క్రిటికల్ రియలిజం
మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి. పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా పేర్కొనడం సరికాదు. భౌతిక ప్రపంచం లేకుండా భావప్రపంచం వుండదు గనక, వీటిని ఒకే ప్రపంచంలో రెండు విభాగాలని అనవచ్చు. భౌతిక ప్రపంచమే మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా నాడీ కేంద్రమైన మెదటి కెక్కి, చైతన్యంగా రూపొందుతుంది. మెదడు చాలా జటిలమైన పదార్థం. భౌతిక పదార్థానికి అది అత్యున్నతమైన రూపం. దాని పనిపాటులనే బుద్ధిగా, అనుభూతిగా - మనస్సుగా - ఎన్నోపేర్లతో పిలవడం జరుగుతూంది. మెదడు నిర్మాణంలో ఒక పార్శ్వంలా మరొక పార్శ్వం






