సమకాలీనం

భీమా కోరెగావ్ శౌర్య దివ‌స్ లో మనువాద వ్య‌తిరేక స్ఫూర్తి 

దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద భావజాలం కలిగిన ఒక లాయర్ బూటుతో దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ తన మతానికి చెందిన దేవునిపై న్యాయమూర్తి వ్యాఖ్యలను నిరసిస్తూ దాడిచేశానని తనకు పశ్చాతాపం లేదని చెప్పారు. ఆ వ్యక్తిపై  కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  అదే నెల 7 వ తేదిన హర్యానాలో కుల వివక్షత భరించలేక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొన్నారు. అతను యస్సీ కులానికి చెందినవారు కావడంతో
ఓపెన్ పేజీ

హద్దులు లేని ద్రోహ చింతన

అప్రియ వచనాలు మాట్లాడనవసరం లేకుంటే బాగుండు. వ్యక్తులనుద్దేశించవలసిన కానికాలాన్ని ఎవరం కోరుకుంటాం? సత్యమే గీటురాయి అనుకుంటాంగాని, అందరికీ సత్యమే పరమం కానవసరం లేదు. ప్రకృతిలో తిరుగులేని సత్య భావన సమాజంలో తరచూ భంగపడుతూ ఉంటుంది. ప్రయోజనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సత్యాన్ని బతకనీయవు. కనీసం అందరికీ ఆమోదమయ్యే సత్యంగా నిలబడనివ్వవు. అందువల్ల సమూహాలతోపాటు మనుషులనూ ఉద్దేశించే సంభాషణ సాగవలసి వస్తుంది. విప్లవంలోని అనన్య సామాన త్యాగాల గురించి మాట్లాడటానికి ముఖం మొత్తిన కొంద‌రు మేధావులు సహితం ద్రోహాన్ని ద్రోహమని చెప్పేసరికి లేచి కూచున్నారు. ఎవరి ప్రియాలు వారివని సరిపెట్టుకోవచ్చు. కానీ సత్యాన్ని దాచేద్దామనుకున్నాక మాట్లాడక తప్పదు కదా. ద్రోహం గురించి
అలనాటి రచన

క్రిటికల్‌ రియలిజం

మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి.  పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా పేర్కొనడం సరికాదు. భౌతిక ప్రపంచం లేకుండా భావప్రపంచం వుండదు గనక, వీటిని ఒకే ప్రపంచంలో రెండు విభాగాలని అనవచ్చు. భౌతిక ప్రపంచమే మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా నాడీ కేంద్రమైన మెదటి కెక్కి, చైతన్యంగా రూపొందుతుంది. మెదడు చాలా జటిలమైన పదార్థం. భౌతిక పదార్థానికి అది అత్యున్నతమైన రూపం. దాని పనిపాటులనే బుద్ధిగా, అనుభూతిగా - మనస్సుగా - ఎన్నోపేర్లతో పిలవడం జరుగుతూంది. మెదడు నిర్మాణంలో ఒక పార్శ్వంలా మరొక పార్శ్వం
ఆర్ధికం

ఆర్థిక అసమానతలో అగ్రస్థానం భారత్‌దే!

ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు. ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచవ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల కన్నా
మీరీ పుస్తకం చదివారా ?

కత్తుల వంతెనపై సమాజం

నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు  సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన  వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు
సమకాలీనం

మోడీ కాలంలో మీడియా

(ముంబై నుండి ప్రచురితమయ్యే  మిడ్ - డేలో ఎజాజ్ అష్రాఫ్ ఆరు సంవత్సరాల నుండి రాస్తున్న కాలమ్‌ను ఆపివేశారు. సోమవారం కాలమ్‌లో సమాధి వ్యాసంతో అతను తన కాలమ్ మరణాన్ని ప్రకటించాడు. సీనియర్ జర్నలిస్ట్, ‘భీమా కొరేగావ్: ఛాలెంజింగ్ కాస్ట్’ రచయిత ఎజాజ్ అష్రాఫ్ రాసిన వ్యాసం ఇది – జాన్‌చౌక్ సంపాదకమండలి) ఎందుకంటే అది ఆఖరి శ్వాస తీసుకుంటోన్న ‘మండే బ్లూస్‌’*కి నివాళులర్పించాలని అనిపిస్తోంది; మీరు ఈ రోజు దాని చివరి విడత చదవడం పూర్తి చేయగానే, అది ఎలాంటి హడావిడీ, విచారమూ లేకుండా కనుమరుగైపోతుంది. అయితే, నేను నా ఆలోచనలను చాలా వరకు స్వతంత్రంగా వ్యక్తం
ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
సమకాలీనం

ఆ విద్యార్థులు చేసిన నేర‌మేమిటి?

When questions become crimes and students become ‘Maoists’; I can’t breathe, Indian edition A young tribal student from Kerala found himself pinned to the ground, a constable straddling his chest and forcing his head into the pavement at an awkward angle while two others yanked at his arms and legs. నవంబర్ 23, ఆదివారం నాడు ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గరకు వచ్చిన అనేక మంది నిరసనకారుల మధ్య కేరళకు చెందిన ఒక యువ ఆదివాసీ విద్యార్థి కూడా
మీరీ పుస్తకం చదివారా ?

అమ్మ‌కు జేజేలు

విమర్శకు ప్రమాణాలు ఏమిటి? వొక రచన బాగుందా లేదా అని చెప్పడానికి ఏమైనా తూనికరాళ్లున్నాయా? మాట్లాడుతున్న విమర్శకులు ఏ సాహిత్యప్రక్రియ గూర్చి మాట్లాడుతున్నారు? కవిత్వము, కథ, నవల, నాటకం ఇలా ఉండగా అన్నింటనీ వొకే గాడిన కట్టేస్తున్నారా? తెలుగు విమర్శ ఎంత అత్యున్నతంగా ఎదిగందంటే ప్రమాణాలు లేవు అనే పేలవమైన కామెంట్లు చేసే స్థితికి చేరింది. పోనీ ప్రమాణాలేవో చెబుతారా అంటే అలా కూడా చెప్పరు. ఈ తరహా ఆలోచన తిరోగమనస్థితికి సంకేతం. ఈ సంక్లిష్ట, సందిగ్ధ సందర్భంలో వొక కవిత్వంలో ప్రమాణాల గూర్చి చర్చిద్దాం. నీలిమ విపస్‌ రావు కవిత్వం ఆగ్రహి చూద్దాం. ఈ కవిత్వంలో ఉన్న 
ఆర్ధికం

మోడీ ఏలుబడిలో అప్పుల భారతం

మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉంది. యేటా చెల్లిస్తున్న వడ్డీ రూ. 12,76,338 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో