హద్దులు లేని ద్రోహ చింతన
అప్రియ వచనాలు మాట్లాడనవసరం లేకుంటే బాగుండు. వ్యక్తులనుద్దేశించవలసిన కానికాలాన్ని ఎవరం కోరుకుంటాం? సత్యమే గీటురాయి అనుకుంటాంగాని, అందరికీ సత్యమే పరమం కానవసరం లేదు. ప్రకృతిలో తిరుగులేని సత్య భావన సమాజంలో తరచూ భంగపడుతూ ఉంటుంది. ప్రయోజనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సత్యాన్ని బతకనీయవు. కనీసం అందరికీ ఆమోదమయ్యే సత్యంగా నిలబడనివ్వవు. అందువల్ల సమూహాలతోపాటు మనుషులనూ ఉద్దేశించే సంభాషణ సాగవలసి వస్తుంది. విప్లవంలోని అనన్య సామాన త్యాగాల గురించి మాట్లాడటానికి ముఖం మొత్తిన కొందరు మేధావులు సహితం ద్రోహాన్ని ద్రోహమని చెప్పేసరికి లేచి కూచున్నారు. ఎవరి ప్రియాలు వారివని సరిపెట్టుకోవచ్చు. కానీ సత్యాన్ని దాచేద్దామనుకున్నాక మాట్లాడక తప్పదు కదా. ద్రోహం గురించి






