పంగాఉంది ఇద్దరినీ సర్దుకోండని చెప్పడానికైనా, సహేతుక చర్చకైనా ఇప్పుడింకా చాలా ఆలస్యమైపోయిందిపరిష్కారం ఇప్పుడు దేశ విభజన లోనే ఉంది ఆయన లేఖను బట్టి చూస్తే ...వైస్రాయి సాహచర్యంలో నువ్వు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అందుకని నీకు వేరే వసతి కల్పించే ఏర్పాటు చేయమన్నాం నీకు ఇద్దరు న్యాయమూర్తులనిస్తాం సంప్రదించడానికి, ఇద్దరు ముస్లింలు ఇద్దరు హిందువులుకానీ
కవిత్వం

జైలు గోడల మధ్య ఆరు పుట్టిన రోజులు

దేఖ్ నా హై జోర్ కిత్నా హై బాజు ఏ కాతిల్ మే - ప్ర‌ముఖ హిందీ క‌వి(ఉరిశిక్ష అమలు చేసే వాడి చేతిలో ఎంత బలం ఉందో చూద్దాం)ఆరు పుట్టిన రోజులు ఎత్తైన గోడల మధ్య గడచి పోయాయి ఆరు సుదీర్ఘ సంవత్సరాలుప్రతిరోజూ సూర్యుడు తీహార్ ఎత్తైన గోడలను తాకాడు కానీ నీ స్వేచ్ఛ కు మాత్రం ఊతమీయలేక పోయాడుఉమర్..నిన్ను ఇనుప తలుపుల వెనుక బంధించారుకానీ నీ చిరునవ్వును బంధించ గలిగారా? నీ స్వరాన్నీ దాని ధైర్యాన్నీ దేశం గాయపడుతున్నప్పుడు దేశపు వీధుల్లోకి నిన్ను తీసుకొచ్చిన కలనూ బంధించలేకపోయారుఆరు కొవ్వొత్తులు ఆరు సంవత్సరాల నిరీక్షణబయట స్నేహితులు నీ
కవిత్వం

రోడ్డు గీతం

అలా రోడ్డు మీద వెళుతుంటానా..ఏదో ఒక మ‌లుపులో పోలీసు క‌నిపిస్తాడుపెదాలు బిగ‌బ‌ట్టి ప‌ల‌క‌రిస్తాఅలా మార్కెట్‌కు వెళుతుంటానా..ముఖం లేని ఆకారాలు ఎదురుప‌డ‌తాయిఅప్ర‌య‌త్నంగా త‌ప్పుకొంటా..నా పైకి మేఘం వంగి చూస్తుందినిటారుగా నిల‌బ‌డ్డానా లేదా అని..దాటి వ‌చ్చేస్తాను..నా మీదుగా న‌ది పారుతుందిఏదో అన‌బోతుందిదాటి వ‌చ్చేస్తానుఅలా రోడ్డు మీద వెళుతుంటానా..న‌లుగురు పిల్ల‌లు చేతుల‌కుసంకెళ్ల‌తో న‌న్ను దాటిపోతారుత‌ల‌పై నాలుగు రెక్క‌లు ట‌ప‌ట‌ప కొట్టుకుంటాయివింజామ‌ర‌లా..? కాద‌నుకుంటా..టప‌ట‌ప‌.. ఏదో వికారం..జిగ‌ట‌ట‌ప‌ట‌ప‌.. మార్కెట్లో దొర్లిపోయిన‌ కూర‌ల త‌ట్ట‌..కాలు మెలి ప‌డింద‌నుకుంటాట‌ప‌ట‌ప‌.. కొట్లు క‌ట్టేసి గుంపు ఎటోక‌టుక‌థ‌లూ కాక‌ర‌కాయ‌లా.. ఎవ‌రి మీద‌కో దూసుకెళ్తున్న తూటాఎవ‌రో నెడితే... తోసేస్తే ..ప‌క్క‌కు లాగేస్తే..1001వ సారి జీవితానికి మొక్కి రోడ్డెక్కుతా..ఎవ‌రు క‌నిపించినా ఈసారిప‌ల‌క‌రించ‌డానికి పెదాలనుమ‌రింత బిగించాల‌నే
కవిత్వం

కాలమంతా కాక్రొచులుదే!

అనుకుంటివా ఈరోజు ఒకటి వస్తుందని...ఇలాంటి రోజులు కూడా ఉంటాయని...బక్క పల్చని పిల్లలే భరి గీసి నిల్చుంటరనిజంతర్ మంతరే జనసంద్రమై హోరెత్తుతుందనికంటివి కదా పగటి కలలు...ఎల్లకాలం జనాలనునిద్రమత్తులో ముంచెత్తుతామనిఅసాంఘిక శక్తులంటివివిదేశీ శక్తులంటివి కదా కాళ్ళు విరిగినాచేతులు తెగినా తలలు పగిలినా...రక్తం ఎరులై పారినా...తల్లడిళ్లుతూ... తుళ్ళిపడుతూ ...ఒంటి చేతితోసైనిక వాహనాలనాపగలరని?దారిపొంట పోయే,ఒంటరి మహిలే,దావానంలా...వ్యాపించగలదని ?అనుకుంటివా...?గాడ్సేను పొగిడేటి నీకాలపు గారడీలు...సోనం కాలి దూలిగా మారుతుందని ?ఊహ కాదు ఉత్తుత్తి మాట కాదు,ఉద్యమమంటే !నిజంకదా నిజంకదా జంతర్ మంతర్ నిజమే కదా!నిలబడ్డాననుకుంటివినిటారుగా ఛాతి విరుచుకునిజారి పడితివి కదా...ఒకే ఒక జెన్ జీ ల కుదుపుకు !కాసుకో.... చుసుకో...కాలమంతా కాక్రొచులదే !
కవిత్వం

శిధిలాల మధ్య సంధి

పోటీ మొదలైంది అక్షరాలు మొలకెత్తాల్సిన పేపర్లమీద నెత్తుటి మందారాల రంగు పూస్తుంది రణధూళి పొరల మధ్య పిల్లల ఆకలి ఏడుపుల మధ్య ఈ సంధి విలువెంత ?శిథిల యినుప ఊసకు వేలాడిన బిడ్డ తల్లి అరుపుల శోకం మధ్య ఈ సంధి విలువెంత? ఎత్తయిన హర్మ్యాల నాగరికతల సాంకేతికత నేలచూపులు చూసిన అనాగరిక దూరచూపు వర్తమానమెంత? ఇప్పుడు ఇక్కడ ఏ పాఠశాల గోడను ముట్టుకున్నా కేరింతల్లాగిన పిల్లల కుర్చీలు కదలాడుతాయి. దేహం నుంచి వేరైన చేతులు బలపాల కోసం వెతుకుతాయి. రంగురంగులతో తడవాల్సిన పుస్తకాలిప్పుడు నెత్తుటిరంగుతో హోళీ చేసుకుంటున్నాయి హాయిగా నిద్రపోతున్న దేహాలిప్పుడు మృతదేహాలయ్యాయి ఇప్పుడు ఏ తూనీగ
కవిత్వం

తగులబడుతున్నది దేశం

అడివంటుకున్నదివిద్యార్థి కొలిమంటుకున్నదియువభారతదేశం ఇపుడొక నిప్పుగుండంమీ పోలీసు ఉద్యోగభత్యంభద్రంగా ఉండనీ, మీకు ఇంక్రిమెంట్లు రానీలక్షలాదిబిడ్డలుఅడిగిందే తప్పయితేమీరు చేసిందేమిటి తండ్రీసిగ్గనిపించని ఉద్యోగవిధులా? వెనక నిధులా?వాళ్ళకెవడో డబ్బులిచ్చాడట?తెలియని గవర్నమెంటు దేనికి? ద్రోహి ఎక్కడ? ద్రోహమెక్కడ?వాళ్ళంతా విదేశీపోషకులైతేస్వదేశీయంత్రాంగం పెనునిద్దురలో వుందా?హైద్రాబాద్ నుంచి బువ్వ పంపిస్తేఖిలిస్తాన్ లీడర్ కైంకర్యమా?ఇంత గొప్ప ఇంటలిజెన్సా మీదిపేర్లపట్టీలు లేకుంట పోలీసులెవరు?అసలు డ్రెస్సు, అడ్రస్సులేని గూండాల మీకు ఆసరా?ఇంత పిరికోల్లకెందుకురా పదవులు?రాజీనామాలడిగారు కదా చెయ్యండిపోలీసులంటే ఆడ, మగతనాలు మరిచిచదువుకునే పిల్లల ఉసురు తీయడానికేనా?ఏడ మీ ఉద్యోగం? ఏడ మీ మనిషితనం?ఎందుకురా బానిసలకొక బానిసగా బతుకుతెరువు?తెరువు కండ్లు, చూడు దేశం?నిజమేందో, నిష్టూరమేందోభయమేందో, సత్యమేందో?చావు భయం తెలియని తరంవెనుకడుగెరుగని యువతరంఅడుగెస్తే భయమేస్తేదాచుకో అధికారపు విషపడగలవెనకనువ్వు
కవిత్వం

దీపక్ భారతి కవితలు

1. రామరాజ్యం అంటే భయంనాకు రామరాజ్యం అంటే భయం వేస్తుందిఎందుకంటే...వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి పాలనలోనే శంబూకుడు హత్య చేయబడ్డాడు సీత అవమానాలకు, బాధలకు గురైంది. దాసులు, శూద్రులు, ఆదివాసులు అవమానించబడ్డారు. గాంధీ యొక్క రామరాజ్యంలో శూద్రులు, దళితులు, ఆదివాసులు, మహిళలు… వెనుకబడిన వర్గాల్లోని అత్యంత వెనుకబడినవారు వెనుకబడిన వారుగానే మిగిలిపోయారు. అధికారం, సౌఖ్యం మాత్రం అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలకే దక్కింది.మరి నేటి రామరాజ్యంలో?ఇక్కడ మెజారిటీ ప్రజలు కేవలం వేధించడం మాత్రమే కాదు నేరుగా "బుల్డోజర్" చేయబడుతున్నారు.మొత్తం సమాజాన్ని ద్వేషం అనే మత్తుమందుతో ముంచేస్తున్నారు.అందుకే రామరాజ్యం పేరుతో జరుగుతున్న ఈ "అభివృద్ధి" నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది."జై శ్రీరామ్"